twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీదేవి స్వర్గానికి వెళ్లినా.. బోనిని కాదు అతడిని గుర్తుంచుకోవాల్సిందే.. ఎందుకంటే..

    By Rajababu
    |

    అందాల నటి శ్రీదేవి మరణం ఓ దశలో తీవ్ర వివాదంగా మారేటట్టు కనిపించింది. ఇప్పట్లో ఆమె భౌతికకాయం వస్తుందా? లేదా అనే మీమాంస నెలకొంది. అనేక ఊహాగానాలకు చెక్ చెబుతూ శ్రీదేవి మృతదేహం స్వదేశానికి చేరింది. శ్రీదేవి పార్దీవ దేహం ముంబైకి చేరడానికి దుబాయ్‌లో కేరళకు చెందిన ఓ వ్యక్తి కీలక పాత్ర వహించారు. ఆయన ఎవరో కాదు.. అష్రాఫ్ షెర్రీ థమారస్సెరీ. దుబాయ్‌లో ఎవరైన చనిపోతే పేపర్ వర్క్ అంతా చేసిపెట్టడంలో అష్రాఫ్‌ను మించిన వారెవరూ లేదని చెబుతారు.

    4700 మృతదేహాలను

    4700 మృతదేహాలను

    అష్రాఫ్ ఇప్పటివరకు దుబాయ్ నుంచి ప్రపంచదేశాలకు సుమారు 4700 మృతదేహాలను పంపించడంలో కీలక పాత్ర వహించారు. పొరుగుదేశంలో చనిపోయిన వారిని వారి సొంత ప్రాంతాలకు పంపడం ఓ బాధ్యతగా భావిస్తాడు.

    నడిపేది మెకానిక్ షాప్ కానీ

    నడిపేది మెకానిక్ షాప్ కానీ

    అష్రాఫ్ ప్రధానంగా దుబాయ్‌లోని అజ్మన్‌లో మెకానిక్ షాప్ నడుపుతాడు. కానీ స్వచ్చంద సేవ, సామాజిక సేవకే అధిక ప్రాధాన్యం ఇస్తాడు. మంగళవారం రాత్రి ఇంటికి చేరుకొని శ్రీదేవి మరణించిన విషయాన్ని తన భార్య, పిల్లలతో షేర్ చేసుకొన్నాడు.

    దేవుడి ఆశీస్సుల కోసమే

    దేవుడి ఆశీస్సుల కోసమే

    దుబాయ్, షార్జా, ఇతర ప్రాంతాల్లో ఒకవేళ చనిపోతే ఇక్కడ విధానాలు చాలా మందికి తెలియదు. విషాద సమయంలో అనేక ఇబ్బందులకు గురవుతారు. అందుకే నేను వారికి సహాయం అందిస్తాను. దేవుడి దీవెనల కోసమే ఈ పనిచేస్తుంటాను.

    ధనికుడైనా.. పేదవారైనా ఒకటే

    ధనికుడైనా.. పేదవారైనా ఒకటే

    దుబాయ్‌లో ఎవరికైనా ఒకటే విధానం ఉంటుంది. ఎవరైనా బయట చనిపోతే వెంటనే వారిని హాస్పిటల్‌కు తరలిస్తారు. అక్కడి నుంచి నేరుగా పోలీస్ మార్చురీకి పంపిస్తారు. ధనికుడైనా, సంపన్నుడైనా, పేదవాడైనా అందరికి ఒకటే విధానం ఉంటుంది.

    అదే రోజు ఐదు మృతదేహాలు

    అదే రోజు ఐదు మృతదేహాలు

    శ్రీదేవి చనిపోయిన సమయంలో మరో నాలుగు మృతదేహాలకు అష్రాఫ్ పేపర్ వర్క్ చేసిపెట్టాడు. శ్రీదేవి మృతదేహంతోపాటు మొత్తం ఐదు భౌతికకాయాలను వారి దేశాలకు తరలించాను అని అష్రాఫ్ తెలిపారు. శ్రీదేవి మరణంపై కొన్ని సందేహాలు వ్యక్తం కావడంతో తరలింపు ప్రక్రియ ఆలస్యమైంది.

    వందలాది ఫోన్లు వచ్చాయి

    వందలాది ఫోన్లు వచ్చాయి

    శ్రీదేవి మరణం సంభవించిన తర్వాత కాన్సులేట్ అధికారులు రంగంలోకి దిగారు. వెంటనే ఆమె పాస్‌పోర్టును సీజ్ చేసి వారి తరఫున కొన్ని డాక్యుమెంట్లను ప్రిపేర్ చేశారు. ఆ సమయంలో జర్నలిస్టులు, అధికారులు, ఇతర వ్యక్తుల నుంచి వందలాది ఫోన్ కాల్స్ వచ్చాయి అని అష్రాఫ్ తెలిపారు.

    లెక్కలేనన్ని అవార్డులు

    లెక్కలేనన్ని అవార్డులు

    సామాజిక సేవకు పూనుకొన్న అష్రాఫ్‌కు లెక్కలేనన్ని అవార్డులు, రివార్డులు వచ్చాయి. ఇంట్లో షెల్ఫ్‌లలో అవార్డులు పేర్చి ఉంటాయి. అందులో ఒకటి ప్రధాని మోదీతో కలిసిన ఫోటో ప్రధానంగా కనిపిస్తుంది.

    English summary
    Listed only as “ASHRAF” on the official paperwork in Dubai is Ashraf “Sherry” Thamarassery, a 44-year-old Indian from Kerala who has become a ferryman of sorts for those who die here in the United Arab Emirates. From indebted laborers to the moneyed elite, Thamarassery has helped repatriate 4,700 bodies to 38 countries across the world. He views it as a noble responsibility in this desert sheikhdom that draws so many far from their homes, chief among them his compatriots.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X