»   »  అమితాబ్ ని గుర్తుపడ్తరు...చిరంజీవితో కూడా చర్చిస్తాం:" కేసీఆర్

అమితాబ్ ని గుర్తుపడ్తరు...చిరంజీవితో కూడా చర్చిస్తాం:" కేసీఆర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :" 70 ఏండ్లు దాటిన అమితాబ్‌ను చిన్నపిల్లవాడు కూడా గుర్తు పడ్తరు, అది కళాకారుల గొప్పతనం. హైదరాబాద్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధిపై అవసరమైతే చిరంజీవితో కూడా చర్చిస్తాను. ఇక ఫిలిం సొసైటీలలో కేవలం కళాకారులకే కాకుండా అందరికీ అవకాశం ఇద్దాం" అన్నారు తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు.

Kcr about Amithab and Chiranjeevi

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
ఆదివారం శిల్పకళావేదికలో సినీనటి జయసుధ తనయుడు శ్రేయన్ నటించిన బస్తీ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. సీఎం హోదాలో తొలిసారి ఒక సినీ కార్యక్రమానికి హాజరైన కేసీఆర్, ప్రభుత్వం మొదటినుంచి చెప్తున్నట్టు నగరంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉందనే భరోసాను ఇచ్చారు. సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ పరిష్కరిసాం.

Kcr about Amithab and Chiranjeevi

హైదరాబాద్ నగరంలో తెలుగు చలన చిత్రపరిశ్రమకు అన్ని హంగులు కల్పిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సినీ ప్రముఖులకు హామీ ఇచ్చారు. ఈ మేరకు త్వరలోనే సినీ దిగ్గజాలతో సమావేశం నిర్వహించి వారి సలహాలు సూచనలు కూడా పరిగణనలోకి తీసుకుంటామని ప్రకటించారు. ఏ దేశంలో కవులు, కళాకారులు, గాయకులకు గౌరవం లభిస్తుందో ఆ సమాజం సుభిక్షంగా ఉంటుందని చెప్పారు.

Kcr about Amithab and Chiranjeevi

అలాగే కేసీఆర్ కంటిన్యూ చేస్తూ... హైదరాబాద్‌లో ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఏర్పాటుచేస్తామని, ఇతర రాష్ట్రాల వారు ఇక్కడికి వచ్చి నేర్చుకునేలా ఇన్‌స్టిట్యూట్‌ను తీర్చిదిద్దుతామని అన్నారు.

ఈ వేడుకలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, దాసరి నారాయణ రావు, మోహన్‌బాబు, మురళీ మోహన్‌, టి.సుబ్బిరామిరెడ్డి, కె.రాఘవేంద్రరావు, డి.సురేష్‌బాబు, విజయనిర్మల, ఎన్‌.శంకర్‌, జీవితా రాజశేఖర్‌, తదితరులు పాల్గొన్నారు.

English summary
Telangana chief minister KCR has arrived at the venue of audio launch function ceremony of Basti movie which is the debut movie of Shreyan, son of senior actress and politician Jaya Sudha.Telangana CM has been greeted by the cine celebs on the occasion. The chief minister was seen accepting the greetings from Jaya Sudha,Dasari Narayana Rao,TSR and others. The movie is likely to be released on July 3rd,2015.
Please Wait while comments are loading...