»   » ఔను..! వాళ్ళు మళ్ళీ ఇష్టపడ్డారు.... విడాకులు క్యాన్సిల్ చేసుకుంటున్నారట

ఔను..! వాళ్ళు మళ్ళీ ఇష్టపడ్డారు.... విడాకులు క్యాన్సిల్ చేసుకుంటున్నారట

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈగ, బాహుబలి చిత్రాల ద్వారా తెలుగు తెరకు సుపరిచితమైన ప్రముఖ కన్నడ నటుడు కిచ్చ సుదీప్‌ కుటుంబ కలహాలు పరిష్కరించుకుని భార్య ప్రియా రాధాకృష్ణన్‌ తో కలిసి ఉండాలని నిశ్చయించుకున్నారు. కుటుంబ కలహాలతో కోర్టు మెట్లు ఎక్కిన సుదీప్‌, ప్రియ ఇద్దరూ తమ విభేదాలు మరచిపోయి కలిసుండాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో రెండు కుటుంబాల మధ్య హర్షం వ్యక్తం అవుతోంది. మరోవైపు ఈ విషయంలో సుదీప్‌ అభిమానుల్లో సంతోషం నెలకొంది. సుదీప్‌...భార్య ప్రియతో విడాకులు కావాలంటూ కోర్టులో కేసు వేసినప్పటి నుంచి అతడు న్యాయస్థానానికి హాజరు కాలేదు.

గతంలో కూడా రెండు నెలల సమయం కావాలని కోర్టుకు సుదీప్‌ తరపు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీంతో కేసు విచారణను న్యాయస్థానం మార్చి 9వ తేదీకి వాయిదా వేసింది. ,కాగా సుదీప్‌, ప్రియ 2001లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి ఓ పాప కూడా ఉంది. అయితే వ్యక్తిగత కారణాలరీత్యా విడిపోయేందుకు వీరిద్దరూ న్యాయస్థానం ఆశ్రయించారు. అంతేకాకుండా భార్యకు పెద్ద ఎత్తున భరణం ఇచ్చేందుకు కూడా సుదీప్‌ సిద్ధపడ్డాడు. అయితే ఈ నేపథ్యంలో సుదీప్‌, ప్రియ కలిసి ఉండాలని నిర్ణయం తీసుకోవడం విశేషం.

 ప్రియ రాధాకృష్ణన్:

ప్రియ రాధాకృష్ణన్:

15 ఏళ్ల కిందట బెంగుళూరులో ప్రియ రాధాకృష్ణన్ చదువుకుంటున్నప్పుడే వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం మొదలై ఆ తరువాత కొంత కాలం సహజీవనం చేసి పెళ్ళి చేసుకున్నారు. ఈమె కొంతకాలం ఒక ఎయిర్‌లైన్స్‌లో ఆమె ఉద్యోగం కూడ చేసింది. 2001లోవీరిద్దరి పెళ్ళి జరిగిన తరువాత చాలాకాలం వీరిద్దరూ అన్యోన్యంగా కన్నడ మీడియాకు కనపడుతూ వచ్చారు.

హాట్ టాపిక్ :

హాట్ టాపిక్ :

వీళ్లకి 11 ఏళ్ల శాన్వి అనే అమ్మాయి కూడా వుంది. అయితే ఇంత సుధీర్ఘ 14 ఏళ్ల వైవాహిక జీవితం తరువాత వీరిద్దరి మధ్య ఏ మైందో తెలియదు కాని ప్రస్తుతం వీరిద్దరూ విడిపోవాలని నిశ్చయించు కోవడం కన్నడ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. కొద్ది కాలం క్రితం సుదీప్ ప్రోత్సాహంతో ఈమె ఒక ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీని కూడ స్థాపించిన తరువాత

పాపులర్ యాక్టర్ :

పాపులర్ యాక్టర్ :

ఇలా వీరిద్దరూ విడిపోవడం దక్షిణాది సినిమా రంగానికి హాట్ న్యూస్ గా మారింది. కేవలం కన్నడ సినిమా రంగంలోనే కాకుండా సుదీప్ కోలీవుడ్ టాలీవుడ్ రంగాలలో కూడ పాపులర్ యాక్టర్ గా పేరుగాంచిన నేపధ్యంలో వీరి విడాకుల వ్యవహారం మీడియాకు హాట్ టాపిక్ గా మారింది..

విడిపోవడానికి సిద్దంగా:

విడిపోవడానికి సిద్దంగా:

ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు రావడంతోనే ఇద్దరు గత కొంత కాలంగా వేరు వేరుగా ఉంటున్న తరుణంలో.. ఈ జంట శుక్రవారం కోర్టులో విడాకులకు ఎప్లయ్ చేశారు. కారణంగా చెప్పకుండా విడిపోవడానికి సిద్దంగా ఉన్నాం అని కోర్టుకు తెలిపారు వీరు. అయితే ఈ విడాకులకు సుదీప్ కోట్లలో భరణం చెల్లించటానికీ సిద్ద పడ్దాడు అంటూ వార్తలు వచ్చాయి.

కోట్లలో భరణం :

కోట్లలో భరణం :

దాదాపు 19 కోట్ల సొమ్ముని ప్రియకు చెల్లించటానికి రేడీ అయ్యాడు సుదీప్. అలాగే వారి 11 ఏళ్ళ కూతురు రక్షణ బాధ్యతను కూడా భార్య ప్రియకే అప్పగించనున్నాడని కూదా అనుకుఇనారు.. డైవర్స్ పిటీషన్ లో ఇష్టపూర్వకంగానే విడిపోతున్నట్లు కూడా తెలిపారు. కోర్టు విడాకులు ఇవ్వడమే తరువాయి.

కేరళకు చెందిన ప్రియా:

కేరళకు చెందిన ప్రియా:

సుదీప్ ఆయన భార్య ప్రియా విడాకులకు అప్లై చేసుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. కేరళకు చెందిన ప్రియాను పద్నాలుగేళ్ల కిందట ప్రేమించి, పెద్దల్ని ఒప్పించి పెళ్లిచేసుకున్నాడు. 2001 లో వీరి వివాహం జరిగింది. గత ఏడాది స్టేజ్ 360 పేరుతో ప్రియ కోసం ఓ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ కూడా తెరిచాడు.

అనుమానించడమే కారణం:

అనుమానించడమే కారణం:

గత రెండేళ్ల నుంచి గొడవలు జరుగుతున్నాయని సన్నిహితులు అంటున్నారు. దీనికి కారణం ప్రియ సుదీప్ ని అనుమానించడమే కారణం అంటున్నారు. సుదీప్ సినీ సెలబ్రిటీ కావడంతో ఫొటోలు దిగే అమ్మాయిలు,మీడియాలో వచ్చే గాసిప్స్‌కు వెంటనే రియాక్ట్‌ అవుతుందట.

మీడియా కూడా:

మీడియా కూడా:

మీడియా కూడా ఓ రకంగా వీరిద్దరినీ విడిపోయేలా చేసిందట. వీరిద్దరి మధ్య గొడవలు చివరకు వాళ్ళ 14 ఏళ్ళ బంధాన్ని తెంపుకొనేలా చేసాయి. వీరి పాప శాన్వీ 11 ఏళ్ల మైనర్ కాబట్టి తల్లికి అప్పగించేందుకు కోర్టు అంగీకరించింది. అయితే ఈ నేపథ్యంలో సుదీప్‌, ప్రియ కలిసి ఉండాలని నిర్ణయం తీసుకోవడం విశేషం. ఇది సుదీప్ అభిమానులకు కూడా ఆనందం కలిగించే వార్తే...

సెన్సేషన్:

సెన్సేషన్:

హృతిక్ రోషన్ - ప్రకాష్ రాజ్ - పవన్ - ప్రభుదేవా వంటి స్టార్లు ఇప్పటికే భార్యలకు విడాకులిచ్చారు. అప్పట్లో ఆ వార్తలన్నీ సెన్సేషన్ అయ్యాయి. ఆ స్థాయిలో కన్నడ హీరో సుదీప్ విడాకుల కూడా శాండాల్ వుడ్ లో సెన్సేషన్ అయ్యింది. సుదీప్ అభిమానులు కొంత కాలంగా ఈ విషయమై తర్జనభర్జనలో ఉన్నారు.

English summary
Kiccha Sudeep and his wife Priya Radhakrishnan seem to have patched up, and their relationship is returning to normalcy. The couple had approached a family court, seeking divorce last December.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu