twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎఫైర్ ఉన్నట్లు చూపిస్తే సహించం: ముదురుతున్న వివాదం!

    తాజాగా కర్ణి సేనకు చెందిన కార్యకర్తలు ముంబైలో ఆందోళన చేపట్టి దర్శకుడి దిష్టి బొమ్మను తగులబెట్టారు.

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న'పద్మావతి' మూవీ వివాదం రోజురోజుకీ ముదురుతుందే తప్ప తగ్గుముఖం పట్టడంలేదు.ఈ సినిమా తమ రాజ్ పుత్ వంశానికి చెందిన రాణి పద్మావతి జీవిత చరిత్రను వక్రీకరిస్తూ తెరకెక్కిస్తున్నారన్నది ఆందోళనకారుల వాదన.

    ఇప్పటికే రాజ్ పుత్ కర్ణి సేనకు చెందిన కార్యకర్తలు జైపూర్ లో పద్మావతి మూవీ షూటింగ్ జరుగుతుండగా సెట్స్ మీద విరుచుకుపడి దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ మీద దాడి చేసి కొట్టిన సంగతి తెలిసిందే.

    దిష్టి బొమ్మ దహనం

    దిష్టి బొమ్మ దహనం

    ఆ సంఘటన మరువక ముందే కొల్హాపూర్ లో పద్మావతి సినిమా కోసం వేసిన సెట్స్ ను ఆ:దోళన కారులు తగులబెట్టారు. తాజాగా కర్ణి సేనకు చెందిన కార్యకర్తలు ముంబైలో ఆందోళన చేపట్టి దర్శకుడి దిష్టి బొమ్మను తగులబెట్టారు.

    rn

    దీపిక, రణవీర్

    'పద్మావతి' చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకోన్ టైటిల్ రోల్ చేస్తున్నారు. అల్లావుద్దీన్ ఖిల్జీగా రణవీర్ సంగ్ నటిస్తున్నారు. వీరి మధ్య ప్రేమ వ్యవహారం నడినట్లు సినిమాలో సన్నివేశాలు చిత్రీకరించినట్లు ఆరోపిస్తూ ఈ దాడికి పాల్పడ్డారు.

    ఎఫైర్ ఉన్నట్లు చూపిస్తే సహించం

    ఎఫైర్ ఉన్నట్లు చూపిస్తే సహించం

    పద్మిణి రాణి, అల్లావుద్దీన్ ఖిల్జీ మధ్య ప్రేమ వ్యవహారం నడిచినట్లు చరిత్రను తప్పుదోవ పట్టిస్తున్నారని, పద్మిణి ఆత్మాభిమానం గల రాణి అని, చిట్టోర్‌గఢ్ కోటపై దాడి జరిగినపుడు ఆమె అల్లావుద్దీన్ కు లొంగిపోకుండా ఆత్మత్యాగం చేసిందని ఆందోళనకారులు వాదిస్తున్నారు.

    తప్పుగా చూపిస్తే సహించం

    తప్పుగా చూపిస్తే సహించం

    చరిత్రను వక్రీకరించి సినిమా తీస్తే సహించబోమని, 'పద్మావతి' సినిమాలో వారి మధ్య ప్రేమ సన్నివేశాలు ఉన్నట్లు చూపిస్తే ఊరుకోబోమని ఆందోళన కారులు హెచ్చరించారు.

    English summary
    Karni Sena activists burn effigy of Sanjay Leela Bhansali in Mumbai. While the attackers, who even put the sets in Kolhapur on fire, are still unidentified, the attack in Jaipur was reportedly carried out by the Karni Sena acivists.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X