»   » ప్లే స్టోర్‌లో కాటమరాయుడు యాప్.. డౌన్‌లోడ్ చేసుకోవడం ఇలా..

ప్లే స్టోర్‌లో కాటమరాయుడు యాప్.. డౌన్‌లోడ్ చేసుకోవడం ఇలా..

Written By:
Subscribe to Filmibeat Telugu

పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌ తాజా చిత్రం కాటమరాయుడిపై అభిమానుల్లో భారీ అంచనాలు పెరుగుతున్నాయి. సోషల్ మీడియాలో వేర్వేరుగా విడుదల చేసిన పాటలకు ఇప్పటికే బ్రహ్మండమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటివరకు విడుదల చేసిన పాటలను, టీజర్లను ఒకే వేదిక మీదకు తెచ్చేందుకు కాటమరాయుడు పేరుతో ఓ యాప్‌ను అధికారికంగా విడుదల చేశారు. ఈ ఆండ్రాయిడ్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే https://goo.gl/YW5C4C షార్ట్‌లింక్‌ని క్లిక్‌ చేయాల్సి ఉంటుంది.

మొబైల్ రింగ్ టోన్‌గా

మొబైల్ రింగ్ టోన్‌గా

ఆండ్రాయిడ్‌ ప్లేస్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న తర్వాత ఓపెన్‌ చేస్తే మ్యూజిక్‌, గ్యాలరీ, వీడియోలు, రింగ్‌టోన్స్‌, పాటల సాహిత్య విభాగాలు కనిపిస్తాయి. ఈ యాప్‌లో విశేషమేమింటంటే కాటమరాయుడు సినిమా పాటలను చిన్నచిన్న ముక్కలు చేసి మొబైల్‌లో రింగ్‌టోన్‌గా పెట్టుకునే వెసులబాటును కల్పించారు.

రింగ్ టోన్ పెట్టుకోవడం ఇలా..

రింగ్ టోన్ పెట్టుకోవడం ఇలా..

రింగ్‌టోన్‌ విభాగంలోకి వెళ్లి సెట్‌ యాజ్‌ రింగ్‌టోన్‌ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్‌ అయి మొబైల్‌ రింగ్‌టోన్‌గా సెట్‌ అవుతుంది. యూట్యూబ్‌లో విడుదల చేసిన పాటలను లిరిక్స్‌ సాయంతో వీడియోలా, ఆడియోలా చూసుకొనే సౌకర్యాన్ని కల్పించారు.

ఉచితంగా గ్యాలరీలు.. ఆడియో

ఉచితంగా గ్యాలరీలు.. ఆడియో

మొబైల్‌ కాలర్‌టోన్స్‌ పెట్టుకోవాలనుకునే వారికి ప్రతి నెట్‌వర్క్‌కు సంబంధించిన కాల్‌ చేయాల్సిన కోడ్స్‌ కూడా ఉంటాయి. ఒక్కసారి ఈ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుంటే అధికారికంగా విడుదల చేసే గ్యాలరీ, వీడియో, ఆడియో వంటి ఫైల్స్‌ని ఉచితంగా పొందే అవకాశం ఉంది.

యాప్‌ను ఆవిష్కరించిన ఆదిత్య

యాప్‌ను ఆవిష్కరించిన ఆదిత్య

కాటమరాయుడు మ్యూజిక్‌ రైట్స్‌‌ను ప్రముఖ ఆడియో కంపెనీ ఆదిత్య ఈ యాప్‌ను ఆవిష్కరించింది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ శనివారం (మార్చి 18)న హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు.

English summary
Katamarayudu songs already released in the youtube. now Katamarayudu special aap unveiled. Mobile users can download from https://goo.gl/YW5C4C
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu