»   »  ఏం చేయకున్నా అవార్డొస్తే తీసుకుంటా రణ్‌బీర్ కపూర్‌: జగ్గ జాసూస్ ట్రైలర్ కూడా (వీడియో)

ఏం చేయకున్నా అవార్డొస్తే తీసుకుంటా రణ్‌బీర్ కపూర్‌: జగ్గ జాసూస్ ట్రైలర్ కూడా (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ ప్రేమపక్షుల్లో కత్రినా కైఫ్, రణ్‌బీర్ కపూర్‌లు ఉన్నారు. ఒక్కో సీజన్‌లో ఒక్కొక్క‌రితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయే బాలీవుడ్ సుందరాంగి... ఈ బాలీవుడ్ హీరోతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన విషయం తెల్సిందే. పైగా, వీరిద్దరూ ఒకే ఇంట్లో కొంతకాలం సహజీవనం కూడా చేశారు. ఆ తర్వాత మనస్పర్థలొచ్చి విడిపోయారు. అయినప్పటికీ ఇటీవల వీరిద్దరూ కలసి నిర్మాతల కోసం 'జగ్గా జాసూస్' అనే చిత్రంలో నటించారు.

జగ్గా జాసూస్

జగ్గా జాసూస్

ఈ సినిమాలో అదృశ్యమైన తన తండ్రిని అన్వేషించుకుంటూ వెళ్లే జగ్గా అనే ఓ టీనేజ్ యువకుడి పాత్రలో రణ్‌బీర్ కపూర్ కనిపించనుండగా.. అతడి జర్నీలో పార్ట్‌నర్ పాత్ర పోషించిన శృతిగా కత్రినా కైఫ్ నటించింది. జగ్గాకి మాటలు సరిగ్గా రాకపోవడం, నత్తిగా మాట్లాడటం ఈ సినిమాలో రణ్‌బీర్ పాత్రకి వున్న ప్రత్యేకత.

 షారుఖ్ ఖాన్ అతిథి పాత్ర

షారుఖ్ ఖాన్ అతిథి పాత్ర

సినిమాలో షారుఖ్ ఖాన్ అతిథి పాత్ర పోషించాడనే టాక్ వినబడుతోంది. 'జగ్గా జాసూస్' సెట్స్‌లో షారుఖ్ ప్రత్యక్షమైనప్పటి ఫోటో ఒకటి గతంలో ఇంటర్నెట్‌లో వైరల్ అవడమే అందుకు కారణం. మరో సీనియర్ హీరో గోవిందా కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించాడు. జులై 14న ఆడియెన్స్ ముందుకు రానున్న ఈ సినిమా గురించి బాలీవుడ్ ఆడియెన్స్ భారీ ఆశలే పెట్టుకున్నారు.

రణబీర్ కొ- ప్రొడ్యూసర్

రణబీర్ కొ- ప్రొడ్యూసర్

జగ్గా జాసూస్ సినిమాకు రణబీర్ కొ- ప్రొడ్యూసర్ గా కూడా ఉన్నాడు. దానికి కారణం అతనికి కథ నచ్చడమే కాకుండా ఇలాంటి సినిమాలు రణబీర్ చూడాలి అనుకుంటాడట.. అందుకే ప్రొడ్యూస్ చేశా అంటున్నాడు. "జగ్గా జాసూస్ సినిమాకు నేను సహ నిర్మాతగా ఉన్నాను కానీ నేను ఏమి పని చేయలేదు. నాకు నా నటనతోనే సరిపోయింది.

అవార్డ్ ఏదైనా వస్తే

అవార్డ్ ఏదైనా వస్తే

అయినా నాకు ప్రొడ్యూసర్ చేసే మేనేజ్మెంట్ పనులు ఏవి సరిగా తెలియవు. అన్నీ అనురాగ్ బసు దాదా చూసుకున్నారు. ఎప్పుడైనా డిస్ని వాళ్ళకి అనురాగ్ కి మధ్య విబేధాలు వస్తే నేను మధ్య ఉండేవాడిని తప్ప అంతకు మించి నేను ప్రొడ్యూసర్ గా పెద్ద బాధ్యతలు ఏమి తీసుకోలేదు. కాని అవార్డ్ ఏదైనా వస్తే ప్రొడ్యూసర్ గా తీసుకోవడానికి నేను రెడీ'' అంటూ నవ్వించాడు రణబీర్.

కత్రినా, రణ్‌బీర్‌

ఈ విషయం పక్కన పెడితే 'జగ్గా జాసూస్‌' ప్రమోషన్‌ కోసం మీడియా ముందుకొస్తున్న కత్రినా, రణ్‌బీర్‌.. కాస్సేపు కూడా కలిసి వుండలేకపోతుండడం గమనార్హం. కెమెరాలు క్లిక్‌మనిపించేంతసేపు మాత్రమే కలిసి వుంటున్నారు. 'సరిపోతుందా.?' అని మీడియాని ఓ మాట అడిగేసి, విడివిడిగా వెళ్ళిపోతున్నారు. క్షణాల్లోనే వీరిద్దరి మధ్యా ఆ 'క్లోజ్‌నెస్‌ కెమిస్ట్రీ' బ్రేక్‌ అయిపోతుండడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. ఈ సినిమా ట్రైలర్ నిన్ననే విడుదలయ్యింది. అటుకూడా ఒక లుక్ వెయ్యండి.

English summary
Just days ahead of the release of the much-awaited Anurag Basu film 'Jagga Jasoos' starring Ranbir Kapoor and Katrina Kaif, makers released an elaborative trailer of the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu