»   » నమ్మరుగానీ ఆ నిర్మాత నేరాల కుప్ప.., 2జీస్కామ్, మాఫియా, అత్యాచారాలు

నమ్మరుగానీ ఆ నిర్మాత నేరాల కుప్ప.., 2జీస్కామ్, మాఫియా, అత్యాచారాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

అత్యంత పాశవికంగా తనమీద అత్యాచారం చేయటమే కాదు తన నగ్న చిత్రాలతో బ్లాక్మెయిల్ చేస్తూ తనని మానసికంగా చిత్రవద చేసాడని చెప్తూ గత జనవరిలో ఒక యువతి బాలీవుడ్ టాప్ నిర్మాత కరీమ్ మొరానీ పై ఫిర్యాదు చేసింది. అక్కడినుంచీ అతని చరిత్రని పరిశీలిస్తే అంతా నేరమయమే.. అయితే ఈ కేసు విషయం లో కరీం మొరానీ ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. తాజాగా బుధవారం రంగారెడ్డి కోర్టు అతడి బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. మార్చి 22లోపు పోలీసుల ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. బాలీవుడ్ నిర్మాత కరీం మొరానీ పై హయత్నగర్ పోలీస్ స్టేషన్ లో ఈ జనవరి లోనే అత్యాచారం కేసు నమోదయ్యింది. ఒకటీ రెండూ కాదు ఏకంగా నాలుగు సెక్షన్లకింద అతని పై కేసులు నమోదయ్యాయి.

మరిన్ని చీకటి విషయాలనూ

మరిన్ని చీకటి విషయాలనూ

అత్యా చార బాదితురాలు డిల్లీకి చెందిన యువతి బీబీఏ విధ్యార్థిని. అయితే సినిమాలపై ఉన్న ఇష్టం తో ముంబై కి వచ్చి నటుడు అనుపం ఖేర్ కు సంబందించిన ఇనిస్టిట్యూట్ లో శిక్షణ తీసుకుంటున్న సమయం లో కొందరు మితృల ద్వారా కరీం మొరానీ తో పరిచయం జరిగిందనీ తెలిపిన ఆమె మరిన్ని చీకటి విషయాలనూ మీడియా ముందుంచింది.

వైన్ లో మత్తుమందు కలిపి

వైన్ లో మత్తుమందు కలిపి

అవకాశం ఇస్తానని చెప్పి తన ఫ్లాట్కి పిఒలిచి వైన్ లో మత్తుమందు కలిపి ఇచ్చిన మొరానీ తనపై అత్యాచారం చేయటమే కాకుండా తన నగ్న ఫొటోలు తీసి వాటిని చూపించి బెదిరింపులకు దిగాడనీ. తానెక్కడుంటే అక్కడికి రప్పించుకుని మరీ తనమీద పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడనీ ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.

హైదరాబాద్ కి రప్పించుకుని

హైదరాబాద్ కి రప్పించుకుని

దిల్ వాలే షూటింగ్ టైమ్ లో హైదరాబాద్ కి రప్పించుకుని మరీ శివార్ల లో ఉన్న హొటల్ గదిలో తనని బందించి పలుమార్లు తనమీద అత్యాచారానికి పాల్పడ్డాడని కూడా తెలిపిన యువతి... ఇన్నాళ్ళూ తన కుటుంబం పరువు పోతుందని ఈ విషయాన్ని బయటపెట్టలేదనీ,, కానీ తన సహనం నశించిపోయేంతగా అతని కృరత్వం భరించలేక ఇప్పుడు బయటపెడుతున్నాననీ తెలిపింది.

బ్లాక్‌మెయిల్ చేశాడు

బ్లాక్‌మెయిల్ చేశాడు

‘‘పదే..పదే నాకు మత్తు మందిస్తూ నాపై అతడు అత్యాచారానికి ఒడిగట్టాడు. నా నగ్న ఫొటోలను తీశాడు. వాటిని చూపించి బ్లాక్‌మెయిల్ చేశాడు. చంపేస్తానని బెదిరించాడు. ఏమైందో..ఏమవుతుందో తెలియని పరిస్థితి నాది. ఎవరికీ చెప్పుకోలేను. నేను అతడి కూతురుకు స్నేహితురాలిని.

కడుపు నొప్పితో తీవ్రంగా బాధపడి

కడుపు నొప్పితో తీవ్రంగా బాధపడి

రెండున్నరేళ్లుగా ముంబైలో ఉంటున్నాను. ఒకరోజు దిల్వాలేలోని ఓ పాట పూర్తైనందుకు గానూ ఓ పార్టీ ఇచ్చాడు. దానికి నన్ను కూడా ఆహ్వానించాడు. ఆ తర్వాత నాకు ఓ గ్లాస్ వైన్ ఇచ్చాడు. తెల్లారే దాకా ఏమైందో తెలియదు. కడుపు నొప్పితో తీవ్రంగా బాధపడిన నేను అత్యాచారానికి గురయ్యానని గ్రహించి.. అతడిని నిలదీశాను'' అని వివరించింది.

మానసిక వేదన

మానసిక వేదన

2015 జూలైలో ఈ ఘటన జరిగిందని, ఆ తర్వాత బెదిరించి పలుమార్లు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె వాపోయింది. ఆ విషయం ఎవరికి..ఎలా చెప్పాలో తెలియక తనలోనే దాచుకున్నానని, చాలా మానసిక వేదనను అనుభవించానని ఆమె తెలిపింది. కరీం మొరానీ కుటుంబ సభ్యులతో మాట్లాడినా లాభం లేకపోవడంతో ఇక పోరాడాలని నిశ్చయించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు బాధితురాలు తెలిపింది.

మార్చి 17న విచారణ

మార్చి 17న విచారణ

కాగా, ఆమె ఫిర్యాదు ఆధారంగా హయత్ నగర్ పోలీసులు మొరానీపై నిర్భయ సహా.. అత్యాచారం, మోసం, కుట్ర పూరిత వ్యవహారాల కింద కేసు నమోదు చేశారు. ఢిల్లీ మహిళా కమిషన్‌లోనూ ఆమె ఫిర్యాదు చేసింది. మార్చి 17న విచారణకు హాజరు కావాల్సిందిగా మొరానీని కమిషన్ ఆదేశించింది. రా..వన్, చెన్నై ఎక్స్‌ప్రెస్, దివాకర్, యోధ, దమ్ వంటి చిత్రాలను కరీం మొరానీ నిర్మించాడు.

అండర్వరల్డ్ తోనూ మంచి సంబందాలు

అండర్వరల్డ్ తోనూ మంచి సంబందాలు

అంతే కాదు కరీం మొరానీ కి అండర్వరల్డ్ తోనూ మంచి సంబందాలున్నాయనీ, మాఫియాలో ఉన్న చాలామందితోనూ అతనికి పరిచయలున్నాయనీ ఆరోపించింది. ఈ నిర్మాత మొరానీ బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ కి అత్యంత సన్నితుడు కావటం గమనార్హం. షారూఖ్ చేసిన రావన్, చెన్నై ఎక్స్ప్రెస్, దిల్ వాలే సినిమాలకు ఇతను సహనిర్మాతగా వ్యవహరించాడు .

2జీ స్పెక్ట్రం స్కాం లో

2జీ స్పెక్ట్రం స్కాం లో

అంతే కాదు 2జీ స్పెక్ట్రం స్కాం లో ప్రధాన నిందితుల్లో ఇతనూ ఒకడు. ఆకేసులో అరెస్టయ్యాడు కూడా. డీఎంకే కరుణా నిధి కూతురు కళిమొని కి 20% వాటా ఉన్న కళైంగర్ టీవీ కి 200 కోట్లు అక్రమంగా డీబీ రియాలిటీ నుంచి తరలించటం లో సహకరించాడని కూడా ఇతని పై ఆరోపణలున్నాయి.

English summary
A month back Bollywood film producer Karim Morani was booked for allegedly raping a Delhi-based woman on promise of marriage. The “Chennai Express” producer had requested for the anticipatory bail but, his application has been Rejected by Court
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu