»   » బ్రూస్ లీ సందేశాత్మకం, నాన్న దారిలో సేవ : రామ్ చరణ్

బ్రూస్ లీ సందేశాత్మకం, నాన్న దారిలో సేవ : రామ్ చరణ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాన్న మెగా స్టార్ చిరంజీవి చూపిన సేవా మార్గంలోనే తాను నడుస్తానని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అన్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో కేఎఫ్ సీకి చెందిన 500 మంది ఉద్యోగులు గురువారం రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన రాంచరణ్ మాట్లాడుతూ..ఒక సంస్థకి చెందిన ఉద్యోగులు ఇలా సేవాకార్యక్రమంలో వచ్చి పాల్గొనడం మంచి పరిణామమన్నారు. అవయవ దానం చేయానికి కూడా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు.

ఈ నెల 16న విడుదలవుతున్న బ్రూస్ లీ సినిమా గురించి మాట్లాడుతూ....బ్రూస్ లీ సినిమా సందేశాత్మకంగా ఉంటుందని, సినిమా విడుదలకు ఒక రోజు ముందు అంధ విద్యార్థులతో కలిసి చూడనున్నట్లు ఆయన తెలిపారు. బాబాయ్ పవన్ కళ్యాణ్ తో త్వరలో చేయబోయే సినిమా గురించి మాట్లాడుతూ ప్రస్తుతం బాబాయ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాతో పవన్ బిజీగా ఉన్నారని, ఆ చిత్రం పూర్తయిన తర్వాత సినిమా వివరాలు ప్రకటిస్తానన్నారు.

 KFC employees donating blood at Chiranjeevi Charitable Trust

రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్రూస్ లీ'. బ్రూస్ లీ చిత్రాన్ని వరల్డ్ వైడ్ దాదాపు 2000 స్క్రీన్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అమెరికాలో కూడా భారీ ఎత్తున విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా విడుదల కానన్ని అత్యధిక స్క్రీన్లలో ‘బ్రూస్ లీ' సినిమా విడుదలవుతోంది. 220 స్క్రీన్లలో ‘బ్రూస్ లీ' చిత్రం విడుదలవుతోంది.

రామ్ చరణ్ హీరోగా కావడం, శ్రీను వైట్ల దర్శకత్వం, మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ రోల్ ఇలా సినిమాలో ఎన్నో ఆకర్షణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వస్తాయని ఆశిస్తున్నారు.

 KFC employees donating blood at Chiranjeevi Charitable Trust

రామ్‌చరణ్‌, రకుల్‌ప్రీత్‌లతో పాటు చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన నదియా, అరుణ్‌ విజయ్‌ నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కథ: కోన వెంకట్‌, గోపీమోహన్‌, మాటలు: కోన వెంకట్‌, ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస, కూర్పు: ఎ.ఆర్‌. వర్మ, కళ: నారాయణరెడ్డి, ఫైట్స్‌: అణల్‌ అరసు, సమర్పణ: డి. పార్వతి, మూలకథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల.

English summary
About 500 KFC employees are donating blood today at Chiranjeevi Charitable Trust and their CEO is also attending the camp.
Please Wait while comments are loading...