»   » ఫుడ్ పాయిజన్ కి గురై హాస్పటిల్ లో చేరిన స్టార్ హీరోయిన్

ఫుడ్ పాయిజన్ కి గురై హాస్పటిల్ లో చేరిన స్టార్ హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మళయాళ సూపర్ హిట్ బాడీ గార్డ్ చిత్రం హిందిలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. సల్మాన్ ఖాన్ ఖాన్, కరీనా కపూర్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూనేలో జరుగుతోంది. ఈలోగా అనుకోకుండా కరీనా కడుపు నొప్పితో, జ్వరంతో సెట్ పై కుప్ప కూలిపోయింది. దాంతో సల్మాన్ ఖాన్ వెంటనే తన ఫ్యామిలీ డాక్టర్ అయిన అగర్వాల్ క్లినిక్ కి ఆమెను తీసుకు వెళ్ళాడు. అక్కడ డాక్టర్ ఆమెను పరీక్షించి ఫుజ్ పాయిజన్ అయిందని తేల్చి ట్రీట్మెంట్ మొదలెట్టాడు. దాంతో ఓ రోజంతా ఆమెను బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు. సల్మాన్ ఖాన్ కూడా షూటింగ్ కాన్సిల్ చేసి ఆమెతోనే ఉన్నారు. సల్మాన్ ఖాన్ బావ అతుల్ అగ్ని హోత్రి, సోదరి అలవిర అగ్నిహోత్రి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu