»   » నిజంగానే మనసు లాగేస్తోంది... (కాటమరాయుడు న్యూ సాంగ్)

నిజంగానే మనసు లాగేస్తోంది... (కాటమరాయుడు న్యూ సాంగ్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న 'కాటమ రాయుడు' చిత్రానికి సంబంధించి మరో కొత్త సాంగ్ గురువారం రిలీజైంది. లాగే లాగే అంటూ సాంగే ఈ పాటకు భాస్కర భట్ల సాహిత్యం అందించగా అనూప్ రూబెన్స్ మెలోడీ టచ్చింగుతో మంచి బీట్స్ ఇచ్చారు. నకాష్ అజీన్ పాడిన ఈ పాటను అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై శరత్ మరార్ నిర్మాణంలో గోపాల గోపాల ఫేం డాలీ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీకి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఒక్కోపాట ఇలా నేరుగా విడుదల చేసి మార్చి 12న ప్రీరిలీజ్ ఈవెంటు నిర్వహించే అవకాశం ఇంది. మార్చి 24న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తేన్నారు.


లాగే లాగే సాంగ్

లాగే లాగే అంటూ సాంగే ఈ పాటను నకాష్ అజీజ్ పాడగా...ధనుంజయ్, నూతన అడిషనల్ వోకల్స్ అందించారు. ఈ పాట వింటే మీ మనసు లాగేయడం ఖాయం. ఇంకెందుకు ఆలస్యం వినండి.


కాటమరాయుడు టైటిల్ సాంగ్

మార్చి 3న మిరా మిసా మీసం అంటూ కాటమరాయుడు టైటిల్ సాంగ్ రిలీజ్ చేయటగా... ఇప్పటికే 3 మిలియన్ వ్యూస్ కౌంట్ క్రాస్ అయంది. మరో నాలుగు రోజుల్లో ఈ పాట 50 లక్షల వ్యూస్ సాధించిన సాంగుల లిస్టులో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.


‘కాటమరాయుడు సీక్రెట్స్

కాటమరాయుడు చిత్రం మాస్ సినిమా లాకాకుండా... . ఇదొక మ్యూజికల్ సినిమా గా ప్రెజెంట్ చేస్తున్నట్లుగా చెప్తున్నారు సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్. ఈ సినిమాలో కేవలం ఆరు పాటలే కాకుండా.. సినిమాలో మరో మూడు బిట్ సాంగ్స్ కూడా ఉన్నాయని రివీల్ చేసారాయన.


కాటమరాయుడు అఫీషియల్ టీజర్

శ్రుతిహాసన్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం లోని ఇతర ప్రధాన పాత్రలలో ఆలీ, నాజర్, రావు రమేష్, అజయ్, నర్రా శ్రీను, పృథ్వి, శివబాలాజీ, కమల్ కామరాజు, చైతన్య కృష్ణ, తరుణ్ అరోరా, ప్రదీప్ రావత్, పవిత్ర లోకేష్, రజిత, యామిని భాస్కర్, అస్మిత, రమాదేవి, భానుశ్రీ నటిస్తున్నారు. నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై నిర్మిత మవుతున్న ఈ కాటమరాయుడు చిత్రానికి సంగీతం అనూప్ రూబెన్స్, ప్రసాద్ మూరెళ్ళ కెమెరా మన్ గా వర్క్ చేస్తున్నారు. నిర్మాత: శరత్ మరార్ దర్శకత్వం: కిషోర్ పార్ధసాని.


English summary
Watch & Enjoy Laage Laage Full Song With English Lyrics From Katamarayudu Movie.Starring Pawan Kalyan, Shruthi Haasan.Music Composed By Anup Rubens. Directed By Kishore Kumar Pardasani (Dolly). Produced By Sharrath Marar Under The NorthStar Entertainment Banner.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu