»   » అనుష్క కెరీర్‌ను నాశనం చేయాలనుకున్నదెవరు?

అనుష్క కెరీర్‌ను నాశనం చేయాలనుకున్నదెవరు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్‌ దర్శక-నిర్మాత కరణ్‌ జోహార్‌ తెరకెక్కించిన చిత్రం 'యే దిల్ హై ముష్కిల్'. ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్, రణబీర్ కపూర్ తో పాటు అనుష్క శర్మ కూడా ప్రధాన పాత్రలో నటించింది. అయితే ఒకప్పుడు ఇదే కరణ్ జోహార్ అనుష్క కెరీర్ నాశనం చేయాలనుకున్నాడట.

మామి ఫిల్మ్ ఫెస్టివల్ లో జరిగిన కార్యక్రమంలో రాజీవ్ మసంద్‌తో జరిగిన ఇంటర్వ్యూలో కరణ్ జోహార్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. యశ్‌రాజ్‌ ఫిలింస్‌ వారు షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కించిన 'రబ్ నే బనాదీ జోడీ' సినిమా ద్వారా అనుష్క శర్మ హీరోయిన్ గా పరిచయం అయింది.

Anushka Sharma

అనుష్కను తీసుకునే ముందు... అపుడు యశ్ రాజ్ ఫిలింస్ వైస్ ప్రెసిడెంటుగా ఉన్న ఆదిత్య చోప్రా.... అనుష్క శర్మ ఫోటోలను కరణ్ జోహార్ కు చూపించారట. అయితే కరణ్ కు ఆమె నచ్చలేదు, అనుష్కను తీసుకోవద్దని సూచించాడట.

అయితే ఆదిత్య చోప్రా.... కరణ్‌ జోహార్ సూచన పట్టించుకోకుండా అనుష్క శర్మను ఆ సినిమాకి తీసుకున్నాడు. అయితే బ్యాండ్‌ బాజా బారాత్‌ సినిమా విడుదలయ్యాక అనుష్కలోని టాలెంట్ ను గుర్తించి తాను.... ఆమె గురించి పూర్తిగా తెలుసుకోకుండా అనవసరంగా ఆమె కెరీర్ నాశనం చేయాలనుకున్నాను అని పీలయ్యాడట కరణ్ జోహార్.

English summary
Did you know Karan Johar wanted Anushka Sharma replaced from Rab Ne Bana Di Jodi. Karan Johar revealed this fact in front of Anushka Sharma, while promoting Ae Dil Hai Mushkil with Ranbir Kapoor.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu