»   » చాలా నీచంగా రాస్తున్నారు అంటూ.... అంటూ స్టార్ డైరెక్టర్ ఆవేదన!

చాలా నీచంగా రాస్తున్నారు అంటూ.... అంటూ స్టార్ డైరెక్టర్ ఆవేదన!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన కరణ్ జోహార్ గురించి మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక హాట్ న్యూస్ ఉంటుంది. పైగా ఆయన బాలీవుడ్ బడా నిర్మాతల్లో ఒకరు. సినిమాలకు సంబంధించిన వార్తలో, లేక ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంచిన వార్తలో, పుకార్లో ఎప్పుడూ తరచూ వినిపిస్తుంటాయి.

కరణ్ జోహార్.... ఓ స్వలింగ సంపర్కుడని, ఆయనకు చాలా మంది మగాళ్లతో సెక్సువల్ రిలేషన్ షిప్స్ ఉన్నాయనేది బాలీవుడ్ సర్కిల్ లో చాలా కాలంగా వినిపిస్తున్న రూమర్. అఫ్ కోర్స్ తన ఆటోబయోగ్రఫీ 'ఏన్ అన్ సూటబుల్ బోయ్' లో కూడా కరణ్ జోహార్ తన సెక్సువల్ బిహేవియర్ గురించి కొన్ని విషయాలు పరోక్షంగా ఆ రూమర్స్‌కు బలాన్ని ఇచ్చే విధంగా రాసారు అనే టాక్ కూడా ఉంది.

ఆ సంగతి పక్కన పెడితే తనపై ఇటీవల వచ్చిన కొన్ని వార్తలు చాలా బాధ కలిగించాయని అంటున్నారు కరణ్ జోహార్.

చాలా నీచంగా రాస్తున్నారు

చాలా నీచంగా రాస్తున్నారు

ఈ మధ్య ఏదైనా పార్టీలు, ఫంక్షన్లలో మగవారితో కలిసి కనిపించాలంటే భయమేస్తోంది. నేను ఎవరైనా మగాళ్లతో కలిసి కనిపిస్తే మా మధ్య సెక్సువల్ రిలేషన్ ఉందని చాలా నీచంగా రాస్తున్నారు అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కరణ్ జోహార్ ఆవేదన వ్యక్తం చేసారు.

షారుక్ విషయంలో చాలా బాధేసింది

షారుక్ విషయంలో చాలా బాధేసింది

షారూక్‌తో నాకు ఏదో సంబంధం ఉందన్నట్టుగా రాసిన వార్తలు నన్ను కలిచివేశాయన్నారు. షారుక్ నాకు తండ్రి లాంటి వారు, ఒక బ్రదర్ లాంటి వారు .... ఆయనతో నాకు ఇలాంటి రిలేషన్ ఉన్నాయని రాయడం చాలా బాధేసింది అని కరణ్ జోహార్ తెలిపారు.

పట్టించుకోను

పట్టించుకోను

వివాహేతర సంబంధాలు లేకపోతే స్వలింగసంపర్కుడిగా ముద్రవేస్తారన్నారు. నా సెక్సువల్ బిహేవియర్ ఎలాంటిది అనేది నా వ్యక్తిగతం. చాలా మంది నా సెక్స్‌ జీవితం గురించి జోకులు వేస్తుంటారు... అవన్నీ నేను పట్టించుకోను అని కరణ్ జోహార్ అన్నారు.

అందుకే గట్టింగా స్పందించడం లేదు

అందుకే గట్టింగా స్పందించడం లేదు

ఇంతలా ప్రచారం జరుగుతున్నా.... ఎందుకు సైలెంటుగా ఉంటున్నావని చాలా మంది ఫ్రెండ్స్ అంటుంటారు. కానీ నాకు చాలా బాధ్యతలు, పనులు ఉన్నాయి. నా వెనక ఉండి మాట్లాడే వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా నా ముందుకొచ్చి ఇలాంటివేమైనా ప్రశ్నిస్తే తగిన సమాధానం ఇస్తాను అని కరణ్ జోహార్ అన్నారు.

English summary
Karan Johar talks about being traumatized by rumours about him and good friend Shah Rukh Khan. Though he treats SRK as a father figure, an older brother.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu