మహేష్ నటిస్తున్న భరత్ అనే నేను చిత్రం ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. భరత్ అనే నేను చిత్ర టీజర్, ఇటీవల విడుదలైన తొలి పాటకు అద్భుతమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 20 న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యేందుకు సిద్ధం అవుతోంది. కాగా ఈ చిత్ర అనుభవాలని హీరోయిన్ కైరా అద్వానీ ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పంచుకుంది.
బాలీవుడ్ సెక్సీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న కైరా అద్వానీ టాలీవుడ్ లో నటిస్తున్న తొలి చిత్రం ఇదే. మహేష్ బాబు సరసన తొలి చిత్రంలో నటించే అవకాశం రావడం తన అదృష్టం అని కైరా చేబుతోంది. సినిమా [ప్రారంభంలో భాష రాక చాలా ఇబ్బంది పడ్డానని, కానీ దర్శకుడు కొరటాల, మహేష్ బాబు సహకారంతో ఆ ఇబ్బందిని అధికమించానని కైరా తెలిపింది. కానీ సినిమాలో ఎమోషన్స్ మాత్రం అద్భుతంగా పండించగలిగానని కైరా చెబుతోంది. మహేష్ బాబు తాను సూపర్ స్టార్ అనే విషయాన్ని పెద్దగా పట్టించుకోవారని కైరా ప్రశంసలు కురిపించింది. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నాడు. కైరా మహేష్ కు పీఏగా నటిస్తోందని వార్తలు వస్తున్నాయి.
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి | Subscribe to Telugu Filmibeat.