»   » ఆపండి: ఆమె స్థాయి ఎక్కడ? పవన్ కళ్యాణ్ ఎక్కడ?

ఆపండి: ఆమె స్థాయి ఎక్కడ? పవన్ కళ్యాణ్ ఎక్కడ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కొన్ని రోజులుగా మీడియాలో 'నేను శైలజ' చిత్ర హీరోయిన్ కీర్తి సురేష్ గురించి రకరకాల ప్రచారం జరుగుతుంది. జరిగితే జరిగింది కానీ ఆ ప్రచారంలో పవన్ కల్యాణ్ పేరు కూడా వినిపిస్తుండటం, ఆయన్ను ఏదో తక్కువ చేసిన చూపిస్తున్నట్లు ఆ ప్రచారం సాగుతుండటంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ భగ్గు మంటున్నారు.

పవన్ కళ్యాణ్ హీరోగా ఎస్.జె.సూర్య దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కీర్తి సురేష్ ను హీరోయిన్ గా తీసుకోవాలని ప్లాన్ చేసారని, యూనిట్ సభ్యులు ఆమెను సంప్రదించారని, అయితే అదే సమయంలో ఆమెకు తమిళస్టార్ విజయ్ సరసన చేసే అవకాశం దక్కడంతో పవన్ కళ్యాణ్ సినిమాకు నో చెప్పిందని ప్రచారం జరిగింది.

తాజాగా కీర్తి సురేష్ నాని హీరోగా తెరకెక్కే సినిమాకు 'ఎస్' చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. 'సినిమా చూపిస్త మావ ఫేం' దర్శకుడు త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తారట. అంతా బాగానే ఉంది కానీ....పవన్ కళ్యాణ్ సినిమాకు 'నో' చెప్పి నాని సినిమాకు 'ఎస్'చెప్పిందంటూ కొత్తగా ప్రచారం ప్రారంభం కావడం పవన్ అభిమానులను తీవ్రంగా నొప్పించింది. నాని స్థాయి ఎక్కడ, కీర్తి సురేష్ స్థాయి ఎక్కడ.....అంటూ మండి పడుతున్నారు.

Keerthy Suresh in Nani's next?

అసలు కీర్తి సురేష్ కు పవన్ కళ్యాణ్ సినిమాలో అవకాశం వచ్చిందో? రాలేదో? అనే విషయంపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఒక వేళ వచ్చినా ఆమె డేట్స్ అడ్జెస్ట్ కాక చేయలేనని చెప్పి ఉండవచ్చు. పవన్ సినిమా షూటింగేమో ఆల్రెడీ మొదలైంది. నాని హీరోగా దిల్ రాజు చేసే సినిమా మొదలు కావడానికి చాలా సమయం ఉంది.

పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరో సినిమాలో అవకాశం వస్తే.... ఏ హీరోయిన్ కూడా కాదనే పరిస్థితి లేదు. మరి కీర్తి సురేష్ విషయంలో అసలు ఏం జరిగిందో తెలియదు. అమ్మడు చేసింది తెలుగులో ఒకే ఒక్క సినిమానే అయినా ఇలా గాసిప్పుల రూపంలో బాగా పాపులర్ అయింది.

English summary
Nenu... Sailaja actress Keerthy Suresh has been approached to play the female lead in actor Nani's upcoming film with Trinadha Rao who had directed Cinema Chupista Mama.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu