»   »  సైఫ్ డైపర్లు మారుస్తున్నాడు.. దానిని వివాదం చెయ్యొద్దు!

సైఫ్ డైపర్లు మారుస్తున్నాడు.. దానిని వివాదం చెయ్యొద్దు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

తైమూర్‌కు జన్మనిచ్చిన అనంతరం కేవలం 46 రోజుల తర్వాత లాక్మే ఫ్యాషన్ వీక్ రాంప్ షోలో హోయలు ఒలకించి బాలీవుడ్ నటి కరీనాకపూర్ అందర్ని ఆశ్చర్యపరిచింది. ఫ్యాషన్ షోలో పాల్గొనడంపై మాట్లాడుతూ చాలా ఆనందంగా ఉందని, ప్రసవం తర్వాత కొద్దిరోజులకే ఈ షోలో పాల్గొనడం పెద్ద కష్టమేమీ కాదని తెలిపింది. ఇష్టమైన పనిచేయడానికి ఇలాంటి అడ్డం కాదని పేర్కొన్నది. ఈ ఫ్యాషన్ షోకు సైఫ్ ఆలీ ఖాన్ హాజరుకాకపోవడంపై కరీనా వివరణ ఇచ్చింది.

సైఫ్ తైమూర్‌నుచూసుకొంటున్నాడు..

సైఫ్ తైమూర్‌నుచూసుకొంటున్నాడు..

‘ప్రస్తుతం సైఫ్ ఇంట్లో తైమూర్‌ను చూసుకొంటున్నాడు. మేం ఇద్దరి చిన్నారి బాధ్యతలను పంచుకొంటాం. ఇంట్లో పనులకు సైఫ్ బాగా సహకరిస్తాడు. నేను షూటింగ్ బిజీ ఉంటానే అతను. ఆయన బిజీగా ఉంటే నేను తైమూరును చూసుకొంటాం. సైఫ్ నేను అన్యోన్య దంపతులం. ' అని కరీనా తెలిపింది.

 తైమూర్ డైపర్లను కూడా మారుస్తాడు..

తైమూర్ డైపర్లను కూడా మారుస్తాడు..


‘సైఫ్ లో మంచి తండ్రి ఉన్నాడు. నా కంటే ఎక్కువగా కొడుకును చూసుకొంటున్నాడు. నాపై కూడా అంతగా ప్రేమను కురిపించలేదు. తైమూర్ డైపర్లను కూడా ఆయనే మార్చుతాడు' అని కరీనా మీడియాకు చెప్పింది. తన కుమారుడికి తైమూర్ అని పేరుపెట్టడాన్ని సమర్థించింది. తన కొడుకు పేరును వివాదం చేయ్యొద్దు అని సూచించింది.

 తైమూర్‌ను వివాదం చేయొద్దు

తైమూర్‌ను వివాదం చేయొద్దు


తైమూర్ పేరును వివాదం చేయవద్దని పలువురిని ఆమె మీడియా ద్వారా కోరింది. సైఫ్, కరీనా దంపతులు ఓ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆ బాబుకు తైమూర్ అని పేరుపెట్టడం వివాదాస్పదమైంది. దానిపై సైఫ్ స్పందిస్తూ ‘నా బిడ్డ పేరు ఏ వ్యక్తి పేరును ఉద్దేశించి పెట్టింది కాదు. జీవించి ఉన్న, లేదా మరణించిన వ్యక్తులతో తైమూర్ పేరును పోల్చుకోవద్దు. చాలా యాదృచ్చికంగా నా బిడ్డకు తైమూర్ అని పేరు పెట్టడం జరిగింది' అని వివరణ ఇచ్చాడు.

 ఆ పేరు మా ఇష్టం.. అయితే ఏంటీ

ఆ పేరు మా ఇష్టం.. అయితే ఏంటీ


‘నా బిడ్డ పేరును ప్రజలు వ్యక్తిగతంగా ఎందుకు తీసుకొంటున్నారో అర్థం కావడం లేదు. అది ఏ వ్యక్తిని గుర్తుచేసుకొనేందుకు పెట్టింది కాదు. ఈ విషయంలో మద్దతిచ్చిన వారికి థ్యాంక్స్‘ అని కరీనా చెప్పింది. నా బిడ్డ పేరును వివాదాస్పదం చెయ్యొద్దని ఆమె వేడుకొన్నది. తమ ఇష్టం మేరకే తైమూర్ అని కుమారుడికి పేరు పెట్టుకొన్నామని తెలిపింది.

English summary
Kareena Kapoor Khan said that Saif Ali Khan share the responsibility of looking after Taimur.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu