»   » నా డబ్బు కోసమే నన్ను పెళ్లాడింది: హీరోయిన్‌పై భర్త పిటీషన్

నా డబ్బు కోసమే నన్ను పెళ్లాడింది: హీరోయిన్‌పై భర్త పిటీషన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్, ఆమె భర్త సంజయ్ కపూర్ మధ్య గత కొంత కాలంగా విడాకుల కేసు నడుస్తున్న సంగతి తెలిసిందే. చాలా కాలం క్రితమే ఇద్దరూ విడాకుల కోసం కోర్టుకెక్కారు. అయితే ఇద్దరి మధ్య కొన్ని విషాయాలు పరిష్కారం కాక పోవడంతో విడాకుల ప్రక్రియ ఓ కొలిక్కి రాలేదు. కోర్టు ఆదేశాల మేరకు ఇద్దరూ ఒప్పందానికి రాకపోతే పిటీషన్‌ను ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు గతేడాది నవంబర్లో కరీనా విడాకుల పిటీషన్ ఉపసంహరించుకుంది.

అయితే తాజాగా సంజయ్ కపూర్ మరోసారి విడాకుల పిటీషన్ దాఖలు చేసారు. కరిష్మా కపూర్ నన్ను పెళ్లి చేసుకుంది కేవలం డబ్బు కోసమే అంటూ తన పిటీషన్లో పేర్కొన్నాడు. గ్లామరస్ లైఫ్ స్టైల్ కోసం వెంపర్లాడేదని, అమితాబ్ బచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్‌తో బ్రేకప్ అయిన తర్వాత నన్ను పెళ్లి చేసుకుని రీబౌండ్ అయిందంటూ పేర్కొన్నాడు. పిల్లలను తనతో కలవకుండా చేస్తోందని, విడాకుల కేసులో వారిని పావులుగా వాడుకుంటోందని పిటీషన్లో పేర్కొన్నారు.

 Karisma Kapoor married me for my money: Sunjay Kapur

కరిష్మా కపూర్..... నాకు భార్యగా, నా తల్లిదండ్రులకి కోడలిగానే కాదు, తల్లిగా కూడా ఫెయిల్ అయిందంటూ సంజయ్ కపూర్ తన పిటీషన్లో పేర్కొన్నారు. అయితే కరిష్మా లాయర్ క్రాంతి సాతె మాత్రం సంజయ్ కపూర్ ఆరోపణలను తోసి పుచ్చారు. అతను కావాలని ఇలాంటి కట్టు కథలు ప్రచారం చేస్తున్నాడని పేర్కొన్నారు.

గతంలో విడాకులు, ఉపసంహరణ...
రిష్మాకు సంజయ్ కపూర్‌తో 2003 లో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. అనంతరం 2010 నుంచి కరిష్మా ముంబైలోని తన పుట్టింట్లో ఉంటుంది. తర్వాత విడాకుల కోసం కోర్టు కెక్కారు. ఇద్దరి మధ్య కొన్ని విషాయాలు పరిష్కారం కాక పోవడంతో విడాకుల ప్రక్రియ ఓ కొలిక్కి రాలేదు. గతంలో పలు వాయిదాల్లో వారిరువురు ఒక ఒప్పందానికి రాకపోవడంతో మళ్లీ కేసు వాయిదా మీద వాయిదా పడింది. కోర్టు ఆదేశాల మేరకు ఇద్దరూ ఒప్పందానికి రాకపోతే పిటీషన్‌ను ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు గతేడాది కరిష్మా విడాకుల పిటీషన్ ఉపసంహరించుకుంది.

English summary
In a fresh divorce petition, Delhi-based industrialist, Sunjay Kapur has claimed that Bollywood actress Karisma Kapoor married him only for his money in a very calculative manner and very slowly sponged off his family to live a glamorous lifestyle.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu