లక్ష్మీ పార్వతి పై కేతిరెడ్డి సంచలన కామెంట్స్ ! | Filmibeat Telugu
జయ, పార్వతి జీవితం ఒక్కటే
లక్మీపార్వతి జీవితం, శశికళ జీవితం ఒకటే. ఓ సేవకురాలిగా ఒకరి జీవితంలో ప్రవేశించిన వారికి ఉంది. అలా ముఖ్యమంత్రుల జీవితంలోకి ప్రవేశించి రాజాంగేతరశక్తి మారిన వారు అప్పటి రాజకీయాల్లో ఎలా చక్రం తిప్పారనే ఇతివృత్తంగా సినిమాను రూపొందిస్తున్నాం అని కేతిరెడ్డి తెలిపారు.
జయ జీవితంలోని కీలక అంశాలతో
జయలలిత, లక్ష్మీ పార్వతి ఇద్దరి లక్ష్యం రాజ్యాధికారం మాత్రమే. ఆ వారి జీవితంలోని కొన్ని కీలక అంశాలను ఆధారంగా చేసుకొని సినిమాను తెరకెక్కించనున్నట్టు కేతిరెడ్డి తెలిపారు. లక్ష్మీ'స్ వీరగ్రంధం, శశిలలిత సినిమాలలో నేటి సమకాలీన రాజకీయాలు, యాదార్ధ సంఘటనల కథ ఆధారాలతో నిర్మిస్తున్నానని ఆయన వెల్లడించారు.
జయ మరణించేంత వరకు
జయలలిత జీవితంలో శశికళ ప్రవేశించినప్పటి నుంచి జయలలిత హాస్పిటల్లో మరణించే వరకు చోటుచేసుకొన్న ప్రతీ సంఘటన ఈ చిత్రంలో ఉంటుంది. సెప్టెంబర్ 22 నుంచి డిసెంబర్ 5 వరకు జరిగిన ప్రతి సంఘటన ఈ చిత్రంలో కనిపిస్తాయి అని చిత్ర దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తెలిపారు.
నా అంతు చూస్తామన్నారు
ఇకపోతే కొందరు అనుకున్నట్టు శశికళ జీవితం ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తే తమిళనాడుకు చైదిన శశికళ వర్గం అయిన మన్నార్‌గుడి మాఫియా నా అంతు చూస్తామని బెదిరించారు. గతంలో జయలలిత బ్రతికుండగానే తెలుగు భాషకు తమిళనాడులో జరుగుతున్న అన్నాయం పై ఎదిరించటం జరిగింది. అప్పుడే తనను ఏ శక్తి ఎమీ చేయలేదు. ఇక ఇప్పుడు వారు ఏం చేస్తారు అని అన్నారు.
నన్ను ఏ శక్తి అడ్డుకోలేదు..
జయలలిత మరణం వెనుక కుట్ర ఉందని శశికళపై సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసిన నాడే తనను ఎమీ చేయలేదు. ఒక లక్ష్యంతో పనిచేసే వారిని ఏ శక్తి అడ్డుకోలేదు. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా సిద్ధం అని కేతిరెడ్డి తెలిపారు.
లక్మి'స్ వీరగ్రంధంలో పూజాకుమారి
ఇకపోతే లక్మి'స్ వీరగ్రంధంలో గురుడవేగ, విశ్వరూపంలో నటించి మెప్పించిన హీరోయిన్ పూజకుమార్ లక్ష్మీపార్వతి పాత్రలో నటించనున్నారు. శశికళ, జయలలిత పాత్రలకు తర్వలో నటీనటులను ఎంపిక చేయనున్నామని దర్శకుడు కేతిరెడ్డి తెలిపారు.