»   » ‘కిర్రాక్ పార్టీ’ టీజర్: నిఖిల్ కెరీర్లో మరో భారీ హిట్టయ్యేలా ఉందే...

‘కిర్రాక్ పార్టీ’ టీజర్: నిఖిల్ కెరీర్లో మరో భారీ హిట్టయ్యేలా ఉందే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

విభిన్నమైన కథలను ఎంపిక చేసుకొని వరుస విజయాలతో దూసుకెళుతున్న హీరో నిఖిల్ సిద్దార్థ్ తాజాగా ఎ టివి సమర్పణలో ఎ కె ఎంటర్టైన్మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్మించు కిర్రాక్ పార్టీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని రామ బ్రాహ్మమ్ సుంకర నిర్మిస్తుండగా, శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలైంది. కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ అయినప 'కిరిక్ పార్టీ' చిత్రానికి ఇది రీమేక్.

తేజ అతిథిగా టీజర్ రిలీజ్

తేజ అతిథిగా టీజర్ రిలీజ్

‘కిర్రాక్ పార్టీ' చిత్రం లో నిఖిల్ కు జంటగా సిమ్రాన్ పరీన్జా, సంయుక్త హెగ్డే నటిస్తున్నారు ఈ సినిమా టీజింగ్ ట్రైలర్ ను బుధవారం సాయంత్రం ప్రసాద్ ల్యాబ్ లో దర్శకుడు తేజ అతిథిగా విచ్చేసి విడుదల చేశారు.

మళ్లీ.. మళ్లీ చూడాలనిపించేలా టీజర్

మళ్లీ.. మళ్లీ చూడాలనిపించేలా టీజర్

ఈ సందర్భంగా తేజ మాట్లాడుతూ టీజర్ మళ్లీ.. మళ్లీ చూసేలా అనిపిస్తోంది. నిఖిల్ కు స్నేహితులుగా నటించిన వారందరూ చాలా న్యాచురల్‌గా ఫ్రెష్‌గా ఉన్నారు. తప్పకుండా సినిమా బాగుంటుందనీ ఆశిస్తూ చిత్ర టీంకు శుభాకాంక్షలు తెలియచేస్తున్నా అన్నారు.

కాలేజ్ డ్రాప్ లో వచ్చిన సినిమాల్లోనే బెస్ట్ ఫిల్మ్

కాలేజ్ డ్రాప్ లో వచ్చిన సినిమాల్లోనే బెస్ట్ ఫిల్మ్

నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ... టీం అంతా చాలా అనుభవం ఉన్నవాళ్ళలా చేశారు. చాలా బాగొచ్చింది, కాలేజ్ డ్రాప్ లో వచ్చిన సినిమాల్లోనే బెస్ట్ ఫిల్మ్ గా నిలుస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను అన్నారు.

హ్యాపీ డేస్ ఫీలింగ్ వచ్చింది: నిఖిల్

హ్యాపీ డేస్ ఫీలింగ్ వచ్చింది: నిఖిల్

హీరో నిఖిల్ మాట్లాడుతూ ‘ఈ చిత్రం లో నేను లీడర్ అయినా మా లీడర్ మాత్రం నిర్మాత అనిల్ సుకర గారే, హ్యాపీ డేస్ సినిమాతో ఇలానే కొత్తవారితో కలసి పనిచేశాను. అదే ఫీల్ ఇప్పుడు ఈ కిర్రాక్ పార్టీ చిత్రం‌తో కలుగుతోంది. సినిమా షూటింగ్ పూర్తి అయ్యేటప్పుడు మేము అంతా ఏడ్చేశాము. చాలా చాలా ప్రత్యేకమైన సినిమా నాకు, తప్పకుండా అందరికీ నచ్చే సినిమా అవుతుంది' అన్నారు.

ఆ ఫ్లేవర్ పోకుండా

ఆ ఫ్లేవర్ పోకుండా

దర్శకుడు శరన్ మాట్లాడుతూ కన్నడలో బిగ్గెస్ట్ ఫిల్మ్ కిర్రిక్ పార్టీ... ఆ ఫ్లేవర్ పోకుండా తెలుగు నేటివిటీ కి తగ్గట్టు చిత్రీ కరించాము.. అవకాశం ఇచ్చిన నిఖిల్ కు, నిర్మాతలకు నా కృతఙ్ఞతలు అని అన్నారు.

టైలర్ అదిరింది

నిఖిల్, సిమ్రాన్ పర్జీనా, సంయుక్త హెగ్డే, బ్రహజీ, సిజ్జు, రఘు కారుమంచి, షియాజి షిండే తదితరులు ప్రధాన పాత్ర దారులుగా నటిస్తున్న ఈ చిత్రానికి కో-ప్రొడ్యూసర్స్: అజయ్ సుంకర, అభిషేక్ అగర్వాల్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికపాటి, స్క్రీన్ ప్లే: సుధీర్ వర్మ, డైలాగ్స్: చందూ మొండేటి, సినిమాటోగ్రఫీ: అద్వైత గురుమూర్తి, సంగీతం: అంజనీష్ లోకనాథ్, ఎడిటర్: ఎమ్. ఆర్ వర్మ, ఆర్ట్ డైరెక్టర్: అవినాష్ లోకేష్, కో డైరెక్టర్: ప్రసాద్ దాసం, ఫైట్స్: వెంకట్, కొరియోగ్రఫీ: అని, విజయ్, అవినాష్.

English summary
Kirrak Party Teasing Trailer released. Kirrakparty Movie Directed by Sharan Koppisetty, Music by Ajaneesh Lokanath, Produced by Ramabrahmam Sunkara, Dialogues by Chandoo Mondeti, Screenplay by Sudheer Varma Starring Nikhil, Samyuktha, Simran Pareenja.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu