»   » చాలామందున్నారు, మీరు వెళ్ళిపోండి: కీరవాణి పై వెల్లువెత్తుతున్న విమర్శలు

చాలామందున్నారు, మీరు వెళ్ళిపోండి: కీరవాణి పై వెల్లువెత్తుతున్న విమర్శలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ లో ఉన్న దర్శకులు బుర్రలేనివాళ్ళు అనటం ఇప్పుడు ఇండస్ట్రీ లో వివాదానికి కారణం అయ్యింది. ఎన్నో సినిమాలకి కీరవాణి సుమధుర సంగీతం అందించారు. అదే సమయంలో, కొన్ని సినిమాలకు ఆయన పస లేని సంగీతం అందించిన విషయాన్నీ మర్చిపోలేం అలా అని ఆయన్ని విమర్శిస్తే ఎలా... అన్ని గొప్పవే కాదు కదా... అలా అని అందరూ పసలేని డైరెక్టర్లే ఉండరు కదా అన్నది కీరవాణి ని వ్యతిరేకించే వాళ్ళ వాదన... రెండురోజులుగా ఏం జరుగుతోందంటే

నా మాటలు వినేవారు కాదు

నా మాటలు వినేవారు కాదు

నేను నా కెరీర్లో ఎక్కువగా బుర్రలేని చాలామంది దర్శకులతో నేను పనిచేశాను. వారు నా మాటలు వినేవారు కాదు.... చాలామంది దర్శకులు నన్నో సంగీత దర్శకుడిగా మాత్రమే చూసేవారు. నా నుండి వచ్చే మంచి సలహా తీసుకోవడంలో అశ్రద్ధ చూపే వారు, ఒకవేళ నేను నా కెరీర్‌ కొనసాగించాల్సి వస్తే నా శ్రేయోభిలాషుల కోసం పనిచేస్తా.

పెద్ద దుమారమే రేగింది

పెద్ద దుమారమే రేగింది

అంతేకానీ నా మాటను వినిపించుకోని, పట్టించుకోని వారి కోసం పనిచేయను అంటూ కీరవాణి రెండు రోజుల కిందట చేసిన వ్యాఖ్యలతో పెద్ద దుమారమే రేగింది. అంతా బాహుబలి సంబరం లో ఉన్నారు అనుకున్నా అదేసమయం లో ట్విట్టర్ లో కీరవాణి పై మాటల ఎదురుదాడి మామూలుగా జరగలేదు...

దర్శకులు బుర్రలేని వారు

దర్శకులు బుర్రలేని వారు

రెండు దశాబ్దాలకు పైగా కీరవాణి సినీ సంగీత సామ్రాజ్యంలో తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. ఎంతోమందితో కలిసి పనిచేశారు. చేసినంత కాలం చేసి తీరా ఇప్పుడు బాహుబలి లాంటి రేంజ్ సినిమాలకి చేసాక ఇప్పుడు తీరిగ్గా మిగతా దర్శకులు బుర్రలేని వారు అనటం మాత్రం దారుణం. ఇదే సంగతి ఆయన ట్విటర్ వాల్ మీద వచ్చిన కమెంట్లని చూస్తే తెలుస్తుంది....

 బ్రెయిన్ లెస్ డైరెక్టర్లతో మీరెందుకు

బ్రెయిన్ లెస్ డైరెక్టర్లతో మీరెందుకు

ఇతర డైరెక్టర్లు కూడా చిన్న,పెద్ద, మధ్యతరగతి కుటుంబాల వాళ్లు ఉన్నారని, కుటుంబాన్ని పోషించుకునేందుకు వారు ప్రయత్నిస్తున్నారని, ప్రతి డైరెక్టరూ హిట్ కొట్టేందుకే ప్రయత్నిస్తాడని, ఇతరులను విమర్శించడం మానుకోవాలని హితవు చెబుతున్నారు. మరి, అలాంటి బ్రెయిన్ లెస్ డైరెక్టర్లతో మీరెందుకు పనిచేసారు? అన్న ప్రశ్నలు వచ్చాయి.

https://www.youtube.com/watch?v=U7mY2upEiZE

బాహుబలి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా

అంతేకాదు.. బాహుబలి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా కాపీ మ్యూజిక్కేనని పేర్కొంటూ ఓ హాలీవుడ్ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ వీడియోను కీరవాణి ట్వీట్‌కు రిప్లైగా పోస్ట్ చేశాడు ఓ వ్యక్తి. అంతేకాదు.. ఇండస్ట్రీలో మీకు ఒక్కరికే బ్రెయిన్ ఉందని అనుకుంటున్నారా..? మ్యూజిక్ డైరెక్టర్లలో కాపీ కొట్టేవాళ్లలో మీరే ముందుంటారు అంటూ వచ్చిన రిప్లై మరీ ముక్కుసూటిగా ప్రశించింది.

మీరేం దేవుడు కాదు

మీరేం దేవుడు కాదు

కొందరతే ఏకంగా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి మీరు వెళ్లిపోతే బాగుంటుందని సూచిస్తున్నారు. ఇక్కడి నుంచి వెళ్లి వేరే ఇండస్ట్రీలో ప్రయత్నిస్తే కనీసం గుర్తింపు కూడా రాదని,. సంగీతంలో మీరేం దేవుడు కాదని, టాలీవుడ్‌లో బ్రెయిన్ లేని మ్యూజిక్ డైరెక్టర్లు చాలా మందే ఉన్నారని, అందులో మీరు కూడా ఉంటారని మండిపడుతున్నారు.

రామ్‌గోపాల్ వర్మతో ముడిపెడుతున్నారు

రామ్‌గోపాల్ వర్మతో ముడిపెడుతున్నారు

బ్రెయిన్ లెస్ డైరెక్టర్లున్నారంటూ వారికి సలహాలు ఇచ్చే బదులు.. మీరే వచ్చి ఓ సారి సినిమాను డైరెక్ట్ చేయొచ్చు కదా అని హితవు పలుకుతున్నారు. ఇక, బ్రెయిన్ లెస్ వ్యాఖ్యలపై కీరవాణిని రామ్‌గోపాల్ వర్మతో ముడిపెడుతున్నారు సినీ అభిమానులు. అలాంటి ఓ బ్రెయిన్ లెస్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మను ట్విట్టర్లో ఫాలో అవుతూ.. ఇలాంటి బ్రెయిన్ లెస్ వ్యాఖ్యలను ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నారంటూ మండిపడ్డారు.

పెద్ద చర్చకే దారి తీసింది.

పెద్ద చర్చకే దారి తీసింది.

ఇండస్ట్రీ నుంచి మీరు పోయినంత మాత్రాన జరిగే నష్టం ఏమీ లేదని, టాలెంట్ ఉన్న ఎంతో మంది మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారని, ఇలాంటి వ్యాఖ్యలు మానుకోవాలని చెప్ప్తూ కూడా చాలానే రిప్లైలు వచ్చాయి. తెలుగు సినీ పరిశ్రమలో చాలామంది దర్శకులకు బుర్రలేదనేంత అక్కసు కీరవాణికి ఎందుకు పుట్టుకొచ్చిందో ఏమోనన్న చర్చ ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద చర్చకే దారి తీసింది...

English summary
Keeravani’s barrage of Tweets becomes a taking point in Tollywood
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu