»   » ‘ధృవ’ ఫంక్షన్లో మెగాస్టార్ 150 మూవీ ట్రీట్ ఇలా... (ఫోటోస్)

‘ధృవ’ ఫంక్షన్లో మెగాస్టార్ 150 మూవీ ట్రీట్ ఇలా... (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న 'ఖైదీ నెం 150' సినిమా కోసం మెగా అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో... ఆదివారం జరిగిన రామ్ చరణ్ 'ధృవ' ప్రీ రిలీజ్ ఫంక్షన్లో సర్ ప్రైజ్ ప్లాన్ చేసారు. ఈ సినిమాలో మెగాస్టార్ యాక్ష‌న్ స్టైల్‌ కి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేసారు.

Photos : చెర్రీ ధృవ పంక్షన్‌లో కెటిఆర్, గంటా


రామ్ చరణ్ మాట్లాడుతూ...... డిసెంబ‌ర్ 9న అన్నీ కుదిరితే నాన్న‌గారి 150వ చిత్రం ఖైదీ నంబ‌ర్ 150 సినిమా టీజ‌ర్ ధృవ థియేట‌ర్స్‌లో విడుద‌ల చేయ‌డానికి మేం ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. సంక్రాంతి కానుకగా 'ఖైదీ నెం 150' రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.


మెగాస్టార్ లుక్ అదిరింది

మెగాస్టార్ లుక్ అదిరింది

ఈ పోస్టర్ చూసిన అభిమానులు.... గ్యాంగ్ లీడర్, ఘ‌రానా మొగుడు లెవ‌ల్లో బాస్ ఇచ్చిన ఆ ఫోజు అదిరిందని అంటున్నారు.


భారీ అంచనాలు

భారీ అంచనాలు

సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ కూడా మెగా అభిమానులు మెచ్చే విధంగా ఉంటుందని, అన్ని కమర్షియల్ అంశాలతో పూర్తి విందు భోజనంలా ఈ సినిమా ఉండబోతోందని స్పష్టమవుతోంది.


ధృవ పంక్షన్లో కేటీఆర్ మాట్లాడుతూ..

ధృవ పంక్షన్లో కేటీఆర్ మాట్లాడుతూ..

కేటీఆర్ మాట్లాడుతూ - ``చ‌ర‌ణ్ నాకు మంచి మిత్రుడు. చ‌ర‌ణ్ కంటే ముందు చిరంజీవిగారు నాకు మంచి మిత్రుడు. శాస‌న‌స‌భ‌లో ఆయ‌న‌తో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. నిర్మ‌ల‌మైన మ‌న‌సున్న వ్య‌క్తి చిరంజీవిగారు. అదే ల‌క్ష‌ణాలు చర‌ణ్‌లో క‌న‌ప‌డుతున్నాయి. తండ్రి మెగాస్టార్‌, బాబాయ్ ప‌వ‌ర్‌స్టార్‌, చ‌ర‌ణ్ మెగాప‌వ‌ర్ స్టార్‌. చ‌ర‌ణ్ చాలా టాలెంటెడ్‌. ఈ సినిమా చ‌ర‌ణ్‌కు తొమ్మిదో సినిమా. చ‌ర‌ణ్ ల‌క్కీ నెంబ‌ర్‌, కారు నెంబ‌ర్‌, పుట్టిన నెంబ‌ర్ అంతా కూడా తొమ్మిదే వ‌స్తుంది. ఈ సినిమా కూడా డిసెంబ‌ర్ 9నే వ‌స్తుంది. చ‌ర‌ణ్ ప‌డ్డ క‌ష్టం చూసి ఆశ్చ‌ర్య‌పోయాను. అర‌వింద్‌స్వామిగారు అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారు. చ‌ర‌ణ్‌, అర‌వింద్‌, ప్ర‌సాద్‌, సురేంద‌ర్‌రెడ్డి, ర‌కుల్ స‌హా అంద‌రికీ ఆల్ ది బెస్ట్‌`` అన్నారు.


సురేందర్ రెడ్డికి థాంక్స్

సురేందర్ రెడ్డికి థాంక్స్

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ మాట్లాడుతూ... సురేందర్ రెడ్డిగారు ఈ సినిమా ఒప్పుకున్నందుకు థాంక్స్. త‌మిళం కంటే తెలుగులోనే సినిమాను బాగా చేసి ఇచ్చారు. ఈ సినిమా ఇంత స్ట‌యిలిష్‌గా ఉండ‌టానికి కార‌ణం వినోద్‌గారు, రాజీవ‌న్ గారు స‌హా మంచి అవుట్‌పుట్ ఇచ్చారు. ప్ర‌తి ఒక్క‌రూ వారి వారి అభిమానుల‌ను అల‌రించ‌డానికి క‌ష్ట‌ప‌డ‌తారు. నేను కూడా అలానే క‌ష్ట‌ప‌డ్డాను త‌ప్ప కొత్త‌గా ఏం చేయ‌లేదు అన్నారు.


బెత్తం ప‌ట్టుకుని న‌డిపించ‌డానికి మ‌ళ్లీ

బెత్తం ప‌ట్టుకుని న‌డిపించ‌డానికి మ‌ళ్లీ

జ‌న‌వ‌రిలో నాన్న‌గారి ఖైదీ నంబ‌ర్ 150 వ‌స్తుంది. ఆయ‌న లేని టైంలో మేం అలా ఇలా ఉంటే ఒకే. కానీ ఇప్పుడు ఆయ‌న మ‌ళ్లీ వ‌చ్చి ఒక స్టాండ‌ర్డ్ సెట్ చేసి బెత్తం ప‌ట్టుకుని న‌డిపించ‌డానికి మ‌ళ్లీ వ‌స్తున్నారు. ఆయ‌న రావ‌డంతో ఇంకా క్ర‌మ‌శిక్ష‌ణ‌తో క‌ష్ట‌ప‌డ‌తామ‌ని ఈ సంద‌ర్భంగా తెలియ‌జేస్తున్నాను. డిసెంబ‌ర్ 9న అన్నీ కుదిరితే నాన్న‌గారి 150వ చిత్రం ఖైదీ నంబ‌ర్ 150 సినిమా టీజ‌ర్ ధృవ థియేట‌ర్స్‌లో విడుద‌ల చేయ‌డానికి మేం ప్లాన్ చేస్తున్నాం. మనం ఇత‌రుల‌కు ఏమిస్తే అదే మ‌న‌కు తిరిగొస్తుంది. కానీ సినిమా ఇండ‌స్ట్రీలో మేం అభిమానుల‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తే అభిమానుల‌ను తిరిగి మ‌మ్మ‌ల్ని ఎంట‌ర్‌టైన్ చేయరు. మాకు పేరు, డ‌బ్బు, గౌర‌వం ఇస్తారు. ఇండ‌స్ట్రీలో పుట్టినందుకు, ఇలా న‌టిస్తున్నందుకు గర్వంగా ఉంది అన్నారు.


ఆయన్ను అరెస్ట్ చేయాల‌న్నా, అందుకోవాల‌న్నా అషామాషీ కాదు

ఆయన్ను అరెస్ట్ చేయాల‌న్నా, అందుకోవాల‌న్నా అషామాషీ కాదు

బోయ‌పాటి శ్రీను మాట్లాడుతూ - ``సాధార‌ణంగా సినిమాల్లో తండ్రి పోలీస్‌, కొడుకు దొంగ‌గా ఉంటారు. కానీ మెగా ఫ్యామిలీ విష‌యానికి వ‌స్తే కొడుకు పోలీస్‌గా ధృవ సినిమా చేస్తే, తండ్రి ఖైదీగా ఖైదీ నంబ‌ర్ 150 సినిమా చేయ‌డం థ్రిల్‌గా ఉంది. అయ‌న్ను అరెస్ట్ చేయాల‌న్నా, అందుకోవాల‌న్నా అషామాషీ విష‌యం కాదు. వేరు గ‌ట్టిదైతే ఉంటే చెట్టు బలంగా ఎదుగుతుంది. ఆ చెట్టు ఎంతో మంది ఎద‌గ‌డానికి దోహ‌దప‌డుతుంది. దానికి బెస్ట్ ఎగ్జామ్‌పుల్ చిరంజీవిగారు. ఆయ‌న ఎదుగుతూ ఓ అద్భుత‌మైన ఫ్లాట్‌ఫాం వేశారు. మ‌ధ్య‌లో కాసేపు రెస్ట్ తీసుకున్నారంతే. మ‌ళ్లీ ట్విస్ట్ ఇవ్వ‌డానికి వ‌స్తున్నారు. అదే ఖైదీ నంబర్ 150. ధృవ‌తో పాటు ఖైదీ నంబ‌ర్ 150 పెద్ద హిట్టై ప‌రిశ్ర‌మ క‌ళ‌క‌ళ‌లాడాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.


రెగ్యులర్ సినిమా కాదు

రెగ్యులర్ సినిమా కాదు

సురేంద‌ర్‌రెడ్డి మాట్లాడుతూ - ``ధృవ రెగ్యుల‌ర్ సినిమా కాదు. కొత్త‌గా ఉంటుంది. కొత్త‌గా చేయాల‌ని చ‌ర‌ణ్ సినిమా చేయాల‌ని ఈ సినిమాను సెల‌క్ట్ చేసుకుని నాకు ద‌ర్శ‌క‌త్వం అవ‌కాశం ఇచ్చారు. మంచి టీంను కూడా ఇచ్చాడు. అంత మంచి టీం ఉండ‌బ‌ట్టే సినిమా బాగా వ‌చ్చింది. మ‌న‌కు క‌న‌ప‌డే చ‌ర‌ణ్ వేరు. త‌న హార్ట్ వేరు. ఈ సినిమాతో చ‌ర‌ణ్ లాంటి మంచి వ్య‌క్తిని, ఫ్రెండ్‌ను సంపాదించుకున్నాను. నిర్మాతలు అర‌వింద్‌, ప్ర‌సాద్‌గారి వ‌ల్లే సినిమా చాలా బాగా వ‌చ్చింది. అవ‌కాశం ఇచ్చి స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్‌`` అన్నారు.


English summary
Khaidi No 150 action poster released at Dhruva release function.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu