»   » కీరవాణి మొదటి ప్రిఫరెన్స్ మహేష్ కా...!? - పవన్ కా...!?

కీరవాణి మొదటి ప్రిఫరెన్స్ మహేష్ కా...!? - పవన్ కా...!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

దాదాపు తెలుగు స్టార్‌ హీరోలందరికీ చక్కని మ్యూజిక్‌ అందించిన కీరవాణి ప్రిన్స్‌ మహేష్‌ బాబు, పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ల చిత్రాలకు మాత్రం ఇంతవరకూ సంగీతం అందించలేదు. ఇక రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ప్రతీ చిత్రానికి కీరవాణి సంగీతం అందించడం అనవాయితీగా వస్తున్న విషయం మీకు తెలిసిందే. కాగా అల్లు అరవింద్‌ నిర్మించిన 'మగధీర" చిత్రానికి కీరవాణి మంచి మ్యూజిక్‌ అందించి సినిమా కంటే ముందే ఆడియో ద్వారా హిట్‌ టాక్‌ సంపాదించాడు.

ఇది గమనించిన అల్లు అరవింద్‌ తన తనయుడు అల్లు అర్జున్‌ నటిస్తున్న 'బద్రీనాథ్‌" చిత్రానికి కూడా కీరవాణికి ఛాన్స్‌ ఇచ్చారు. కాగా పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాన్‌తో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న అరవింద్‌ ఆ చిత్రానికి కూడా కీరవాణి బాణీలను ఉపయోగించాలనే ఆలోచనలో వున్నాడు. ఇదిలా వుంటే మహేష్‌బాబుతో రాజమౌళి అతి త్వరలో ఓ చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి కూడా కీరవాణి సంగీతాన్ని అందిస్తాడనే విషయం మీకు ప్రత్యేకంగా చెప్పకర్లేదు. అయితే కీరవాణి తొలిసారిగా పవన్‌ చిత్రానికి సంగీతమందిస్తాడా... లేక మహేష్‌ చిత్రానికా అన్నది అతి త్వరలో తెలియనుంది. అదీ పవన్‌మహేష్‌ల మధ్య కీరవాణి కిరికిరికి అసలు కథ.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu