5కోట్లు కాదుకదా..ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ హీరోతో చెయ్యను...?

By Sindhu

కత్రినా కైఫ్, సల్మాన్‌ ఖాన్... ఒకప్పుడు జంట పేర్లివి. ఈ ఇద్దరి ప్రేమయాణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రేమలోని అన్ని రుచులను అనుభవించిన ఈ ఇద్దరు ఇప్పుడు బద్ధ శత్రువులు. ఇప్పుడు సల్మాన్ పేరెత్తితే అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. ఒకప్పుడు ఒకే గూటి పక్షుల్లా మెలిగిన ఈ జోడి ఇప్పుడు కత్తులు దూసుకుంటున్నారు. రీసెంట్ గా యష్ రాజ్ ఫిల్మ్ ప్రొడక్షన్ లో ఓ చిత్రానికి కత్రినాకైఫ్ కి సల్మాన్ సరసన ఆఫరొచ్చింది. అయితే ఇంతకు మునుపే సల్మాన్ సరసన బాడీగార్డ్ రీమేక్ లో నటించనంటూ రిజెక్ట్ చేసిన విషయం తెలిసిందే.

ఇక కత్రినా అయితే ఈ విషయంలో అగ్గిమీద గుగ్గిలం అయిపోయారు. తన మాజీ ప్రియుడు సల్మాన్ పేరు తన వద్ద ప్రస్తావనకు తీసుకురావద్దని గతంలోనే మీడియాకు చాలా సార్లు చెప్పిన ఈ సెక్సీసుందరి... ఇప్పుడు దర్శక, నిర్మాతలకీ ఈ మేరకు సందేశాలు పంపించారట. సల్మాన్‌కు జోడీగా నటించమని ఎవ్వరూ తన వద్దకు రావొద్దని తేల్చిచెప్పారు కత్రినా ఆ సందేశంలో. ఐదు కోట్లు ఇచ్చినా, ఇంకా ఎక్కువ ఇచ్చినా సరే... సల్మాన్‌ తో కలిసి నటించే వుద్దేశమే తనకు లేదని ముక్కుసూటిగా అందరికి చెబుతున్నారామె ఈ సంఘటనతో. నిన్న మొన్నటిదాకా ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వున్న మాట వాస్తవమే కానీ ఇప్పుడు ఆ మనస్పర్థలు తార స్థాయికి చేరిపోయాయని ఈ జంట స్నేహితులు చెబుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X