»   » ధోని భార్య పాత్రలో ఫగ్లీ హీరోయిన్?

ధోని భార్య పాత్రలో ఫగ్లీ హీరోయిన్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని జీవిత కథతో బాలీవుడ్ దర్శకుడు నీరజ్‌ పాండే ఓ చిత్రాన్ని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ధోని పాత్రలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటిస్తున్నారు. ‘ఎంఎస్ ధోని-ది అన్ టోల్డ్ స్టోరీ' అనేది టైటిల్. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. ఈ చిత్రంలో సుశాంత్ సింగ్ ధోనీ తొలినాళ్లలో లుక్ తలపించేలా జులపాల జుట్టుతో కనిపించబోతున్నాడు. షూటింగుకు ముందు నుండే ధోనీలా క్రికెట్ ఆడటం కూడా ప్రాక్టీస్ చేసాడు. ధోని ఫేవరెట్ షాట్ హెలిక్యాప్టర్ షాట్లు కొట్టడంలో శిక్షణ తీసుకున్నాడట.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ధోని భార్య సాక్షి పాత్రలో బాలీవుడ్ నటి కియర అద్వాని నటించబోతున్నట్లు తెలుస్తోంది. కబీర్ సదానంద్ మూవీ ‘ఫగ్లీ' ద్వారా తెరంగ్రేటం చేసిన కియర అద్వాని సాక్షి పాత్రకు పర్ ఫెక్టుగా సూటవుతుందని దర్శకుడు నీరజ్ పాండే భావిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఆమె ఎంపిక విషయమై అపీషియల్ సమాచారం వెలువడనుంది.

Kiara Advani to play Sakshi in Dhoni's biopic

ఇప్పటికే చిత్రం షూటింగ్ మొదలైనట్లు సమాచారం. వచ్చే ఏడాది నాటికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటు సినీ ప్రియులతో పాటు, అటు క్రికెట్ అభిమానులు కూడా ఈ చిత్రంపై ఆసక్తి చూపుతారు కాబట్టి మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నారు. ఇటీవల క్రీడాకారుల జీవితాలపై తీసిన....‘భాగ్ మిల్ఖా భాగ్', ‘మేరీ కోమ్' లాంటి చిత్రాలకు మంచి ఆదరణ లభించింది. దేశంలో క్రికెట్ ను అభిమానించే వారి సంఖ్యే ఎక్కువ కాబట్టి ఈ చిత్రానికి భారీ స్పందన వస్తుందని ఆశిస్తున్నారు.

English summary
According to reports, Neeraj has finalized the young and vivacious Kiara Advani opposite Sushant Singh Rajput in "MS Dhoni: The Untold Story".
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu