»   »  ఆ నటికి ఎస్వీ బ్రేక్

ఆ నటికి ఎస్వీ బ్రేక్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Kaveri Jha
తొలి సినిమా ఫ్లాపయినా హీరోయిన్ కావేరీఝూ కెరిర్ కి ఢోకా లేదు. నగరం తో పరిచయం అయిన ఆమె ఆ సినిమాలో ఒళ్ళు దాచుకోకండా నటించి పారేసింది. ఆ అద్బుత అందాల ప్రదర్శన తెలుగు నిర్మాతలకి డైరక్టర్లకి బాగా నచ్చేసినట్లుంది. దాంతో ఆమె మెల్లిమెల్లిగా బిజీ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమె ప్రస్తుతం ప్యామిలీ సినిమాల డైరక్టర్ గా పేరు తెచ్చుకున్న యస్.వి.కృష్ణారెడ్డి కొత్త సినిమాలో బుక్కయింది. బహుమతి సినిమా పరాజయం తో గత సంవత్సర కాలంగా డైరక్షన్ కి దూరంగా ఉన్న ఆయన మళ్ళీ మెగా ఫోన్ పట్టి శివాజి, కావేరీఝూ లను డైరక్ట్ చెయ్యబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి. ఆమె ఈ సినిమానే కాక మరో పెద్ద బ్యానర్ లో సెకండ్ హీరోయిన్ గా సెలక్టయినట్లు తెలిస్తోంది. కష్టపడిన వాళ్ళకి కష్ట పడినంత ....అందుకే మొదటి సినిమాలో మొహమాటపడకూడదని అంటున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X