For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  2013 'కింగ్ ఫిషర్' బికినీ భామలు (ఫోటో ఫీచర్)

  By Srikanya
  |

  ముంబై: కింగ్ ఫిషర్ క్యాలెండర్ అంటే అందరికీ ఆసక్తే. దానికి కారణం అందులో అందాలు స్వేచ్చగా ఆరబోసే బికినీ భామలు ఉండటమే. ప్రతి సంవత్సరం బికినీ భామల కేలండర్ రూపొందించడం విజయ్ మాల్యా స్పెషాలిటీ. పదేళ్లకు పైగానే ఈ పద్దతి కంటిన్యూగా సాగుతూ అభిమానులను అలరిస్తోంది.

  ఈ క్యాలెండర్ కోసం కోట్ల రూపాయలు ప్రతీ సంవత్సరం ఖర్చు పెడతారు. విస్తృతంగా ప్రచారం జరుగుతుందనే ఈ క్యాలెండర్ కి ప్రయారిటీ ఇస్తారు. ప్లే బోయ్ గా ఈ క్యాలెండరే విజయ మాల్యాని ఇప్పటికీ ఓ వర్గంలో నిలబెడుతోంది. ఎందుకంటే ఈ క్యాలెండర్ లో ఆయన ఈ బికిని భామలతో కలిసి ఫోజులిస్తూంటారు.

  ఇక ఈ కింగ్ ఫిషర్ క్యాలెండర్ లో కనిపించటం ముద్దుగుమ్మలు ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. ఎందుకంటే... ఈ క్యాలెండర్ లో కనిపించిన భామలకు సినీ,మోడలింగ్ ఫీల్డ్లలో మంచి ఆఫర్స్ వస్తూంటాయి. సినీ, దర్శక, నిర్మాతలు ఈ క్యాలెండర్ లో ఎంపికైన వారి గురించి ఎంక్వైరీ చేస్తూంటారు. కత్రినా కైఫ్, దీపికా, యానగుప్తా, ఉజ్వల రౌత్, నర్గీస్ ఫాఖ్రి, లిసాహేడెన్, ఏంజెలా జాన్సన్ వంటి మోడల్స్, బాలీవుడ్ నటీమణులు ఈ క్యాలెండర్ ఎక్కిన వారే. ఈ సంవత్సరం ఫిల్టర్ చేసి ఎంపిక చేసిన పన్నెండు మంది భామలు వీరే...

  కింగ్ ఫిషర్ కేలండర్ 2013 అందాల భామలను విజయ్ మాల్యా కుమారుడు సిద్దార్థ మాల్యా ఎంపిక చేశారు.

  కింగ్ ఫిషర్ క్యాలెండర్ ను కింగ్ ఫిషర్ బికిని క్యాలెండర్ అని కూడా అంటారు. 2003వ సంవత్సరం నుండి భారతదేశానికి సంబంధించిన యునైటెడ్ బ్రూవరీస్ గ్రూప్ వారు ఈ క్యాలెండరును ప్రచురిస్తున్నారు. ఈ క్యాలెండర్ లో ఈత దుస్తులు ధరించిన మోడల్స్ ఫోటోలు ఉంటాయి.

  పిరెల్లి క్యాలెండర్ ప్రేరణతో ఈ కింగ్ ఫిషర్ క్యాలెండర్ ఏర్పడింది. మంచి కెరీర్ ఉన్న మోడల్స్ మరియు నటీమణులు పాల్గొనడం వలన ఈ క్యాలెండర్ ఘనత పెరిగింది.

  ఫోటోగ్రాఫర్ అతుల్ కాస్బీకర్ కు ఈ క్యాలెండర్ తో అనుబంధముంది. కాస్బీకర్ విజయ్ మాల్యాలు కలిసి ఘనత వహించిన ఈ వార్షిక కింగ్ ఫిషర్ క్యాలెండర్ ను సృష్టించారు.

  2013 ఏడాది కేలండర్ భామల ఎంపిక కోసం ఎన్ డిటీవీ గుడ్ టైమ్స్ చానల్ లో నిర్వహించిన ‘హంట్ ఫర్ ది కింగ్ ఫిషర్ క్యాలెండర్ గర్ల్స్ కార్యక్రమంలో సిద్దార్థ మాల్యా న్యాయనిర్ణేతగా వ్యవహరించారు.

  సిద్దార్థ మాల్యాతో పాటు ప్రముఖ మోడల్ లిసా హేడన్, ప్రసిద్ధ ఫోటోగ్రాఫర్ అతుల్ కస్బేకర్ లు కూడా పాల్గొన్నారు.

  గోవా బీచ్ లో అందాల బామల హాట్ హాట్ ఫోజులు 12మంది భామల ఎంపిక కోసం పోటీ, స్టార్ హోటళ్లలో హంగామా. బికినీ దుస్తుల్లో అందగత్తెల ఒంపుసొంపులు, గిలిగింతలు పెట్టే ఫోజులు వారికి రకరకాల పోటీలు ప్రదర్శించారు.

  వారి భంగిమలను కెమెరాలలో బంధించడం ఫోటోగ్రాఫర్లకు ఒక ఛాలెంజ్. భామల అందచందాలు, హావభావాలు, బికినీ దుస్తుల్లో వారి ఒంపుసొంపులు సొగసులు ఆధారంగా మార్కుల వేస్తారు.

  అనేక పరీక్షలు నిర్వహించిన తర్వాత 12మంది సుందరాంగులను ఎంపిక చేశారు. వారి ఫోటోలతోనే ఈ కొత్త సవంత్సరం క్యాలెండర్ ముస్తాబవుతోంది.

  ఈ ఏడాదికి అనఘా సహమాతే, ఇషితా వ్యాస్, ఏశ్రా పటేల్, కాంచన్ టోమర్, నవీనా పెజటోనిక్, నిఖితాషా మార్వా, నిబేదిత కర్మాకర్, రునా లాహ, సుష్మిత సింఘా, రుపాలి జంబూల్కర్, రెబెకా, లిన్ లైశ్రామ్లు ఎంపికయ్యారు. వారి ఫొటోలతో కొత్త సంవత్సరం క్యాలెండర్‌ ముస్తాబవుతుంది.

  అవకాశాలు అందిపుచ్చుకోవడానికి వారికి ఇది ఒక వేదిక. తాజాగా 2013 కింగ్ ఫిషర్ క్యాలెండర్ కోసం కూడా అందమైన అమ్మాయిలు భారీగానే సిద్ధమయ్యారు.

  విజయ్ మాల్యా యాజమాన్యంలోని యునైటెడ్ బ్రూవరీస్ గ్రూప్ 2003 నుండి ఈ క్యాలెండరును ప్రచురిస్తోంది. దాదాపు రెండు వందల మంది నుంచి వివిధ పరీక్షల ద్వారా 12 మందిని ఎంపిక చేస్తారు.

  English summary
  The most eagerly awaited event of the year has taken place. We seem to have found the Kingfisher calendar girls for 2013. Every year, the Kingfisher calendar model hunt is conducted in October-November.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X