»   » ఒక్క రోజులో పదిలక్షల ఫాలోవర్లా..!? కత్రినా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు

ఒక్క రోజులో పదిలక్షల ఫాలోవర్లా..!? కత్రినా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

సోషల్ మీడియా అనేది సెలబ్రిటీలకు ఫాలోవర్లని పెంచుతుందా... లేక ఫాలోవర్ల ఎదురుచూపులతోనే సెలబ్రిటీలు సోషల్ మీడియాలోకి వస్తారో గానీ అభిమానులకు, సెలబ్రిటీలకూ ఉండే లింక్ తెగిపోకుండా ఈ సోషల్ నెట్వర్కింగ్ సైట్లు బాగానే ఉపయోగ పడుతున్నాయన్నది మాత్రం కాదనలేని నిజం. ఇక సినీ తారల గురించైతే చెప్పేదేముంది? జులై 16 న తన పుట్టిన రోజు సందర్భంగా ఫేస్బుక్ లోకి వచ్చిన క్యాట్. ఇప్పుడు తాజా గా ఇన్స్టా గ్రామ్ లో కూడా ఖాతా తెరిచేసింది.

హలో ఇన్‌స్టాగ్రామ్‌

హలో ఇన్‌స్టాగ్రామ్‌

బీచ్‌లో తీయించుకొన్న మొదటి ఫొటోకు ‘‘నా ఆనందకర ప్రదేశం నుంచి.. కొత్త ప్రారంభం. హలో ఇన్‌స్టాగ్రామ్‌'' అని రాసి,గురువారం కత్రిన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను తెరిచింది. ‘కొత్త ఆరంభాలు... నాకు నచ్చిన ప్రదేశానికి వచ్చాను' హలో ఇన్‌స్టాగ్రామ్‌ అన్న హ్యాష్‌ ట్యాగ్‌తో బీచ్‌ ఒడ్డున కూర్చుని ఉన్న ఫొటోను అభిమానులతో పంచుకుంది.

టవల్‌ సిరీస్‌

టవల్‌ సిరీస్‌

ఆతర్వాత పాటు తన తాజా ‘టవల్‌ సిరీస్‌' ఫొటో షూట్‌కు సంబంధించిన మరో బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోనుపెట్టింది. అందులో తలకు ఓ టవల్‌ చుట్టుకొని, ఒంటిపై వదులుగా ఓ టవల్‌ చుట్టుకొన్న ఆమె అందరి మతులూ పోగొట్టింది. ఆ ఫొటోకు ‘‘లెజెండరీ ‘టవల్‌ సిరీస్‌' కోసం చేసిన షూటింగ్‌ అద్భుతమైన అనుభవాన్నిచ్చినందుకు.. థాంక్యూ మారియో టెస్టినో'' అని పోస్ట్‌ చేసింది.

టవల్‌ సిరీస్‌

టవల్‌ సిరీస్‌

సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్‌ అయిన మారియో టెస్టినో ఒక బాలీవుడ్‌ సెలబ్రిటీతో స్పెషల్‌ సిరీస్‌ కోసం ఫొటో షూట్‌ చేయడం ఇదే ప్రథమం. అయితే ఆ తర్వాత వచ్చే రెస్పాన్స్ చూసి పిచ్చెక్కిపోయిందట కత్రినా...,ఒకటీ రెండూ కాదు ఒక్కరోజు గడవకముందే అమాంతం 10 లక్షలు దాటేసింది ఫాలోవర్ల సంఖ్య.

జగ్గా జాసూస్‌

జగ్గా జాసూస్‌

ఈ మధ్య కాలం లో ఏ సెలబ్రిటీకీ లేనంత ఫాస్ట్ గా పెరిగిపోయిందీ లిస్ట్. కాగా రణబీర్‌ కపూర్‌ జోడీగా కట్రీనా నటించిన ‘జగ్గా జాసూస్‌' విడుదలకు సిద్ధమవుతుండగా, సల్మాన్‌ఖాన్‌తో చేస్తోన్న ‘టైగర్‌ జిందా హై' సినిమా సెట్స్‌పై ఉంది. ఇంతకీ లక్షలమంది ఫాలోవర్లు తనకున్నారు సరే మతి కత్రినా ఎంతమందిని ఫాలో అవుతోందీ అని చూస్తే మాత్రం 34 నాలుగు అని కనిపిస్తోంది మరి.

English summary
And that glorious moment has arrived! Katrina Kaif has officially joined Instagram and shared her first ever pic on the platform.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu