For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మళ్ళీ "కత్తియుద్దం" మొదలయ్యింది: వరుస ప్రశ్నలతో పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేసిన కత్తి మహేష్

  |
  వరుస ప్రశ్నలతో పవన్ ని టార్గెట్ చేసిన కత్తి మహేష్..!

  పవన్ కళ్యాణ్ స్పీచ్ బయటికి వచ్చిందంటే చాలు ఇప్పుడు అందరి కళ్ళూ ఇంకోకరి మీదికే తిరుగుతున్నాయి. ఊహించటం కష్టమేమీ కాదు ఆయన కత్తి మహేష్. ఒకరకంగా మహేష్‌కీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కీ మధ్య ఒక కోల్డ్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. అటు పవన్ మాట్లాడటం ఆలస్యం వెంటనే మహేష్ కత్తి ఏమన్నాడూ..? అంటూ ఆయన సోషల్ మీడియా వాల్ మీద అందరి దృష్టీ పడుతోంది. ఇక తాజాగా కూడా మహేష్ పవన్‌ని వదిలిపెట్టలేదు గడిచిన మూడు రోజులుగా ఏపీలో పర్యటిస్తున్న పవన్ తీరును.. ఆయన చేసిన వ్యాఖ్యల్ని వరుస పోస్టులతొ ప్రశ్నలు వేశాడు.

  మరింత సూటిగా

  మరింత సూటిగా

  విశ్వమానవుడు అంటూ పవన్ ని సంబోదిస్తూ వ్యంగ్య వ్యాఖ్యలు చేసిన మహేశ్.. కులం దగ్గర మొదలుపెట్టి ప్రధాని నరేంద్ర మోడీతో స్నేహం వరకూ ప్రతీ విషయాన్నీ మళ్ళీ పైకి తీసుకువచ్చాడు. గతంలోకంటే మరింత సూటిగానే ప్రశ్నలు వేశాడు... వరుసగా మహేష్ చేసిన పోస్టులు చూస్తే ...

  ఉబుసుపోని కబుర్లు చెప్పకు

  ఉబుసుపోని కబుర్లు చెప్పకు

  "ఒక కులానికే నిన్ను ఎవరు పరిమితం చెయ్యడం లేదు PK. కాకపోతే కాపు సామాజిక వర్గం మీ అన్నయ్య చేసిన అన్యాయానికి నీ నుంచీ ప్రతిఫలం ఆశిస్తోంది. నేను విశ్వమానవుడ్ని. నాకు కులం లేదు...లాంటి ఉబుసుపోని కబుర్లు చెప్పకు. కాపు రిజర్వేషన్ల పట్ల నీ వైఖరి నీ సహజ ప్రవృత్తిని తెలియజెప్పేసింది".

   చిరంజీవి మోసం చేసి పోయాడు

  చిరంజీవి మోసం చేసి పోయాడు

  "చిరంజీవి సామాజిక న్యాయం అంటే నమ్మాము. మోసం చేసి పోయాడు. రాజకీయంగా కాపులను - బహుజనులు - దళితులను - మైనారిటీలను ఒక పాతిక సంవత్సరాలు వెనక్కి తీసుకుని పోయాడు. ఇప్పుడు నువ్వొచ్చావ్. నాకు కులం లేదు అంటున్నావ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఉన్నదే కులం.?

  కాస్త తెలుసుకుని మాట్లాడు

  కాస్త తెలుసుకుని మాట్లాడు

  అధికారం వద్దు అంటున్నావ్. రాజకీయం చేసేదే గెలుపుకోసం.అధికారం కోసం. అవి అవసరం లేకుండా సేవ చెయ్యాలంటే ఎన్జీవో పెట్టుకో...రాజకీయాలు ఎందుకు? కాస్త తెలుసుకుని మాట్లాడ,. గ్రవుండ్ రియాలిటీ గ్రహించి మాట్లాడు".

  ఎందుకు స్పందించలేదు?

  ఎందుకు స్పందించలేదు?

  "తుని ఘటన జరిగినప్పుడు కేరళ నుంచి హుటాహుటిన స్పెషల్ ఫ్లైట్ లో వచ్చిన ఈ విశ్వ మానవుడు - మరే ఇతర కుల సమస్య గురించి ఒక్కసారైనా ఎందుకు స్పందించలేదు?" అంటూ ముద్రగడ నేతృత్వంలో జరిగిన కాపు రిజర్వేషన్ అల్లర్లనీ ప్రస్తావించాడు.

   శేఖర్ కమ్ముల చెడ్డోడు అయ్యాడా!?

  శేఖర్ కమ్ముల చెడ్డోడు అయ్యాడా!?

  "మోడీ లాంటి నరహంతకుడితో చెట్టాపట్టాలేసుకుని ఎన్నికల ప్రచారం చేసిన నిన్ను - మతోన్మాద శక్తులతో చెయ్యి కలపకు అన్న శేఖర్ కమ్ముల చెడ్డోడు అయ్యాడా!? ప్రధానమంత్రి అయినంత మాత్రమేనా మోడీ గుజరాత్ లో చేసింది రైట్ అయిపోతోందా? నీ ఉన్మాదం ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతూనే ఉంది పవన్ కళ్యాణ్". అంటూ ఒక రేంజిలో తన ప్రశ్నలని ఫేస్బుక్ లో పెట్టేసాడు.

  మద్దతు బలంగానే ఉంది

  మద్దతు బలంగానే ఉంది

  ఇక మళ్ళీ కొన్నాళ్ళు మహేష్ కత్తికీ పవన్ ఫ్యాన్స్‌కీ మధ్య ఇంకో గొడవ జరగవచ్చు అయితే ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. గతం లోకన్నా మహేష్ కత్తికి కూడా మద్దతు బలంగానే ఉంది. ఈ సారి గనక మళ్ళీ పవన్ ఫ్యాన్స్ ఒక పద్దతి ప్రకారం కాకుండా కేవలం ఆవేశంతోనే తమ ప్రతాపం చూపిస్తే అది పవన్ కళ్యాన్ ఇమేజ్‌కి తీవ్ర నష్టం కలిగించవచ్చు.

  English summary
  Popular critic and the man who earned a Reputation as staunch Pawan Kalyan hater, Kathi Mahesh did strike with words at this moment as well.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X