'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్': కత్రినా కైఫ్ ఫోటోలు లీక్... సెక్సీ లుక్ వైరల్!
Recommended Video

కెరీర్ తొలినాళ్లతో పోలిస్తే కత్రినా కైఫ్ నటన పరంగా, డాన్సింగ్ స్కిల్స్ పరంగా చాలా ఇంప్రూవ్ అయింది. ఆకట్టుకునే అందం కూడా ఉండటంతో అతి తక్కువ కాలంలోనే బాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. ముఖ్యంగా కత్రినా డాన్సింగ్ స్కిల్స్ ప్రేక్షకులను అనేక సందర్భాల్లో అబ్బుర పరిచాయి. శీలాకి జవాని, చికినీ చమేలీ, చాలా చస్మా లాంటి పాటల్లో కత్రినా దమ్ము దులిపింది. మరోసారి అలాంటి స్పెషల్ సాంగులో కత్రినా కైఫ్ ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయబోతోంది.

థగ్స్ ఆఫ్ హిందూస్థాన్'
ప్రస్తుతం కత్రినా కైఫ్ 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కత్రినా అదిరిపోయే డాన్స్ నెంబర్ చేస్తోంది. తాజాగా ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి.

హాట్ హాట్ లుక్స్
లీకైన ఫోటోలు చూసిన ఫ్యాన్స్ కత్రినా కైఫ్ లుక్ స్టన్నింగ్‌గా ఉందని అంటున్నారు. ఆమె మరోసారి శీలాకి జవాని, చికినీ చమేలీ, చాలా చస్మా తరహాలో ఎంటర్టెన్ చేస్తుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుదేవా కొరియోగ్రఫీ
థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' చిత్రంలో రెండు బిగ్ ఈవెంట్ సాంగ్స్ ఉంటాయని తెలుస్తోంది. ఈ రెండు పాటల్లోనూ కత్రినా ఉంటుందట. ఒక పాటలో కత్రినాతో పాటు అమీర్ కూడా ఉంటారని సమాచారం. పహాడీ డాన్స్ నెంబర్‌తో సాగే ఓ పాటను ఆల్రెడీ చిత్రీకరించారు. కత్రినా మాత్రమే ఉండే పాటకు ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా డాన్స్ కంపోజ్ చేశారు. జనవరిలో దాదాపు వారంరోజుల పాటు ఈ పాటను చిత్రీకరించారట.

కత్రినా సెల్ఫీ
ఇటీవల కత్రినా కైఫ్ సోషల్ మీడియాలో ఓ సెల్ఫీ పిక్ షేర్ చేసింది. డియరెస్ట్ అమీర్ ఖాన్, ఫాతిమా సనా షేక్ అంటూ.... ఈ ఫోటోను ఆమె అభిమానులతో పంచుకున్నారు.

రూ. 210 కోట్ల భారీ బడ్జెట్
'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' చిత్రాన్ని రూ. 210 కోట్ల బడ్జెట్ తో యష్ రాజ్ ఫిలింస్ వారు నిర్మిస్తున్నారు. ధూమ్ 3 చిత్రానికి దర్శకత్వం వహించిన విజయ్ కృష్ణ ఆచార్య దర్శకుడు. అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్, జాకీష్రాఫ్, శశాంక్ అరోరా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎపిక్ పీరియడ్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంగా దీన్ని రూపొందించారు. దీపావళికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











