»   » ఆ డర్టీ లేడీ... ఆ మహనీయురాలి సినిమా చేయడమేంటి?: దర్శకుడి ఫైర్

ఆ డర్టీ లేడీ... ఆ మహనీయురాలి సినిమా చేయడమేంటి?: దర్శకుడి ఫైర్

Posted By:
Subscribe to Filmibeat Telugu
డర్టీ లేడీ...అంటూ విద్యాబాలన్ పై కేతి రెడ్డి ఫైర్ !

ఇండియన్ సినీ పరిశ్రమలో గత కొన్ని రోజులుగా బయోపిక్‌ల జోరు కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖుల జీవితాల ఆధారంగా వచ్చిన చిత్రాలకు బాక్సాఫీసు వద్ద మంచి స్పందన రావడంతో మరిన్ని బయోపిక్ చిత్రాలు రూపుదిద్దుకుంటున్నాయి. తెలుగులో సీనియర్ ఎన్టీఆర్ జీవితంపై మూడు చిత్రాలు రాబోతున్న సంగతి తెలిసిందే. అదే విధంగా బాలీవుడ్లో భారత మాజీప్రధాని ఇందిరా గాంధీ బయోపిక్ ప్లాన్ చేస్తున్నారు.

 ఇందిరా గాంధీగా విద్యా బాలన్

ఇందిరా గాంధీగా విద్యా బాలన్

ప్రముఖ జర్నలిస్ట్ సాగరికా ఘోష్ రాసిన ‘ఇందిరా: ఇండియాస్ మోస్ట్ పవర్‌ఫుల్ పీఎం' బయోగ్రఫీ హక్కుల్ని కూడా విద్యా కొనుగోలు చేసింది. సినిమా లేదా వెబ్ సిరీస్ రూపంలో ఇందిరా గాంధీ జీవితాన్ని తెరకెక్కించాలని విద్యా బాలన్ యోచిస్తోందట.

 ఇది సహించరాని విషయం

ఇది సహించరాని విషయం

ఇందిరాగాంధీ‌గా విద్యా బాలన్ నటించడం సహించరాని విషయమని...... ‘లక్ష్మీస్ వీరగ్రంధం' చిత్ర దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఒక గొప్ప మహిళా నాయకురాలి పాత్ర ను డర్టీ పిక్చర్ లాంటి చిత్రం లో నటించిన లేడీ చేయడం ఏమిటని ప్రశ్నించారు.

వెంటనే ఆ ప్రయత్నం విరమించుకోవాలి

వెంటనే ఆ ప్రయత్నం విరమించుకోవాలి

ఇందిరా గాంధీ పాత్రలో విద్యా బాలన్ నటించబోతున్నారనే వార్త ఇందిర అభిమానులను కలతకు గురి చేస్తుందని, వెంటనే ఆమె ఆ ప్రయత్నం‌ను విరమించాలని కేతిరెడ్డి కోరారు.

 వార్నింగ్

వార్నింగ్

ఈ దేశ సమైక్యత, సమర్గతలను కాపాడే ప్రయత్నంలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఒక మహిళా నేత పాత్రలో విద్యా బాలన్ లాంటి నటిని ఊహించటం కష్టమని, ఆమె ఆ ప్రయత్నం మానుకోక పోతే ఇందిర అభిమానుల ఆగ్రహానికి గురికాక తప్పదని కేతిరెడ్డి హెచ్చరించారు.

 శక్తి కపూర్... మోడీ పాత్రలో ఒప్పుకుంటారా?

శక్తి కపూర్... మోడీ పాత్రలో ఒప్పుకుంటారా?

కళాకారులు ఏ పాత్ర, ఎవరైనా పోషించవచ్చు. కానీ వారు గతంలో నటించిన పాత్రల ప్రభావం ఈ పాత్రపై ఉంటుంది కాబట్టి అభిమానులు, ప్రజలు జీర్ణించుకోలేని పరిస్థితి ఉంటుందని, కొందరు కోర్టుకు వెళ్లే అవకాశం ఉందని, అప్పుడు కోర్టుల చుట్టూ తీరిగే కంటే ముందు జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఉదాహరణకు నరేంద్రమోడీ పాత్రలో శక్తికపూర్ నటిస్తే ప్రజలు ఒప్పుకుంటారా ...అని కేతిరెడ్డి ప్రశ్నించారు.

English summary
Tumhari Sulu done, Vidya Balan will now be busy with her new project, the rights of which she just acquired. The National Award-winning actress recently got the rights for Sagarika Ghose's book titled Indira - India'S Most Powerful Prime Minister and is thrilled about portraying the former prime minister. However, whether it will be a full-fledged movie or a wed series is not decided yet. Vidya made the big announcement with a statement on Tuesday, saying: "I am happy to have acquired the rights to Sagarika Ghose's Indira - India's Most Powerful Prime Minister, because I have always wanted to play Indira Gandhi. I haven't decided yet whether it should be a film or a web series, but that will take a while anyway," reported IANS.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X