»   » కరీనా, అర్జున్ కపూర్ రొమాంటిక్ ట్రైలర్ సూపర్బ్ (వీడియో)

కరీనా, అర్జున్ కపూర్ రొమాంటిక్ ట్రైలర్ సూపర్బ్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

అర్జున్‌కపూర్‌, కరీనాకపూర్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న 'కి అండ్‌ కా' చిత్రానికి సంబంధించి అఫీషియల్ ట్రైలర్ రిలీజైంది. ఆర్‌.బల్కీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రానికి ఇళయరాజా స్వరాల్ని సమకూరుస్తున్నారు. అమితాబ్‌బచ్చన్‌, జయాబచ్చన్‌లు ప్రత్యేక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో తొలిసారిగా అర్జున్‌, కరీనాలు జంటగా నటిస్తున్నారు.

దర్శకుడు బల్కీ తన సినిమాల్లో కుటుంబ బంధాలు, అనుబంధాలను అత్యంత శక్తివంతంగా చూపించగలరు. ఆయన గత చిత్రాల మాదిరిగానే కుటుంబ నేపథ్యంలో 'కి అండ్‌ కా' ప్రత్యేకంగా ఉంటుంది' అని చెబుతోంది కరీనాకపూర్‌. రొమాంటిక్ కామెడీ డ్రామా గా వస్తున్నఈ చిత్రం ఏప్రిల్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Ki And Ka Official Trailer

ఈచిత్రం గురించి కరీనా మాట్లాడుతూ..భారతీయ సమాజంలో పెళ్ళైన భార్యభర్తల మధ్య మగ, ఆడ అనే జెండర్‌ తేడా ఎలాంటి కీలక పాత్ర పోషిస్తుందనే పాయింట్‌తో ఈ చిత్రం రూపొందింది. భావోద్వేగాలకు ప్రతీకగా నిలిచిన ఇటువంటి చిత్రంలో నటించే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. అర్జున్‌ కపూర్‌, అమితాబ్‌, జయాబచ్చన్‌ వంటి వారితో నటించటం మరచిపోలేని అనుభూతినిచ్చింది' అని తెలిపారు.

ట్రైలర్లో రొమాన్స్ బాగా జొప్పించారు. ముఖ్యంగా యువతను ఆకట్టుకునే ముద్దు సీన్లు, పడక గది రొమాంటిక్ సన్నివేశాలు సినిమాలో బోలెడు ఉన్నాయి. నిన్నమొన్నటి వరకు ఈ సినిమా గురించి పెద్దగా ప్రచారం లేదు. ఈ ట్రైలర్ రిలీజైన తర్వాత ‘కి అండ్ కా' హాట్ టాపిక్ అయింది.

English summary
Ki And Ka Official Trailer, starring Kareena Kapoor Khan, Arjun Kapoor.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu