»   »  జాకెట్ లేకుండా హాట్ గా కేధరిన్..ప్రక్కన .. (ఫొటోలు)

జాకెట్ లేకుండా హాట్ గా కేధరిన్..ప్రక్కన .. (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నిజ జీవిత సంఘటనలు స్పూర్తిగా చేసుకుని వచ్చే సినిమాలు మనకు బాగా తక్కువ. అయితే ఇలాంటి విషయాల్లో తమిళం వారు బాగా ముందుంటారు. అక్కడ హీరోలు సైతం ఇలాంటి చిత్రాలు చేయటానికి ముందుకు వస్తారు. తాజాగా అలా దర్శకుడు పాండిరాజ్..స్నేహితుల జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు స్పూర్తితో చేసిన చిత్రం కథకళి.

విశాల్‌, కేథరిన్‌ జంటగా పాండిరాజ్‌ దర్శకత్వంలో విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై విశాల్‌, పాండిరాజ్‌ నిర్మించిన చిత్రం 'కథకళి'. తమిళంలో సంక్రాంతి కానుకగా విడుదలయ్యి ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులో అనువదించి అదే పేరుతో ఈ నెలలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే మొదట ఈ చిత్రాన్ని ఈ వారంలో విడుదల చేయాలనుకున్నారు. కానీ సరైన థియోటర్స్ దొరక్కే వాయిదా వేసారని హీరో విశాల్ చెప్తున్నారు.

నిజానికి తెలుగు, తమిళంలో ఒకేరోజు ఈ సినిమా రిలీజ్‌ చేయాల్సింది కాని తమిళంలో దొరికినన్ని థియేటర్లు తెలుగులో దొరకలేదు. స్ట్రెయిట్‌ సినిమాలు చాలా రిలీజ్‌ అయ్యాయి. సో.. మంచి డేట్‌ కోసం ఎదురు చూసి ఈనెలలోనే రిలీజ్‌ చేయాలనుకున్నాం అంటున్నారు విశాల్.

విశాల్‌ మాట్లాడుతూ.. '' తమిళంలో సంక్రాంతి కానుకగా ఈనెల 14న విడుదలయిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. తెలుగులో కూడా అదే టైటిల్‌తో ఈనెలలోనే ప్లాన్‌ చేస్తున్నాం. ప్రస్తుతం సెన్సార్‌ జరుగుతోంది. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం. కథకు కథకళి టైటిల్‌ సరిపోతుందని ఎంపిక చేశాం. నేషనల్‌ అవార్డు విన్నర్‌ పాండిరాజ్‌ ఈ చిత్రాన్ని డైరెక్ట్‌ చేశారు అన్నారు.

ఇంకా విశాల్ ఏమన్నారో స్లైడ్ షోలో చూద్దాం...

సెకండాఫ్ లో నో సాంగ్స్

సెకండాఫ్ లో నో సాంగ్స్

అలాగే... మొదటిసారి థ్రిల్లర్‌ జోనర్‌లో సినిమా చేశాను. ఇప్పటివరకు నేను ఇలాంటి సినిమాలో నటించలేదు. సెకండ్‌ హాఫ్‌లో పాటలు ఉండవు.

డైరక్టర్ ఫ్రెండ్ కు జరిగిందే..

డైరక్టర్ ఫ్రెండ్ కు జరిగిందే..

డైరెక్టర్‌ స్నేహితునికి జరిగిన రెండు సంఘటనలను ఆధారంగా చేసుకొని కథ రాశారు. ఇదొక మర్డర్‌ మిస్టరీ.

ఒకే రోజులో..

ఒకే రోజులో..

చెన్నైలో మొదలయ్యి కడలూరులో పూర్తయ్యే కథ. ఒక రోజులో జరిగే కథ. స్క్రీన్‌ప్లే కొత్తగా ఉంటుంది. మర్డర్‌ ఎవరు చేశారనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఒక నవల చదువుతున్న భావన కలుగుతుంది అని చెప్పుకొచ్చారు.

థ్రిల్ చేస్తుంది..

థ్రిల్ చేస్తుంది..

బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌కు మంచి పేరొస్తుంది. రెండు గంటల మూడు నిమిషాల నిడివి గల ఈ సినిమా ప్రేక్షకులకు థ్రిల్‌ ఫీల్‌ చేస్తుంది.

విజువల్ ట్రీట్

విజువల్ ట్రీట్

'వాడువీడు', 'ఇంద్రుడు' లాంటి భిన్నమైన పాత్రలు మంచి పేరొచ్చింది. ఈ సినిమాతో కూడా మంచి పేరొస్తుందనే నమ్మకంతో ఉన్నాను. ప్రేక్షకులకు విజువల్‌ ట్రీట్‌ ఈ సినిమా అని చెప్పుకొచ్చారు.

గెస్సింగ్ గేమ్..

గెస్సింగ్ గేమ్..

ఇక పాండిరాజ్‌ నాకు రెండు కథలు చెప్పారు. ఈ సినిమా కథ విన్నప్పుడు గెస్సింగ్‌ గేమ్‌ లాగా అనిపించింది. పూర్తిస్థాయి థ్రిల్లర్‌ జోనర్‌ సినిమా పాండిరాజ్‌కు కొత్త అయినా చేయగలడనే నమ్మకంతో ప్రాజెక్ట్‌ మొదలుపెట్టాం.

నెక్ట్స్ విలేజ్ బ్యాక్ డ్రాప్..

నెక్ట్స్ విలేజ్ బ్యాక్ డ్రాప్..

ఇక ఈ సినిమా తరువాత తమిళంలో 'మరుద' అనే సినిమాలో నటిస్తున్నాను. ముత్తయ్య దర్శకుడు. అవుట్‌ అండ్‌ అవుట్‌ విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో ఉండే సినిమా అది' అని విశాల్ చెప్పారు.

పాండిరాజ్‌ మాట్లాడుతూ..

పాండిరాజ్‌ మాట్లాడుతూ..

తమిళంలో చేసిన 'పసంగ2', 'కథకళి' చిత్రాలు ఒకదాని తరువాత ఒకటి రిలీజ్‌ అయ్యి విజయాన్ని సాధించాయి. అలానే తెలుగులో కూడా కథకళి, మేము.. చిత్రాలు వరుసగా రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా మంచి సక్సెస్‌ ను సాదిస్తాయనే నమ్మకం ఉంది. నా డైరెక్షన్‌లో మొదటిసారిగా వస్తోన్న యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమా ఇది'' అని చెప్పారు.

సంగీత దర్శకుడు హిప్‌ హాప్‌ ఆది మాట్లాడుతూ..

సంగీత దర్శకుడు హిప్‌ హాప్‌ ఆది మాట్లాడుతూ..

ఈ సినిమాకు మ్యూజిక్‌ చేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమాలో రెండు పాటలు, రెండు థీమ్‌ ట్రాక్స్‌ ఉంటాయి. విశాల్‌తో ఇది నా రెండో సినిమా. త్వరలోనే రామ్‌ చరణ్‌, సురేందర్‌ రెడ్డి కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రానికి మ్యూజిక్‌ చేయనున్నాను. దాంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యే అవకాశాలున్నాయి'' అని చెప్పారు.

హీరోయిన్ కేథరిన్‌ తెరీసా మాట్లాడుతూ..

హీరోయిన్ కేథరిన్‌ తెరీసా మాట్లాడుతూ..

తమిళంలో 'మద్రాసు' తరువాత ఈ సినిమాలో నటించాను. ఇదొక యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ. తమిళంలో మంచి విజయాన్ని సాధించిన ఈ సినిమా తెలుగులో కూడా పెద్ద సక్సెస్‌ కావాలి'' అని చెప్పారు.

English summary
“After Pasanga 2 (2015), this is an action-thriller — a different film based on a real life incident, which took place in my friend’s life. It’s an edge-of-the-seat thriller that we shot in a matter of just 65 days,” explains Pandiraj.
Please Wait while comments are loading...