twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Pawan kalyan మీద కొడాలి సంచలనం.. చిరంజీవిని పవన్ అవమానించచ్చా?.. సీఎం కూడా అంతే అంటూ!

    |

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన భీమ్లా నాయక్ సినిమా ఫిబ్రవరి 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే అయితే ఈ సినిమా అన్ని చోట్ల రికార్డు స్థాయి కలెక్షన్లు సాధిస్తోంది కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం సినిమా మీద కక్ష సాధింపు ధోరణితో ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో అధికార వైసీపీకి చెందిన మంత్రులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ముందు పేర్ని నాని ఈ విషయం మీద ప్రెస్ మీట్ ఏర్పాటు చేయగా ఇప్పుడు కొడాలి నాని ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తమను తాము డిఫెండ్ చేసుకునే పనిలో పడ్డారు. ఆ వివరాల్లోకి వెళితే

    టైటిల్ పాత్రలో

    టైటిల్ పాత్రలో

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం భీమ్లా నాయక్. మరో ప్రధాన పాత్రలో దగ్గుబాటి రానా నటించగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్, రానా సరసన సంయుక్త మీనన్ ఈ సినిమాలో నటించారు. వీరు కాకుండా రావు రమేష్, సముద్రఖని, మురళి శర్మ, రఘు బాబు, రవి వర్మ లాంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించారు.

    ఇక ఈ సినిమాకు సాగర్ చంద్ర దర్శకత్వం వహించగా తమ అద్భుతమైన బాణీలు అందించడమే కాక సినిమా మొత్తానికి హైలెట్ అయ్యే విధంగా థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అందించారు. ఇక త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందించడమే కాక డైలాగ్స్ కూడా అందించారు.

    హౌస్ ఫుల్ కలెక్షన్లతో

    హౌస్ ఫుల్ కలెక్షన్లతో

    ఫిబ్రవరి 25వ తేదీన విడుదలైన ఈ భీమ్లా నాయక్ సినిమా విడుదలైన అన్ని చోట్ల హౌస్ ఫుల్ కలెక్షన్లతో నడుస్తోంది. రెండో రోజు కూడా దాదాపు అలాగే జోరు చూపిస్తూ వచ్చింది. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం సినిమా ధియేటర్ల వద్ద రెవెన్యూ సిబ్బంది పూర్తిస్థాయిలో డ్యూటీలు చేస్తూ ఎక్కడ టికెట్ రేట్లు పెంచి అమ్ముతారు ఏ థియేటర్ మూసేద్దామా? అనే విధంగా ప్రవర్తించటమే కాక కొన్ని చోట్ల సీఆర్పీఎఫ్ బలగాలను కూడా దించడం అనేది చర్చనీయాంశంగా మారింది.

    ఈ విషయం మీద ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద విరుచుకు పడుతోంది. అలాగే జనసేనకు సంబంధించిన కొంత మంది కూడా నాయకుడు సినిమాను కావాలని టార్గెట్ చేస్తున్నారు అంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ మంత్రులు ఒక్కరొక్కరుగా తెర మీదకు వచ్చి తాము ఏమీ తప్పు చేయడం లేదు అని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

    రిలీజ్ చేసుకోండి అని చెప్పలేదు

    రిలీజ్ చేసుకోండి అని చెప్పలేదు

    ఇందులో భాగంగా తాజాగా కొడాలి నాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా గురించి వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి శత్రువులు, మిత్రులు గురించి ఆలోచించరని,
    ప్రజల గురించే ఆలోచిస్తారని కొడాలి నాని పేర్కొన్నారు. సినిమా పరిశ్రమలో సమస్యలకు చంద్రబాబే కారణం అని కొడాలి నాని ఆరోపించారు. కోర్టుకు వెళ్ళి అడ్డగోలుగా ఆదేశాలు తెచ్చుకుని ప్రజలను దోచుకున్నా చంద్రబాబు గుడ్డివాడుగా వ్యవహరించాడు అని ఆయన విమర్శించారు.

    భీమ్లా నాయక్ కు జగన్ తొక్కేశారు అనే కలరింగ్ ఇచ్చే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఫిబ్రవరి 25న జీవో ఇస్తున్నాం... సినిమా రిలీజ్ చేసుకోండి అని ప్రభుత్వం గానీ, వైసీపీ గానీ చెప్పలేదని ఆయన పేర్కొన్నారు. న్యాయ పరమైన అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం చూస్తోందని, ఈ లోపు మా మంత్రి చనిపోవడంతో నాలుగు రోజులు ఆలస్యం అయ్యిందని అన్నారు.

    సిగ్గు చేటు

    సిగ్గు చేటు

    తల్లి లాంటి సినిమా పరిశ్రమను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం సిగ్గు చేటు అని మంత్రి కొడాలి నాని విమర్శించారు. సినిమా ఆడకపోతే పవన్ కళ్యాణ్ కి నష్టం ఉండదు అని పేర్కొన్న కొడాలి నాని పవన్ కళ్యాణ్ కు తన రెమ్యునరేషన్ తనకు అందిందని అన్నారు. నర్సాపురం మీటింగ్ లో పవన్ కళ్యాణ్ సొంత అన్న చిరంజీవి పైనే విమర్శలు చేశాడని, గతంలో చిరంజీవి సతీసమేతంగా ముఖ్యమంత్రి ఇంటికి వచ్చిన విషయాన్ని పవన్ కళ్యాణ్ మర్చిపోయాడా? అని నాని ప్రశ్నించారు.

    చిరంజీవిని ఇంటికి పిలిచి భోజనం పెట్టిన విషయాన్ని పవన్ కళ్యాణ్ మర్చిపోయారా? అని నాని ప్రశ్నించారు. చిరంజీవిని పవన్ అవమానించ వచ్చా? సీఎం జగన్ వద్ద వంగి వంగి దండాలు పెడతారని చిరంజీవిని అంటారా? సీఎం అంటే రాష్ట్రానికి పెద్ద.. అందుకే చిరంజీవి జగన్ ని గౌరవించారు' అని నాని పేర్కొన్నారు. స్వయంగా చిరంజీవే భారతమ్మ తనను ఎంతో మర్యాదగా చూశారని చెప్పిన విషయం తెలియదా?? అని నాని ప్రశ్నించారు.

    Recommended Video

    Bheemla Nayak: Pawan Kalyan కోసం ఒక్క హీరో ముందుకు రాలేదు Naga Babu సంచలనం | Oneindia Telugu
     సీఎం వాహనమే వెళ్ళదు

    సీఎం వాహనమే వెళ్ళదు

    క్యాంపు కార్యాలయానికి స్వయంగా సీఎం వాహనమే వెళ్ళదు, సీఎం కూడా ఇంట్లో నుంచి నడుచుకుంటూనే క్యాంపు కార్యాలయానికి వెళతారు కానీ చంద్రబాబు లాంటి వాళ్ళు రాజకీయ ప్రయోజనాల కోసం ఈ విషయం మీద దుష్ప్రచారం చేస్తున్నారు అని కొడాలి నాని విమర్శించారు. మరో పక్క బిగ్ బాస్ విషయంలో కూడా సీపీఐ నారాయణ పై కొడాలి సెటైర్లు వేశారు.

    సీపీఐ నారాయణ వింత జంతువు అని పేర్కొన్న ఆయన నోటికి ఏది వస్తే అది మాట్లాడతాడని, తానో జాతీయ నాయకుడని అంటారని అన్నారు. రెండు ఎంపీ సీట్లు ఉన్న సీపీఐ జాతీయ పార్టీ అయితే మాకు 28 మంది ఎంపీలు ఉన్నారని అన్నారు. బిగ్ బాస్ షో వ్యభిచార కొంప అంటాడు అది కరెక్ట్ ఏనా అని ఆయన ప్రశ్నించారు.

    English summary
    Kodali nani slams pawan kalyan over comments about chiranjeevi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X