»   » ఖైదీ మోత మొదలైంది "బాహుబలి రికార్డు బద్దలు".... బాస్ ఈజ్ బ్యాక్

ఖైదీ మోత మొదలైంది "బాహుబలి రికార్డు బద్దలు".... బాస్ ఈజ్ బ్యాక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగాస్టార్ మోత మొదలైంది. 8యేళ్ల తర్వాత రీ-ఎంట్రీ ఇస్తోన్న మెగాస్టార్ చిరంజీవి 150వ "ఖైది నెం. 150"పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయ్. మునపటి మెగాస్టార్ చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రేక్షకుల అంచనాలకి తగ్గట్టుగా దర్శకుడు వివి వినాయక్ ఖైది పక్కగా తెరకెక్కిస్తున్నారు. మెగాస్టార్ రంగంలోకి దిగితే బాక్స్ బద్దలవ్వాల్సిందే. ఇది దృష్టిలో వుంచుకొనే చిరు ఖైదీ హైక్కుల కోసం డిస్ట్రిబ్యూటర్లు క్యూ కడుతున్నారు.

తాజాగా, 'ఖైదీ నెం.150' ఓవర్సీస్ రైట్స్ ని బంపర్ రేట్ కి 'క్లాసిక్ సినిమాస్' దక్కించుకొంది. ఇందుకోసం రూ.13.5కోట్ల సమర్పించుకొంది.ఈ చిత్రంపై మెగా అభిమానుల్లోనే గాక సగటు సినీ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలే ఉన్నాయి. తమిళ 'కత్తి' కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం తాలూకు ఫస్ట్ లుక్ ఈ మధ్యే విడుదలై మంచి స్పందన కూడా తెచ్చుకుంది. ఈ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకునే డిస్ట్రిబ్యూటర్లు చిత్రం హక్కుల కోసం ఎంత భారీ మొత్తాన్నైనా వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నారు.

khaidi no 150 overseas rights sold for a big amount

తాజాగా సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారాం ప్రకారం ఈ చిత్రం యొక్క ఓవర్సీస్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడైనట్టు తెలుస్తోంది. క్లాసిక్ సినిమాస్ ఈ హక్కులను రూ.13.50 కోట్లకు కొన్నారట. అంతేగాక ఓవర్సీస్ లో సినిమా భారీ వసూళ్లను కొల్లగోడుతుందన్న ధీమాను కూడా వ్యక్తం చేస్తున్నారట. ఈ ఫీట్ తో 'బాహుబలి - ది బిగినింగ్' తరువాత ఓవర్సీస్ హక్కుల విషయంలో భారీ మొత్తం పలికిన చిత్రంగా 'ఖైదీ నెం. 150' నిలిచింది. ఇకపోతే చిరు సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని 2017 జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నారు. చిరు ఓవర్సీస్ లోనూ కుమ్మేయడం ఖాయమని క్లాసిక్ సినిమాస్ డిసైడ్ అయ్యింది. అందుకే చిరు కోసం బంపర్ రేట్ ని పెట్టింది. బాహుబలి తర్వాత ఓవర్సీస్ లో ఇంత రేటు మెగాస్టార్ సినిమాకే దక్కడం విశేషం.

English summary
Classics Entertainment, A south Indian movie distributors has acquired overseas distribution rights of Mega Star Chiranjeevi's grand come back movie "Khaidi No.150".
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu