»   » ఇండియన్ సినిమాకు కొత్త సూపర్ హీరో.. ఈ దశాబ్దం ఆయనదే..రాజమౌళిపై కరణ్ ప్రశంసల వర్షం..

ఇండియన్ సినిమాకు కొత్త సూపర్ హీరో.. ఈ దశాబ్దం ఆయనదే..రాజమౌళిపై కరణ్ ప్రశంసల వర్షం..

Posted By:
Subscribe to Filmibeat Telugu

భారతీయ సినిమా పరిశ్రమలో అందరినోట బాహుబలి తప్ప మరో మాట వినిపించడం లేదు. అందుకు కారణం ప్రపంచవ్యాప్తంగా బాహుబలి ప్రభంజనం కొనసాగడమే. ఈ చిత్రంలో నటించిన ప్రభాస్ ఇతర నటీనటులు జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొన్నారు. బాహుబ‌లి సినిమాకు సంబంధించినంత‌వ‌ర‌కు ప్ర‌భాస్ కంటే రాజ‌మౌళి పేరే దేశ‌వ్యాప్తంగా మార్మోగుతున్నది. ఈ నేపథ్యంలో రాజమౌళిపై ప్రముఖ దర్శకుడు కరణ్ జోహర్ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

కొత్త సూపర్ హీరో..

భారతీయ సినిమా పరిశ్రమకు కొత్త సూప‌ర్‌ హీరో రాజ‌మౌళి. ఈ ద‌శాబ్దం ఆయ‌న‌కే చెందుతుంది. భావితరాలకు ఆయ‌న ఆద‌ర్శ‌ం అని క‌ర‌ణ్ జోహర్ ట్వీట్ చేశారు. బాహుబలి1, బాహుబలి2 చిత్రాల పంపిణీ బాధ్యతను కరణ్ జోహర్ తీసుకొన్నాడు. ప్రాంతీయ చిత్రంగా ప్రారంభమైన బాహుబలికి జాతీయ గుర్తింపు రావడానికి కరణ్ ప్రమోషన్ అద్బుతంగా ఉపయోగపడింది. అది కేవలం జాతీయ స్థాయికే పరిమితి కాకుండా అంతర్జాతీయంగా సినిమా గురించి తెలిసేలా చేసింది.

కరణ్ ప్రమోషన్ వల్లే..

కరణ్ ప్రమోషన్ వల్లే..

కరణ్ జోహర్ చేసిన ప్రమోషన్, పంపిణీ ఫలితంగా హిందీలోకి డబ్బింగ్ అయిన చిత్రంగా బాహుబలి1 రూ.100 కోట్ల కలెక్షన్లను సాధించింది. తాజాగా బాహుబలి2 సినిమా భారత్‌లోనే సుమారు రూ.400 కోట్ల వసూళ్లను సాధించింది.

1000 కోట్ల దిశగా..

1000 కోట్ల దిశగా..

తాజా సమాచారం ప్రకారం బాహుబలి2 ప్రపంచవ్యాప్తంగా రూ.860 కోట్ల కలెక్షన్లు సాధించింది. నికరంగా రూ.545 కోట్లు, స్థూలంగా రూ.695 కోట్లు, ఓవర్సీస్‌లో స్థూలంగా రూ.165 కోట్లు సాధించింది. మొత్తంగా రూ.860 కోట్లను కొల్లగొట్టింది. మొదటివారం పూర్తయినా కలెక్షన్ల ప్రవాహం జోరుగానే కొనసాగుతున్నది. మరో రెండు మూడు రోజుల్లో రూ.1000 కోట్ల కలెక్షన్లను సాధించే అవకాశం ఉంది.

క్రెడిట్ రాజమౌళికి..

క్రెడిట్ రాజమౌళికి..

అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రికార్డు స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నది బాహుబలి. ఈ చిత్రం ఘన విజయం కేవలం రాజమౌళికే దక్కుతున్నది. ప్రస్తుతం భారతీయ సినిమా పరిశ్రమకు బ్రాండ్ అంబాసిడర్ అనే మాట బలంగా వినిపిస్తున్నది.

English summary
Filmmaker Karan Johar took to Twitter to appreciate SS Rajamouli for the phenomenal success of Baahubali: The Conclusion. Karan had acquired the distribution rights of Baahubali 1, which went to become the first dubbed film in Hindi to rake in more than Rs 100 crore at the box office. With the stupendous success of Baahubali 2, it's safe to say that the part 1 is a minuscule compared to its successor. For the same, Karan Johar took to Twitter to heap praise on SS Rajamouli, calling as the "new superhero".
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu