»   »  రవితేజతో ‘కిక్-2’...నిర్మించేది నందమూరి హీరో!

రవితేజతో ‘కిక్-2’...నిర్మించేది నందమూరి హీరో!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన 'రేసు గుర్రం' చిత్రం ఈ రోజు విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. కాగా...సురేందర్ రెడ్డి తన తర్వాతి ప్రాజెక్టును కూడా ప్రకటించాడు. గతంలో రవితేజ హీరోగా 'కిక్' చిత్రం తెరకెక్కించి భారీ హిట్ కొట్టిన సురేందర్ రెడ్డి, దీనికి సీక్వెల్‌గా 'కిక్-2' చిత్రం చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు.

ఈ సినిమా ప్రాజెక్టు గురించి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ....'రవితేజతో 'కిక్ 2' చిత్రం ప్లాన్ చేస్తున్నాను. ప్రస్తుతం రవితేజ 'పవర్' షూటింగులో బిజీగా ఉన్నారు. ఆ సినిమా పూర్తి కాగానే 'కిక్-2' చిత్రం మొదలు పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నాం. ఈ చిత్రాన్ని నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నిర్మించబోతున్నట్లు సురేందర్ రెడ్డి వెల్లడించారు.

 'Kick 2' to go on floors soon

సీక్వెల్‌లో కేవలం రవితేజ మాత్రం కంటిన్యూ అవుతాడు, మిగతా పాత్రలు, పాత్రధారుల విషయంలో మార్పులు చేర్పులు చేయబోతున్నామని సురేందర్ రెడ్డి తెలిపారు. 'కిక్' మూవీ అప్పట్లో భారీ విజయం సాధించిన నేపథ్యంలో....అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా కిక్-2 చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'రేసు గుర్రం' చిత్రం వివరాల్లోకి వెళితే...ఈ రోజు గ్రాండ్‌గా అత్యధిక థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మార్నింగ్ షో నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టెనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం జనాలకు బాగా నచ్చిందనే టాక్ వినిపిస్తోంది. ఈచిత్రం అల్లు అర్జున్ సరసన శృతి హాసన్ హీరోయిన్.

English summary
Director Surendar Reddy, who is currently awaiting the release of Telugu actioner "Race Gurram", says the sequel to his Telugu blockbuster "Kick" will go on floors as soon as actor Ravi Teja completes working on his current project "Power".
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu