»   » ఈ వీడియో చూసారా? కట్టప్ప తో శివగామి రొమాన్స్

ఈ వీడియో చూసారా? కట్టప్ప తో శివగామి రొమాన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబ‌లి మానియా ఇప్పుడప్పుడే వదిలేలా లేదు. బాహుబలి ది బిగినింగ్ ఫీవరే రెండేళ్లయినా ఇంకా తగ్గలేదు. రకరకాలుగా యాడ్స్ లో ఈ సినిమాని ప్రత్యక్షంగానో పరోక్షంగానో వాడుకున్నారు. ఇప్పుడు కూడా ఇంకా అదే ట్రెండ్ కొన సాగుతూనే ఉంది. పోయిన సంవత్సరం పురుగుమందుల కోసం శివగామి దేవి క్యారెక్టర్ తో యాడ్ చేయించారు.

బాహుబలి

బాహుబలి

రమ్యకృష్ణ కనిపించిన ఈ యాడ్ బాహుబలి 2 రిలీజ్ నాటికి కూడా వైరల్గా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. అలాంటిదే ఇప్పుడు ఇంకో యాడ్ వచ్చింది. అయితే ఇక్కడ బాహుబలి నాటి వాతావరణమే అదే నటీ నటులు కానీ బాహుబలి కి దీనికీ సంబందం లేదు...

రమ్యకృష్ణ, సత్యరాజ్

రమ్యకృష్ణ, సత్యరాజ్

అయినా సరే రమ్యకృష్ణ, సత్యరాజ్ కనిపించిన ఆ యాడ్ ఇప్పుడు తమిళ్, మళయాలం లలో పిచ్చి పిచ్చిగా వైరల్ అవుతోంది ఇంతకూ ఇందులో ప్రత్యేకత ఏమితంటే. బాహుబలి లో లో రాజ‌మాత ఆదేశాలను శిర‌సావ‌హించే పాత్ర పోషించిన స‌త్య‌రాజ్‌.. ఈ యాడ్‌లో మాత్రం ఆమె ప‌క్క‌న రాజుగా న‌టించాడు.

రొమాన్స్ ఏంటి

రొమాన్స్ ఏంటి

క‌ట్ట‌ప్ప‌తో రొమాన్స్ ఏంటి అన్న సందేహం రావ‌డం స‌హ‌జ‌మే. క‌ట్టు బానిస‌గా బాహుబ‌లిలో శివగామి ముందు మోక‌రిల్లే క‌ట్ట‌ప్ప‌.. ఆమెతో రొమాన్స్ చేయ‌డం ఏంటి అన్న అనుమానం క‌లుగుతుంది. కానీ వీళ్ల రొమాన్స్‌కి బాహుబ‌లికి సంబంధం లేదు. ఓ క‌మ‌ర్షియ‌ల్ యాడ్‌లో శివ‌గామి (ర‌మ్య‌కృష్ణ‌), క‌ట్ట‌ప్ప (స‌త్య‌రాజ్‌) క‌లిసి న‌టించారు.

టెక్స్‌టైల్ బ్రాండ్ కోసం

ఓ టెక్స్‌టైల్ బ్రాండ్ కోసం ఈ ఇద్ద‌రూ క‌లిసి న‌టించారు. దేశ‌మంతా బాహుబ‌లి మానియాలో ఉన్న ఈ స‌మ‌యంలో ఈ ఇద్ద‌రి యాడ్‌కు ప్రాధాన్య‌త ఏర్ప‌డింది. ఇప్పుడీ వీడియో వైర‌ల్ అయింది. ఇద్ద‌రి మ‌ధ్య కెమెస్ట్రీ మాత్రం బాగానే కుదిరింది. చూడాలి ఇంకొన్నాళ్ళకైనా వెండి తెర మీద ఈ జంట ఇలా కనిపిస్తారేమో...

English summary
new clip that has Sathyaraj aka Kattappa wooing his wife Ramya Krishnan aka Sivagami is going viral. The two starred together in an ad for a textile company playing a royal couple.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu