కొడుకా అంటూ పోలెండ్ కుర్రాడు దుమ్మురేపాడు.. పవన్‌కు గిఫ్ట్‌గా పాట..
అజ్ఞాతవాసి చిత్రం కోసం పవన్ కల్యాణ్ పాడిన పాట య్యూటూబ్‌లో ట్రెండింగ్‌గా నిలువడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలుగువారిని, పవర్ స్టార్ అభిమానులను ఆకట్టుకొన్నది. తెలుగు వారిని, దేశవ్యాప్తంగా ఉన్న పవన్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకోవడంలో వింతేమీ లేదు. కానీ పవన్ పాడిన కోటేశ్వరరావు పాట విదేశీయులను కూడా ఆకర్షించడం చర్చనీయాంశమైంది.
Recommended Video


పోలెండ్ జేబిగ్స్ నోట
అజ్ఞాతవాసి చిత్రంలోని కొడుకా పాట పోలెండ్‌కు చెందిన జెబిగ్స్ అనే కుర్రాడిని విశేషంగా ఆకర్షించింది. ఇంకేముంది.. ఆ పాటను కంఠస్తం చేసి తెలుగులో చక్కగా పాడాడు.

పవన్ నాకు 2018 గిఫ్ట్
కొడకా పాట పాడటానికి ముందు ‘హాయ్ పవర్‌స్టార్. నీవు పాడిన కొడుకా పాట చాలా ఎలెక్ట్రీఫైయింగ్ ఉంది. నేను పాట పాడి నీకు 2018 సంవత్సరపు కానుకగా ఇస్తున్నాను అని బుల్లిబుల్లిమాటలతో హుషారుగా చెబుతూ వీడియోగా రూపొందించాడు.

లయబద్దంగా కుర్రాడి పాట
కొడుకా కోటేశ్వరావు అని ఖర్సైపోతావు. పులసలాగా ఎగిరిపడితే పులుసైపోతావు అంటూ లయబద్దంగా ఎమోషన్స్ పలికించడం ఆ పిల్లాడికి ఆ పాట అంటే ఎంత ఇష్టపడ్డాడో తెలియకనే తెలియజెప్పింది.

ముచ్చటపడే విధంగా
ఓ నీచ నికృష్ణ కోటేశ్వరరావు.. నీ దరిద్రం చెప్పడానికి నా వద్ద డైలాగ్స్ లేవురా అంటూ పాటను ముగించడం నెటిజన్లు, పవన్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకొంటున్నది. ఆ పాటను ఎలా పాడాడో మీరు చూసి ముచ్చటపడండి..
కొడుకా పాట సెన్సేషన్
అజ్ఞాతవాసి చిత్రంలో పాడిన కొడుకా కోటేశ్వరరావు పాట యూట్యూబ్‌లో సంచలనం రేపుతున్నది. సుమారు రెండు రోజుల్లో 6,413,995 వ్యూస్ వచ్చాయి. అలాగే 305,880 మంది లైక్ చేయగా, 21,019 మంది డిస్‌లైక్స్ వచ్చాయి


Click it and Unblock the Notifications











