»   » షూటింగ్‌లో గాయపడ్డ కత్రినా కైఫ్.. కరీనాకు అవకాశం!

షూటింగ్‌లో గాయపడ్డ కత్రినా కైఫ్.. కరీనాకు అవకాశం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ తీవ్రంగా గాయపడింది. దర్శకుడు అనురాగ్ బసు రూపొందిస్తున్న జగ్గా జాసూస్ చిత్ర షూటింగ్ కత్రీనా కైఫ్ గాయపడింది. వెన్నముకకు బలమైన గాయం కావడంతో ఆమె షూటింగ్‌లకు, అవార్డు ఫంక్షన్లకు దూరంగా ఉంటున్నట్టు సమాచారం. త్వరలో జరుగనున్న జీ సినీ అవార్డుల కార్యక్రమం నుంచి తప్పుకోవడంతో ఆమె స్థానంలో కరీనా కపూర్ ఖాన్‌కు అవకాశం దక్కినట్టు తెలిసింది.

 జీ ఫిలిం అవార్డుల కోసం రిహార్సల్

జీ ఫిలిం అవార్డుల కోసం రిహార్సల్

జీ సినీ అవార్డుల కార్యక్రమంలో ఆడిపాడేందుకు ఇటీవల రిహార్సల్ మొదలుపెట్టింది. రిహార్సల్‌లో భాగంగా వెన్నుభాగం నుంచి
మెడ వరకు భరించలేనంత నొప్పి కలుగడంతో వెంటనే ఈ వేడుక నుంచి తప్పుకొన్నది. వైద్యులను సంప్రదించగా కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోమని చెప్పినట్టు ఓ బాలీవుడ్ పత్రిక కథనాన్ని వెల్లడించింది.

జగ్గా జాసూస్ చిత్ర షూటింగ్‌లో గాయం

జగ్గా జాసూస్ చిత్ర షూటింగ్‌లో గాయం

వారం రోజుల క్రితం జగ్గా జాసూస్ చిత్ర షూటింగ్‌లో తీవ్రగాయమైంది. భారీ పరికరం ఒకటి కైఫ్ వెనుక భాగంలో బలంగా తాకింది. అయినా గాయంతోనే షూటింగ్‌లో నిర్విరామంగా పాల్గొన్నది. షూటింగ్‌లో పాల్గొన్నప్పుడు పెద్దగా నొప్పి కలుగలేదు. కానీ ఈ మధ్య ఆ నొప్పి తీవ్రమైంది.

గాయంతోనే కైఫ్ డ్యాన్స్ ప్రాక్టీస్

గాయంతోనే కైఫ్ డ్యాన్స్ ప్రాక్టీస్

ఊహించని విధంగా వెన్నముకకు గాయమైంది. నొప్పిలోనూ రిహార్సల్ చేయడానికి ప్రయత్నించాను. కానీ గాయం తీవ్రమవ్వడంతో సాధ్యంకాలేదు. చాలా బాధాకరంగా ఉంది అని కత్రినా కైఫ్ తెలిపారు.

మార్చి 11న జీ అవార్డుల వేడుక

మార్చి 11న జీ అవార్డుల వేడుక

మార్చి నెల 11న జీ అవార్డుల కార్యక్రమం వైభవంగా నిర్వహిస్తున్నారు. దీని కోసం ప్రదర్శించే డ్యాన్స్ ప్రొగ్రాం కోసం రిహార్సల్ చేస్తున్నారు. ఈ మధ్యలోనే నొప్పి ఎక్కువగా కావడంతో వేడుక నుంచి ఆమె తప్పుకొన్నారు. దాంతో కరీనా కపూర్‌కు అవకాశం దక్కింది.

English summary
Katrina Kaif has hurt her spine badly, and is unable to perform at an upcoming awards show. She has been replaced by Kareena Kapoor Khan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu