»   » ఎట్టకేలకు...తన జెండర్ గురించి మాట్లాడిన కరణ్ జోహార్!

ఎట్టకేలకు...తన జెండర్ గురించి మాట్లాడిన కరణ్ జోహార్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ ‘గే' ప్రచారం చాలా కాలంగా ఉంది. చిన్న తనంలో కూడా ఆయన ఈ అంశానికి సంబంధించి చాలా సమస్యలు ఎదుర్కొన్నారట. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారట. తాజాగా కరణ్ జోహార్ ఈ అంశంపై స్వయంగా మాట్లాడారు. జైపూర్ లో గురువారం ప్రారంభమైన లెక్చరర్ ఫెస్టివల్ లో ఆయన ఇందుకు సంబంధించిన తన మనసులోని భావాలను పంచుకున్నారు.

ఈ సందర్భంగా కరణ్ జోహార్ మాట్లాడుతూ...‘Pansy(స్వలింగ సంపర్కానికి అలవాటు పడిన పురుషుడు) అనే పదం నాకు అస్సలు నచ్చదు. చిన్నతనంలో నా సమస్య ఏమిటో తెలియక సతమతం అయ్యేవాన్ని, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. మిగతా పిల్లలకంటే నేను విభిన్నం(effeminate) అని తెలుసుకున్నాను. ఈ విషయంలో నాకు నా తల్లిదండ్రులు పూర్తి సపోర్టుగా నిలిచారు' అని తెలిపారు.

ఒకానొక సందర్భంలో నేను 150 కేజీల బరువు పెరిగాను. ఆసమయంలో మా అమ్మ నువ్వు ఈ ప్రపంచంలోనే బెస్ట్ లుకింగ్ చైల్డ్ అని చెప్పేది. నువ్వు కొంచెం బరువు తగ్గితే హిందీ సినిమాల్లో హీరో అవ్వొచ్చు అనే వారు... అని కరణ్ జోహార గుర్తు చేసుకున్నారు.

KARAN JOHAR ABOUT HIS GENDER

తన సినిమాల్లో హోమోసెక్సువాలిటీ అంశాన్ని నెగెటివ్ గా చూపించడంపై.... కరణ్ జోహార్ స్పందిస్తూ ఈ అంశాన్ని సినిమాల్లో చర్చించిన మొదటి ఫిల్మ్ మేకర్ ను నేను అని చెప్పుకొచ్చారు. కల్ హో నహో, దోస్తానా.....సినిమాల్లో ఈ అంశాలపై చర్చ ఉంది. తర్వాత చాలా మంది యంగ్స స్టర్స్ నుండి నాకు లెటర్స్ వచ్చాయి. తమ పేరెంట్స్ తమ సెక్సువాలిటీ గురించి ఐడెంటిఫై చేయడానికి ఈ సినిమాలు చాలా దోహదపడ్డాయని రాసారు. ఇపుడు చాలా సినిమాల్లో ఇలాంటి అంశాలు వస్తున్నాయి. నా సినిమాలతో ఇది మొదలైనందుకు గర్వంగా ఉంది అన్నారు.

తన ఫ్యామిలీ ఒకానొక సమయంలో కష్టకాలం ఎదుర్కొన్న అంశాలను కూడా చెప్పుకొచ్చారు కరణ్. మా నాన్న అప్పట్లో కొన్ని ఫ్లాప్ మూవీల కారణంగా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారు. ఇంటితో పాటు నగలు కూడా అమ్ముకునే పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో నన్ను ఎవరూ లంచ్ పార్టీలకు కూడా పిలిచేవారు కాదు. నా జీవితంలో అదొక భయానకమైన సందర్భం అని చెప్పారు కరణ్ జోహార్.

షారుక్ తో విబేధాలు వచ్చాయనే అంశాపై స్పందిస్తూ....ఏ రిలేషన్ షిప్ లో అయినా అప్ డౌన్స్ ఉంటాయి. షారుక్ ఫ్యామిలీ నా ఫ్యామిలీలో భాగమే అన్నారు. తన బెస్ట్ ఫిల్మ్ ‘కభి అల్విదా న కెహ్మా' అని తెలిపారు. లేటెస్టుగా అయితే ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' అంటే ఇష్టం. ఎదుకంటే ఈ చిత్రం ముగ్గురు మంచి నటులను బాలీవుడ్ కి అందించింది అన్నారు.

English summary
With his candid confessions on how he was "effeminate as a child" and how he used to have "sleepless nights" over the issue, Bollywood filmmaker Karan Johar stole the show on the first day of the Jaipur Literature Festival which began on Thursday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu