Don't Miss!
- Sports
విరాట్ కోహ్లీ ఆ బంతిని వదిలేయాల్సింది.. ఇన్ని తప్పులు ఎప్పుడూ చేసుండకపోవచ్చు: సెహ్వాగ్
- News
పీఎం కిసాన్ వద్దా..? సగ మందికి కూడా రావడం లేదు: రాములమ్మ ఫైర్
- Finance
తెలంగాణలో యూరియా ప్లాంట్‌ను తెరిపించింది మేమే: మోడీ: రూ.8 లక్షల కోట్లు
- Automobiles
భారతదేశంలోకి రావాలంటే మా కండిషన్స్ ఇవి: టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్
- Lifestyle
'ఈ' టీ తాగడం వల్ల మీ గుండెను సురక్షితంగా ఉంచుకోవచ్చు అని మీకు తెలుసా?
- Technology
Xiaomi Pad 6 లాంచ్ వివరాలు వచ్చేసాయి ! స్పెసిఫికేషన్లు చూడండి
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Salaar తర్వాత KGF Chapter 3 షూటింగ్.. రిలీజ్ డేట్ ప్రకటించిన నిర్మాత
దర్శకుడు ప్రశాంత్ నీల్, రాకింగ్ స్టార్ యష్ కాంబినేషన్‌లో వచ్చిన KGF Chapter 2 బాక్సాఫీస్ వద్ద రికార్డులను బ్రేక్ చేస్తూ వసూళ్ల జైత్రయాత్రను కొనసాగిస్తున్నది. 2022 ఏడాదిలో 1180 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకొన్నది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం తొలివారం 720 కోట్లకుపైగా, రెండో వారం 223.51 కోట్లకుపైగా, మూడోవారం 140.55 కోట్లకుపైగా, నాలుగో వారం 91. కోట్లకుపైగా భారీ వసూళ్లను సాధించింది. 5వ వారంలో కూడా ఘనంగా కలెక్షన్లను సాధిస్తున్నది.
కేజీఎఫ్2 చిత్ం కన్నడ, హిందీ, మలయాళ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజై విజయఢంకా మోగించింది. హిందీలో జైత్రయాత్రను కొనసాగిస్తున్న ఈ చిత్రాన్ని నటుడు, దర్శకుడు, నిర్మాత ఫర్హాన్ అఖ్తర్, ఆయన స్నేహితుడు రితేస్ సిద్వానీ ఉత్తర భారతంలో రిలీజ్ చేయడం తెలిసిందే. అయితే ఇలాంటి సినిమాకు కొనసాగింపుగా KGF Chapter 3 మూవీ గురించి నిర్మాత విజయ్ కిరగందూర్ క్లారిటీ ఇచ్చాడు. KGF Chapter 3 చిత్రాన్ని 2024లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం అని ఆయన అన్నారు.

KGF Chapter 3 చిత్రానికి సంబంధించిన సీక్వెల్స్ విషయంలో మార్వెల్ కథా చిత్రాలను ఫాలో అవుతాం. ప్రస్తుతం ప్రభాస్‌తో సలార్ సినిమా షూటింగులో ప్రశాంత్ నీల్ బిజీగా ఉన్నారు. సలార్ సినిమా 35 శాంత పూర్తయింది. వచ్చే వారం ప్రభాస్ మూవీ షూటింగ్ ప్రారంభమవుతుంది. అక్టోబర్, లేదా నవంబర్ తర్వాత షూటింగ్ పూర్తి అవుతుంది. ఆ తర్వాత కేజీఎఫ్3 సినిమాను మొదలుపెడుతాం. కేజీఎఫ్3 సినిమాను 2024లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అని విజయ్ కిరగందూర్ తెలిపారు.
కేజీఎఫ్ మూవీ సీక్వెల్ ద్వారా మార్వెల్ తరహా యూనివర్స్‌ను క్రియేట్ చేస్తాం. అందుకోసం పక్కాగా ప్లానింగ్ చేస్తున్నాం. స్పైడర్ మ్యాన్, డాక్టర్ స్ట్రేంజ్ మాదిరిగా ప్రతీ సీక్వెల్ కోసం డిఫరెంట్ క్యారెక్టర్లను డిజైన్ చేస్తాం. దాంతో అత్యధికంగా ప్రేక్షకులను చేరుకోవడానికి ప్రయత్నిస్తాం అని విజయ్ కిరగందూర్ పేర్కొన్నారు.