twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    SS Rajamouli సినిమా చూసి సీటులో నుంచి లేచి చప్పట్లు కొట్టా.. RRR మరో చరిత్రకు సిద్దం.. కరణ్ జోహర్ వ్యాఖ్యలు

    |

    బాలీవుడ్ చిత్రం బ్రహస్త్ర చిత్రం మోషన్ పోస్టర్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అమితాబ్ బచ్చన్, నాగార్జున అక్కినేని, ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ లాంటి స్టార్ నటులు నటిస్తున్న ఈ చిత్రాన్ని కరణ్ జోహర్ నిర్మిస్తున్నారు. తెలుగులో దిగ్జజ దర్శకుడు రాజమౌళి సమర్పిస్తున్నారు. ఈ సినిమా మోషన్ పోస్టర్ లాంచ్ హైదరాబాద్‌లో జరిగింది. సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ..

    రక్తం, చెమట ధారపోశాం..

    రక్తం, చెమట ధారపోశాం..

    ఇప్పటి వరకు నేను ఎన్నో సినిమాల గురించి, ఎంతో మంది దర్శకులు గురించి మాట్లాడాను. కానీ బ్రహ్మస్త్ర సినిమా ఓ ప్రత్యేకత కలిగిన చిత్రం. బ్రహ్మస్త్ర ఒక సినిమా కాదు... ఒక ఎమోషన్. ఆయాన్ నాకు నా మొదటి సంతానం లాంటి వాడు. ధర్మ ప్రొడక్షన్‌లో కీలకమైన వ్యక్తి. ఈ సినిమా కోసం రక్తం,చెమట, జీవితాన్ని ధారపోశాడు. దాదాపు ఏడేళ్లు ఈ సినిమా గురించి కష్టపడుతూనే ఉంది. శ్రమశక్తికి నిదర్శనం బ్రహస్త్ర సినిమా. ఈ సినిమాకు పనిచేసిన, ప్రోత్సాహం అందించిన వారు ఎంతో మంది. వారి సేవలు మరువలేనవి అని కరణ్ జోహర్ అన్నారు.

    ప్రభాస్, రానా మాదిరిగానే రణ్‌బీర్

    ప్రభాస్, రానా మాదిరిగానే రణ్‌బీర్

    రణ్‌బీర్ కపూర్, ఆలియా, అమితాబ్ లేకుంటే బ్రహ్మస్త్ర లేదు. బాహుబలి సినిమా సమయంలో ప్రభాస్, రానా తమ జీవితాలను అంకితం చేశారని చెప్పారు. అదే విధంగా రణ్‌బీర్ కూడా ఏడేళ్లుగా ఈ సినిమా గురించి తపించిపోతున్నారు. ఈ సినిమా స్టార్ అయిన తర్వాత సీజన్లు మారాయి. వాతావరణం మారింది. ప్రభుత్వాలు మారాయి. కానీ బ్రహ్మస్త్రలో ఆ మార్పు కనిపించలేదు. నిరంతరంగా ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచేందుకు సిద్దమవుతున్నది అని కరణ్ జోహర్ తెలిపారు.

    ఆలియా భట్ వెటరన్‌గా మారింది..

    ఆలియా భట్ వెటరన్‌గా మారింది..

    బ్రహ్మస్త్ర సినిమా ప్రారంభమైనప్పుడు ఆలియా సినిమా తెరకు కొత్తగా పరిచయమైన నటి. కానీ ఇప్పుడు ఆమె ఇండస్ట్రీలో వెటరన్‌గా మారిపోయారు. సీనియర్ నటుల్లో ఒకరని చెప్పవచ్చు. ఆలియా ఈ సినిమాలో భాగం కావడం, అలాగే RRR సినిమాలో కీలకమైన పాత్ర పోషించడం గర్వంగా ఉంది. నా చేతులు మీదుగా పరిచయమైన ఆలియా ఈ స్థాయికి చేరుకోవడం చాలా సంతోషంగా ఉంది అని కరణ్ జోహర్ తెలిపారు.

    రాజమౌళికి, నాకు ఒకే పోలిక

    రాజమౌళికి, నాకు ఒకే పోలిక

    ఇక సినిమా కెరీర్‌లో రాజమౌళికి నాకు ఒక పోలిక ఉంది. ఆయన తన తొలి చిత్రంగా స్టూడెంట్‌ నెంబర్ 1 తీస్తే.. నేను సూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమా తీశారు. అయితే ఆయన తీసినట్టు నేను సినిమాలు తీయలేదు. బాక్సాఫీస్‌ను కొల్లగొట్టినట్టు రాజమౌళితో పోటీ పడలేను. కేవలం స్టూడెంట్ అనే టైటిల్‌తో ఇద్దరం తీయడం నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఈగ సినిమాను థియేటర్‌లో చూసినప్పుడు.. సీటులో నుంచి లేచి చప్పట్లు కొడుతూ ఎమోషనల్ అయ్యాను. ఈగతోనే ఇలాంటి సినిమా తీస్తే.. మనుషులతో ఎలాంటి సినిమాలు తీస్తాడో అనే ఫీలింగ్ కలిగింది. ఆ తర్వాత బహుబలి ద్వారా ప్రపంచానికి తన సత్తాను చూపించాడు అని కరణ్ జోహర్ అన్నారు.

    ప్యాన్ ఇండియాకు అర్దం చెప్పిన నటుడు

    ప్యాన్ ఇండియాకు అర్దం చెప్పిన నటుడు

    బాహుబలితో ఇండియన్ సినిమా ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పారు. ఆ సమయంలో నా ఆఫీస్‌లో కలిసిన రాజమౌళితో.. మీ సినిమాను హిందీలో రిలీజ్ చేయడానికి అవకా: ఇవ్వమని చేతులు జోడించి అడిగాను. మీ జీనియస్‌ను ప్రపంచానికి చెప్పడానికి నాకు అవకాశం కల్పిస్తుందని చెప్పింది. బాహుబలి తర్వాతే ప్యాన్ ఇండియా అనే పదం తెరపైకి వచ్చింది. ఇండియాలోనే కాదు.. అనేక దేశాలకు బాహుబలిని తీసుకెళ్లిన ఘనత ఆయనకే దక్కింది అని కరణ్ జోహర్ తెలిపారు.

    RRR సినిమాతో చరిత్ర సృష్టించడానికి

    RRR సినిమాతో చరిత్ర సృష్టించడానికి

    ఇక RRR సినిమాతో ప్రపంచానికి మరోసారి తన సత్తాను చాటబోతున్నారు. జనవరి 7వ తేదీన RRR సృష్టించే ప్రభంజనం గురించి వేచి చూస్తున్నాను. ఈ సినిమా పరిశ్రమలో మీతోపాటు నేను ఊపిరి తీసుకొంటూ నిలబడ్డానని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది అని కరణ్ జోహర్ అన్నారు. బ్రహ్మస్త్రను సమర్పిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పారు.

    English summary
    Karan Johar's Brahmastra motion poster released at Hyderabad. In this occassion, Karan Johar about SS Rajamouli's Baahubali, RRR movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X