»   » చిరంజీవి ఈ వయస్సులో ఇలా ..గ్రేట్ అనిపిస్తుంది కదూ (వీడియో)

చిరంజీవి ఈ వయస్సులో ఇలా ..గ్రేట్ అనిపిస్తుంది కదూ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : చిరంజీవికు వయస్సు పెరుగుతోందా..తగ్గుతోందా అనే డౌట్ వచ్చే సంఘటన నిన్న జరిగింది. అదే దీపావళి కానుకగా విడుదల చేసిన ఆయన తాజా చిత్రం ఫొటోలు. ఇవి చూసిన వారు షాక్ అవుతున్నారు. 'బాస్‌ ఈజ్‌ బ్యాక్‌' అంటూ చిరంజీవి అభిమానులు సందడి చేసుకుంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తొమ్మిదేళ్ల సుదీర్ఘ విరామం తరవాత ఆయన సినిమా మొదలైంది. 'ఖైదీ నంబర్‌ 150'గా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నారు చిరు.

ప్రముఖ దర్శకుడు వివి వినాయక్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కాజల్‌ హీరోయిన్ . పాటలు మినహా చిత్రీకరణ దాదాపుగా పూర్తయినట్టే. దీపావళి కానుకగా శనివారం ఈ సినిమాలోని చిరంజీవి లుక్‌ని విడుదల చేశారు. చిరుని ఈ లుక్‌లో చూస్తుంటే కుర్ర హీరోలకు ఏమాత్రం తగ్గనట్టుగానే కనిపిస్తోంది. ఈ స్టిల్‌ చాలిక ఫ్యాన్స్‌కి చిచ్చుబుడ్లతో పనిలేనట్టే. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం కోసం రామ్‌చరణ్‌ కూడా ఓ పాటలో తళుక్కున మెరవబోతున్నాడని సమాచారం.

English summary
On the eve of Deepavali festival, megastar Chiranjeevi's look from his comeback movie 'Khaidi No 150' was released.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu