నయీం ఎన్‌కౌంటర్‌లో ఖతం అయ్యేంతవరకూ...
నయీమ్ చిన్నప్పటినుంచి ఎన్‌కౌంటర్‌లో మరణించిన వరకూ జరిగిన అన్ని సంఘటనల్ని తెరపై చూపిస్తున్నామని కట్టా రాంబాబు తెలిపారు.
గ్యాంగ్‌స్టర్ నయీం జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న చిత్రం 'ఖయ్యుం భాయ్' దాదాపు పూర్తికావొచ్చింది. వచ్చెనెల 5వ తేదీకి షూటింగ్ పూర్తిచేసి గుమ్మడికాయ కొట్టడానికి రెడీ అవుతున్నారు. నయీమ్ పాత్రలో కట్టా రాంబాబు నటిస్తున్న ఈ చిత్రంలో పోలీసు అధికారి పాత్రను తారకరత్న పోషిస్తున్నారు. సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర మ్యూజిక్ నందిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడిగా భరత్ వ్యవహరిస్తున్నారు.

ఇటీవల కట్టా రాంబాబు మీడియాతో మాట్లాడుతూ 'భరత్ ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ఆయనతో 25 ఏళ్ల స్నేహ బంధం నాది అని తెలిపారు. అలాగే నందమూరి ఫ్యామిలీతోనూ చక్కని అనుబంధం ఉందని తెలిపారు. నయీమ్ చిన్నప్పటినుంచి ఎన్‌కౌంటర్‌లో మరణించిన వరకూ జరిగిన అన్ని సంఘటనల్ని తెరపై చూపిస్తున్నామన్నారు. గోపి మోహన్ - కోన వెంకట్ పర్యవేక్షణలో భవానీ ప్రసాద్ మాటలు అందించారు.


Click it and Unblock the Notifications











