»   » ‘ఖైదీ నెం 150’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (లైవ్)

‘ఖైదీ నెం 150’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (లైవ్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: విజ‌య‌వాడ‌-గుంటూరు మ‌ధ్య‌లో చిన‌కాకాని ప‌రిస‌రాల్లోని హాయ్‌ల్యాండ్‌లో 'ఖైదీ నెం 150' ప్రీరిలీజ్ వేడుక ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల నుండి భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులుహాజరయ్యారు.


అయితే భారీ సంఖ్యలో అభిమానులు హాజరు కావడం పోలీసుల వల్ల కంట్రోల్ కావడం లేదు. అభిమానులు సభ వైపు దూసుకొచ్చే ప్రయత్నం చేస్తుండటంతో చాలా ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. పలుసార్లు యాంకర్ సుమ, పోలీసులు, నిర్మాహకులు వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేసినా అభిమానులు వినిపించుకునే పరిస్థితి కనిపించడం లేదు. అభిమానుల తీరుతో ప్రీ రిలీజ్ పంక్షన్ మధ్య మధ్యలో అంతరాయాలతో సాగుతోంది.


నాగబాబు మాట్లాడుతూ..... సంక్రాంతికి వచ్చే అన్ని సినిమాలు హిట్ కావాలని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా నాగబాబు సంచలన కామెంట్స్ చేసారు. రామ్ చరణ్ గురించి తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖుడు, రచయిత తప్పుగా మాట్లాడారని, తక్కువ చేసి మాట్లాడారని, ఇది మంచిది కాదని హెచ్చరించారు. దీంతో తెలుగు సినీ పరిశ్రమ నుండి ముంబై వెళ్లి సినిమా తీసుకుంటున్న ఓ దర్శకుడు అనయ్య సినిమా గురించి ఏవో కూతలు కూతస్తున్నాడని, ఎవరు ఎన్ని కూతలు కూసినా హిట్టయ్యే చిత్రాన్ని ఆపలేరని, పడిపోయే చిత్రాన్ని లేపరేరని అన్నారు.పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.... ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఒక సాధారణ వ్యక్తిగా వచ్చిన చిరంజీవి మెగాస్టార్ గా ఎదిగాడని అన్నారు. గతంలో ఖైదీ సినిమాకు తాము మాటలు రాశామని, ఆ సినిమా చిరుతోపాటు తమకు కూడా బ్రేక్ ఇచ్చిందని అన్నారు. చిరంజీవి సినిమాల్లో మూడో వంతు సినిమాలకు మాటలు రాసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు.


పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ....దేవుడికోసం భక్తుడు ఎదురు చూసినట్టు ఈ సినిమా కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారన్నారు. ఇండస్ట్రీలో చిరంజీవి ఇంతింతై వటుడింతై అన్నట్టు ఆయన ఆకశమంత ఎత్తు ఎదిగాడని అన్నారు. మెగాస్టార్ అనే చెట్టుకి నాగబాబు, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరన్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, అల్లు శిరీష్, నిహారిక అనే కొమ్మలు వచ్చాయని, ఈ కొమ్మలన్నీ తమ వారసత్వాన్ని కాపాడుతున్నాయని ఆయన తెలిపారు.

English summary
Watch Mega Star Chiranjeevi's grand comeback movie "Khaidi No 150" pre-release function heald at Haailand.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu