For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నాకు రియల్ హీరోలు ఆ ఇద్దరే : ‘కెవ్వు కేక’ ఆడియోలో నరేష్

  By Bojja Kumar
  |

  హైదరాబద్: బ్లేడ్ బాబ్జీ వంటి విజయంతమైన చిత్రం తర్వాత అల్లరి నరేష్-దేవిప్రసాద్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం 'కెవ్వు కేక'. షర్మిల మాంద్రే కథానాయిక. జాహ్నవి ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీమతి నీలిమ సమర్పణలో బొప్పన చంద్రశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

  హీరో అల్లరి నరేష్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈచిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో జరిగింది. ఆడియో వేడుకతో పాటు నరేష్ పుట్టిన రోజు కావడంతో పరిశ్రమలోని ప్రముఖులు, వర్ధమాన తారలు హాజరై సందడి చేసారు.

  తొలి పాటను పోసాని కృష్ణ మురళి, శ్రీహరి, రెండో పాటను బి.గోపాల్, మారుతి, మూడో పాటను అంబికా రామచంద్రరావు, భీమినేని శ్రీనివాసరావు, నాలుగో పాటను వీరభద్రం చౌదరి, కె.ఎల్.దామోదరప్రసాద్, టి.ప్రసన్నకుమార్ ఆవిష్కరించారు. ట్రైలర్ ను డా.డి. రామానాయుడు,సురేష్ బాబు, శ్రీకాంత్ కలిసి ఆవిష్కరించారు. ఇక ఆడియో సీడీని నరేష్ తల్లి సరస్వతి విడుదల చేసారు.

  నరేష్ చెప్పిన వివరాలు స్లైడ్ షోలో.....

  ‘ప్రతి వ్యక్తి జీవితంలో రియల్ హీరోలు ఉంటారు. నాకు మా నాన్న హీరో. ఇప్పుడు మా అన్నయ్య ఆర్యన్ రాజేష్ హీరో. నా పుట్టినరోజుకు అమ్మ రావడం సంతోషంగా ఉంది. అమ్మచేత్తో ఏం చేసినా నాకు విజయమే. ‘కెవ్వు కేక' మూవీ కూడా మంచి విజయం సాధించాలి' అని నరేష్ చెప్పుకొచ్చారు.

  కెవ్వు కేక ఆడియో వేడుక కార్యక్రమంలో సురేష్ బాబు, రాహుల్, అమ్మిరాజు, శ్రీనాగ్, నిరంజన్, వివేక్, జ్యోతి, అపూర్వ, తిరుపతి ప్రకాష్, గీతా సింగ్, వి.ఎన్.మూర్తి, బెక్కం వేణుగోపాల్, శ్రీనివాసరావు, గంగోత్రి సాయి, రోహిత్, కాదంబరి కిరన్, ప్రిన్స్, నాని, వీర శంకర్, ఖయ్యుమ్, నందమూరి హరి తదితరులు పాల్గొన్నారు.

  కెవ్వు కేక ఆడియో ఫంక్షన్లోనే అల్లరి నరేష్ పుట్టినరోజు వేడుక ఘనంగా జరిగాయి. అతిథులంతా నరేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

  కుటుంబ సభ్యులు, అతిథుల సమక్షంలో కేక్ కట్ చేస్తున్న అల్లరి నరేష్

  కెవ్వుకేక ఆడియో కార్యక్రమానికి బుల్లి ఈవీవీ కూడా వచ్చాడు. ఎవరీ బుల్లి ఈవీవీ అనుకుంటున్నారా? ఇంకెవరు...ఆర్యన్ రాజేష్ తనయుడు. ఈవీవీ మరణం తర్వాత పుట్టడంతో ఈవీవీ గారే మళ్లీ ఈ రూపంలో వచ్చారని కుటుంబ సభ్యులు నమ్ముతున్నారు.

  టాలీవుడ్ యంగ్ హీరోలతో కలిసి ‘కెవ్వు కేక' ఆడియో సీడీలను ప్రదర్శిస్తున్న నరేష్

  ఈచిత్రానికి కథ: దేవిప్రసాద్, వేగేశ్న సతీష్, మాటలు: వేగేశ్న సతీష్, కెమెరా: అడుసుమిల్లి విజయ్ కుమార్, సంగీతం: చిన్ని చరణ్, భీమ్స్, ఎడిటర్: నందమూరి హరి, నిర్మాణ నిర్వహణ: వల్లూరిపల్లి వెంకటేశ్వరరావు, సమర్పణ: శ్రీమతి నీలిమ, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: దేవి ప్రసాద్.

  English summary
  Allari Naresh and Sharmila Maandrey starrer 'Kevvu keka' audio release function held yesterday. 'Blade Babji' fame Devi Prasad is the director. Boppana Chandra Sekhar produces and Smt. Neelima presents the film under Jahnavi Productions banner.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X