Don't Miss!
- News
ఆపరేషన్ ఆకర్ష్: తెలంగాణ బీజేపీలో కీలక పాత్ర పోషించనున్న ఈటల రాజేందర్!
- Sports
IND vs ENG: ఇదెక్కడి పిచ్ రా అయ్యా.. ఇన్నింగ్స్ బ్రేక్‌లో రోలర్‌తో తొక్కించారా? వసీం జాఫర్ సెటైర్!
- Finance
20,000 డాలర్లకు దిగువనే బిట్ కాయిన్, క్రిప్టో మార్కెట్ ఇంకా ఆ స్థాయిలోనే
- Lifestyle
Finance and career horoscope: జూలైలో 12 రాశుల ఆర్థిక మరియు కెరీర్ జాతకం..మరి మీ రాశికి ఎలా ఉందో తెలుసుకోండి..
- Travel
అద్భుత కళాకృతుల నిలయం.. రఘురాజ్‌పూర్..
- Technology
భారత్‌లో 46 వేల ఖాతాలపై నిషేధం విధించిన Twitter!
- Automobiles
భారత మార్కెట్లో సుజుకి కటానా Suzuki Katana స్పోర్ట్స్ బైక్ విడుదల; ధర రూ.13.61 లక్షలు
సల్మాన్ ఖాన్ తర్వాత టార్గెట్ కరణ్ జోహారే.. వెలుగులోకి సంచలనం.. సుశాంత్ వల్లే?
ఇటీవల బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను చంపేస్తానని గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ బెదిరింపు లేఖ పంపాడన్న సంగతి తెలిసిందే. దీంతో పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఈ క్రమంలోనే పోలీసులు సల్మాన్ ఖాన్ కు భద్రత్ర కూడా పెంచేశారు. అయితే లారెన్స్ బిష్ణోయ్ టార్గెట్ లిస్ట్‌లో ప్రముఖ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ పేరు కూడా ఉన్నట్లు సమాచారం. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

కరణ్ జోహార్‌ను బెదిరించి
పంజాబీ గాయకుడు మరియు రాపర్ సిద్ధూ మూసేవాలా హత్య తర్వాత, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మరోసారి వార్తల్లోకి ఏకింది. తాజాగా బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కు బెదిరింపు రావడంతో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హిట్ లిస్ట్‌లో సినీ పరిశ్రమకు చెందిన మరో ప్రముఖ వ్యక్తి పేరు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పోలీసులు చెబుతున్న దాని ప్రకారం, గాయకుడు సిద్దు మూసే వాలా మరణంలో నిందితుడు సంతోష్ జాదవ్ యొక్క సన్నిహితుడైన మహాకాల్ కరణ్ జోహార్‌ను బెదిరించి రూ.5 కోట్ల దోపిడీకి ప్లాన్ చేసినట్లు తెలిపారు.

మహాకాల్ వెల్లడి
సంతోష్, నాగనాథ్ సూర్యవంశీ అనే వ్యక్తులను దాని కోసం సిద్దం చేసినట్టు విచారణలో తేలింది. లారెన్స్ బిష్ణోయ్, అతని గ్యాంగ్ కరణ్ జోహార్ నుండి 5 కోట్ల రూపాయల డబ్బు డిమాండ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని బయటకు వచ్చింది. ఈ విషయాన్ని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లోని సిద్ధేష్ కంబల్ అలియాస్ మహాకల్ వెల్లడించాడు. పోలీసుల విచారణలో ఈ విషయాన్ని అతను బయట పెట్టాడు. కరణ్ జోహార్‌ను బెదిరించడం ద్వారా డబ్బు డిమాండ్ చేయాలని మా గ్యాంగ్ ప్లాన్ చేసిందని సిద్ధేష్ కంబల్ అలియాస్ మహాకాల్ వెల్లడించాడు.

తప్పుడు వాదనలు
కెనడాలోని గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ సోదరుడు విక్రమ్ బ్రార్ తనతో సిగ్నల్ మరియు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మాట్లాడినట్లు మహాకల్ పోలీసులకు చెప్పాడని అంటున్నారు. ఈ వాదనలు ఇంకా ధృవీకరించబడలేదని, సిద్ధేష్ తప్పుడు వాదనలు చేసే అవకాశం ఉందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

హై ప్రొఫైల్ కేసులతో
ఆయన మాట్లాడుతూ, 'కొంతమంది నిందితులతో మాట్లాడినప్పుడు వారు ప్రగల్భాలు పలికిన విషయం ఒప్పుకున్నారు. గొప్పగా చెప్పుకోవడం, ప్రచారం పొందడం కోసం ఇలా పెద్ద వాళ్ళ పేర్లు చేబుతున్నరేమో అనే అనుమానం కూడా ఉందని పేర్కొన్నారు. 'గ్యాంగ్‌స్టర్లు తమ పేర్లను హై ప్రొఫైల్ కేసులతో ముడిపెట్టాలని కోరుకుంటారు, మహాకాల్ ఒక చిన్న చేప అని, అతనికి కరణ్ జోహార్ గురించి విక్రమ్ బ్రార్ చెప్పాడని అన్నారు.

5 కోట్లు వసూలు చేసేందుకు
కేవలం తన గ్యాంగ్ లో ఒకడైన మహాకాల్‌తో బ్రార్ ఎందుకు ఇలా అన్నాడు? అనే విషయం మీద క్లారిటీ లేదని ఆయన అన్నారు. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి సినీ దర్శకుడు కరణ్ జోహార్ కారణమని మహాకాల్ పోలీసులకు చెప్పాడు. అందుకే చిత్ర నిర్మాత కరణ్ జోహార్‌ను బెదిరించి 5 కోట్లు వసూలు చేసేందుకు సిద్ధమయ్యామని ఆయన పేర్కొన్నారు. ఈ నిజం బయటకు వచ్చిన తరువాత, పోలీసులు ఇందులో ఎంత నిజం ఉండనే విషయాన్ని చేధించే పనిలో పడ్డారు.