twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫిలాసఫీ కాదు..సెంటిమెంట్ కాదు.. ‘ఉన్నది ఒకటే జిందగీ’ ఓ జీవితం..

    హైపర్ స్టార్ రామ్ నటించిన నేను శైలజ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నది. ఆ చిత్రంలోని పాటలు, సన్నివేశాలు ఆడియెన్స్‌ను టచ్ చేశాయి. ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన కిశోర్ తిరుమల మళ్లీ రామ్‌తోన

    By Rajababu
    |

    హైపర్ స్టార్ రామ్ నటించిన నేను శైలజ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నది. ఆ చిత్రంలోని పాటలు, సన్నివేశాలు ఆడియెన్స్‌ను టచ్ చేశాయి. ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన కిశోర్ తిరుమల మళ్లీ రామ్‌తోనే జతకట్టాడు. ఈ సారి రామ్‌తో ఉన్నది ఒకటే జిందగీ అని అంటున్నాడు. మనిషికి ఉన్న ఒక్క జీవితంలో దర్శకుడు కిషోర్ తెరపైన ఆవిష్కరించినదేమిటో తెలుసుకోవడానికి తెలుగు ఫిల్మీబీట్ ప్రయత్నం చేసింది. ఉన్నది ఒకటే జిందగీ చిత్రం అక్టోబర్ 27న విడుదల అవుతున్న నేపథ్యంలో కిషోర్ తిరుమల ప్రత్యేకంగా పంచుకున్న భావాలు ఆయన మాటల్లోనే.

    స్నేహం, ప్రేమ అంశాలతో

    స్నేహం, ప్రేమ అంశాలతో

    ఉన్నది ఒకటే జిందగీలో ఎలాంటి ఫిలాసఫీని చెప్పాలనే ప్రయత్నం చేయలేదు. స్నేహం, ప్రేమ అనే అంశాలతో అల్లుకొన్న కథ ఇది. బాల్యం, యవ్వనం దశల మధ్య సాగే జీవిత ప్రయాణం. ఈ చిత్ర కథ ప్రతీ ఒక్కరి హృదయాలకు దగ్గరగా ఉంటుంది. ఈ చిత్రంలో అన్నీ పాజిటివ్ అంశాలే ఉంటాయి. నిజమైన స్నేహానికి అద్దంపట్టేలా ఈ సినిమా ఉంటుంది.

    పరిణతి చెందిన పాత్రలో రామ్

    పరిణతి చెందిన పాత్రలో రామ్

    ఉన్నది ఒకటే జిందగీలో ఎలాంటి పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో తెలిసిన యువకుడి పాత్రలో రామ్ నటిస్తున్నాడు. ఐదుగురు స్నేహితుల మధ్య కథ నడుస్తుంది. మ్యూజిక్ బ్యాండ్ నడిపే యువకుడి పాత్రను రామ్ పోషించాడు. జీవితంలో ఎదురయ్యే సంఘర్షణ, భావోద్వేగాలను ఎలా పరిష్కరించారనే పాయింట్‌తో కథ సాగుతుంది.

    బలమైన వ్యక్తిత్వం ఉన్న..

    బలమైన వ్యక్తిత్వం ఉన్న..

    స్నేహానికి ప్రాణమిచ్చే వ్యక్తి అయినప్పటికీ.. కథ పరంగా కొన్ని నిర్ణయాలు తీసుకొనే విషయంలో బలమైన కారణాలు ఉంటాయి. ఒక సమస్య వచ్చినప్పుడు దానిని కేవలం మన వైపు నుంచే కాకుండా ఇతరుల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే సమస్యలు పరిష్కారమవుతాయనే సిద్ధాంతాన్ని నమ్మిన యువకుడిగా రామ్ పాత్ర ఉంటుంది.

    చైల్డ్ ఎపిసోడ్ సెంటిమెంట్ కాదు..

    చైల్డ్ ఎపిసోడ్ సెంటిమెంట్ కాదు..

    నేను శైలజ చిత్రంలో బాల్యానికి సంబంధించిన కథ ఉంటుంది. ఈ చిత్రంలో కూడా అలాంటి ఎపిసోడ్ ఉంటుంది. అది సెంటిమెంట్‌గా పెట్టుకొన్నది కాదు. బాల్యంలో జరిగే సంఘటనలు ఓ వ్యక్తి మీద జీవితాంతం ప్రభావం చూపుతాయి. కథ తగినట్టుగానే సినిమాలో బాల్యానికి సంబంధించిన ఎపిసోడ్ పెట్టడం జరిగింది.

    అనుపమకు మంచి పేరు వస్తుంది..

    అనుపమకు మంచి పేరు వస్తుంది..

    ఉన్నది ఒకటే జిందగీ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌లో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ చెప్పిన డైలాగ్స్‌కు మంచి స్పందన వస్తున్నది. పక్కింట్లో లేదా మన వీధిలో ఉండే అమ్మాయి పాత్రను ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ పోషించింది. ప్రతి ఒక్కరు అలాంటి అమ్మాయి జీవితభాగస్వామిగా వస్తే బాగుంటుందని కోరుకుంటారు. ఈ సినిమాలో నటించిన పాత్రకు అనుపమకు మంచి పేరు వస్తుంది అనుకుంటున్నాను.

    రామ్ స్నేహితుడిగా శ్రీ విష్ణు

    రామ్ స్నేహితుడిగా శ్రీ విష్ణు

    ఉన్నది ఒకటే జిందగీ చిత్రంలో రామ్‌కు శ్రీ విష్ణు ఫ్రెండ్ పాత్రను పోషించాడు. ఈ సినిమాలో శ్రీ విష్ణు పాత్ర పేరు వాసు. శ్రీ విష్ణుతో నాకు నాలుగేళ్లుగా పరిచయం వుంది. కథ చెప్పగానే నా మీద విశ్వాసంతో ఆ పాత్రలో నటించడానికి ఒప్పుకొన్నాడు.

    దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అదుర్స్

    దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అదుర్స్

    నేను శైలజ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ సినిమాకు సంబంధించి స్టోరీ పరంగా ఈ సినిమాకు కూడా దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తే బాగుంటుంది అనుకొన్నాం. అలాగే దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన పాటలు ప్రేక్షకులను ఇప్పటికే ఆకట్టుకున్నాయి

    విక్టరీ వెంకటేశ్‌‌తో సినిమా

    విక్టరీ వెంకటేశ్‌‌తో సినిమా

    విక్టరీ వెంకటేశ్‌కు కథ చెప్పాను. వెంకీతో సినిమా వుంటుంది. ప్రస్తుతం కథకు మెరుగులు దిద్దే ప్రయత్నంలో ఉన్నాం. త్వరలోనే ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. నానికి ఓ కథ చెప్పాను. ఆ సినిమాకు సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడిస్తాను. మిగితా ప్రాజక్టుల గురించి ఏమీ అనుకోలేదు.

    English summary
    Vunnadhi Okate Zindagi is an upcoming 2017 Telugu drama film starring Ram Pothineni, Anupama Parameswaran and Lavanya Tripathi in the lead roles.The film is written and directed by Kishore Tirumala. The film is produced by Sravanthi Ravi Kishore and Krishna Chaitanya under Sravanthi Cinematics and PR Cinemas. The music is composed by Devi Sri Prasad, while Sameer Reddy is the cinematographer. This movie is slated to release on October 27th. In this occasion, Director Kishore Tirumala speaks to Telugu Filmibeat exclusively.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X