»   » హీరోయిన్ పృష్ఠ భాగం మీద చేత్తో.. అవసరమా?:'సాయిధరమ్'పై కత్తి ఇలా..

హీరోయిన్ పృష్ఠ భాగం మీద చేత్తో.. అవసరమా?:'సాయిధరమ్'పై కత్తి ఇలా..

Subscribe to Filmibeat Telugu

హీరోయిన్ల నడుములు గిల్లడం, వాళ్ల 'బ్యాక్'పై ఓ దెబ్బ చరిచి.. అలా ఓ రొమాంటిక్ లుక్కేయడం ఒకప్పటి హీరోలు బాగా ఫాలో అయిన ట్రెండ్. అయితే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనుకుంటున్నాడో.. లేక మేనమామ పాటల్ని రీమేక్ చేసినట్లుగానే ఆయన మేనరిజమ్స్ కూడా పట్టేద్దామనుకుంటున్నాడో తెలియదు గానీ.. ఒకప్పటి ఆ ట్రెండ్‌ను ఇప్పుడు ఫాలో అవుతున్నాడు హీరో సాయిధరమ్ తేజ్. ఆ ట్రెండ్‌పై ఫిలిం క్రిటిక్ సంధించిన విమర్శ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది..

'ఇంటిలిజెంట్'పై కత్తి కామెంట్..!

తెలివైనవాడు ఇలా చేస్తాడా?: 'ఇంటిలిజెంట్'పై కత్తి, వినాయక్ మార్క్ మిస్ అయిందా!

విషయమేంటి?:

విషయమేంటి?:

'ఇంటిలిజెంట్' సినిమా విడుదల దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ యాక్టివిటీస్‌ను స్పీడప్ చేసింది చిత్ర యూనిట్. ఇందులో భాగంగా తాజాగా ఒక పోస్టర్ విడుదల చేశారు. ఇందులో హీరోయిన్ లావణ్య త్రిపాఠి 'బ్యాక్'పై హీరో సాయిధరమ్ తేజ్ తన రైట్ హ్యాండ్‌తో ఓ దెబ్బ చరిచినట్లుగా కనిపిస్తోంది.

కత్తి కామెంట్:

'ఇంటిలిజెంట్' పోస్టర్ పై కత్తి తనదైన శైలిలో కామెంట్ చేశారు. 'అలా... హీరోయిన్ పృష్ఠ భాగం మీద చేత్తో చరిచి, చిలిపిగా తెరవైపు చూసి, ప్రేక్షకులకి కన్నుకొట్టడం చిరంజీవి గారి అరుదైన 90s స్టైల్. ఇమిటేషన్ వరకు ఒకే, కానీ ఇప్పటికీ ఇలా చెయ్యడం అవసరమా!' అంటూ ట్విట్టర్‌లో తన విమర్శను సంధించారు.

చిరును దించేస్తున్న సాయి..:

చిరును దించేస్తున్న సాయి..:

తొంభైల్లో చిరంజీవి చాలా సినిమాల్లో ఈ స్టైల్ ను ఫాలో అయిన సంగతి తెలిసిందే. ఇమిటేషన్ ఓకె గానీ ఇప్పుడెందుకు ఇది? అనేది కత్తి అభిప్రాయం. అయితే చిరంజీవి లాగా మాస్ ఇమేజ్ కోసం ఆరాటపడుతున్న సాయిధరమ్ తేజ్.. బాడీ లాంగ్వేజ్ దగ్గరి నుంచి, మేనరిజమ్స్ వరకు ఆయన్నే ఫాలో అవుతున్నట్లుగా అర్థమవుతోంది. తాజా పోస్టర్ లోనూ ఇదే విషయం స్పష్టమైంది.

సాయికి సొంత మార్క్ లేదా?:

సాయికి సొంత మార్క్ లేదా?:


చిరంజీవికే ప్రత్యేకమైన స్టైల్స్, మేనరిజమ్స్ ఇమిటేట్ చేయడం ద్వారా సాయిధరమ్ తేజ్ కంటూ సొంత మార్క్ అనేది లేకుండా పోతుందనేది మరికొందరి అభిప్రాయం. చాలామంది హీరోలు వైవిధ్యమైన కథలతో కెరీర్ ను ప్లాన్ చేసుకుంటుంటే.. సాయిధరమ్ మాత్రం అనవసరంగా మాస్ ఇమేజ్ కోసం పాకులాడి రాంగ్ ట్రాక్‌లో వెళ్తున్నాడనే అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది.

'ఫస్ట్ లుక్'పై కత్తి:

'ఫస్ట్ లుక్'పై కత్తి:


ఇక కత్తి విషయానికొస్తే.. 'ఇంటిలిజెంట్'పై గతంలోనూ ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు. ఫస్ట్ లుక్ లో భాగంగా విడుదల చేసిన పోస్టర్ పై ఆయన పెదవి విరిచారు. 'తెలివైనవాడు గన్ పట్టుకోవడమేంటో.. టైటిల్‌కి తగ్గ పోస్టర్ అయితే కాదు' అని కొద్ది రోజుల క్రితం కామెంట్ చేశారు.

రాజమండ్రిలో ప్రీరిలీజ్ ఫంక్షన్

రాజమండ్రిలో ప్రీరిలీజ్ ఫంక్షన్


ఇవన్నీ పక్కనపెడితే నేటి సాయంత్రం 5.30గంటలకు రాజమండ్రి గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో 'ఇంటిలిజెంట్' డజరగబోతుంది. రాజమండ్రిలో జరిగే ఈ ఫంక్షన్‌కి మా మెగా ఫ్యాన్స్, మా బాలయ్య ఫ్యాన్స్, మా ప్రభాస్ ఫ్యాన్స్ అందరినీ ఆహ్వానిస్తున్నామంటూ ఇప్పటికే నిర్మాత సి.కల్యాణ్ ప్రకటించేశారు. అందరు హీరోల అభిమానులను ఆకట్టుకోవడానికే సి.కల్యాణ్ ఈ కామెంట్ చేశారేమో!..

సాయి కూడా అదే అంటాడా?:

సాయి కూడా అదే అంటాడా?:

వరుణ్ తేజ్ 'తొలిప్రేమ' భీమవరంలో ప్రీరిలీజ్ ఈవెంట్ జరుపుకుంటే.. 'ఇంటిలిజెంట్' రాజమండ్రిలో ప్రీరిలీజ్ ఈవెంట్ జరుపుకుంటుండం విశేషం. తొలిప్రేమ ప్రీరిలీజ్ వేడుకలో మాట్లాడుతూ.. తేజు బాబు 'ఇంటిలిజెంట్' సినిమాను కూడా చూడాలని అభిమానులకు వరుణ్ తేజ్ విన్నవించారు. మరి ఈరోజు సాయిధరమ్ కూడా వరుణ్ తేజ్ సినిమా చూడాలని పిలుపునిస్తాడేమో!.. మొత్తానికి ఒకరి సినిమాను మరొకరు ఈ మెగాహీరోలు భలే ప్రమోట్ చేసుకుంటున్నారనే చెప్పాలి.

English summary
Former Big Boss contestant and film critic,Kathi Mahesh derided another starfrom the Mega stable, Sai Dharam Tej, for aping what he described as Chiranjeevi's style from the 90s. Sai Dharam Tej,
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu