»   »  అమేజింగ్: అచ్చంగా సావిత్రిగారి లాగే

అమేజింగ్: అచ్చంగా సావిత్రిగారి లాగే

Posted By:
Subscribe to Filmibeat Telugu
Keerthy Suresh Playing A Role Of Legendary Mahanati Savithri | Filmbieat Telugu

తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ సువర్ణాధ్యాయాన్ని సృష్టించుకున్న సావిత్రి జీవితం ఆధారంగా 'మహానటి' పేరుతో తెలుగు, తమిళ భాషల్లో సినిమా నిర్మాణం జరుగుతున్న విషయం తెలిసిందే కదా.. భారతీయులు గర్వించదగ్గ నటీమనుల్లో మహానటి సావిత్రి ఒకరు.

గత కొద్దిరోజులుగా ఈ మహానటి జీవిత కథ ఆధారంగా బయోపిక్ మూవీని తెరకెక్కించడానికి ప్రయత్నాలు జరుగుతూ వస్తున్నాయి. కాగా సావిత్రి జీవితంలో కీలక ఘట్టాలపై హోమ్ వర్క్ చేసిన దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ ప్రాజెక్ట్‌ను డీల్ చేయడానికి సిద్ధపడ్డాడు.భారీ అంచనాలతో తెరకెక్కుతున్న మూవీ ఎప్పుడు లాంచ్ అవుతుందా అని అభిమానులు గత కొంతకాలంగా ఎదురుచూస్తున్నారు.

Keerthy Suresh Transformed into Mahanati

సావిత్రి పాత్రలో కోలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ నటిస్తుండగా మరొక స్టార్ హీరోయిన్ సమంత కథలో కీలక పాత్ర పోషించనున్నారు. అలాగే స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్రలో కనిపించనున్నాడు. సమతకు భర్తగా విజయ్ దేవరకొండ నటిస్తుండగా.. భానుప్రియ, రాజేంద్రప్రసాద్‌లు ఈ మూవీలో కీ రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది.


Keerthy Suresh Transformed into Mahanati

"తరాలను నిర్మించే స్త్రీ జాతి కోసం.. తరతరాలు గర్వించే మహానటి సావిత్రి కథ" అంటూ తెరకెక్కిస్తున్న సినిమా మహానటి సావిత్రి. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా తీసిన నాగ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మూడు దశాబ్దాల పాటు మకుటం లేని మహారాణిగా ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలిన సావిత్రి కథను సినిమాగా అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో సావిత్రిగా కీర్తి సురేష్, మరో ముఖ్యమైన పాత్రలో సమంత నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాలో కీర్తి సురేష్ గెటప్‌కు సంబంధించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.


English summary
Young heroine Keerthy Suresh is essaying the role of legendary Mahanati Savithri and her transformation into the role is much needed both looks wise and of course, performance wise.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu