twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Singer KK మృతిపై అనుమానాలు.. తల, ముఖంపై గాయాలు!

    |

    భారత సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. మంగళవారం రాత్రి కలకత్తాలో ఒక లైవ్ కన్సర్ట్ లో పాల్గొని తర్వాత రూమ్ కి వెళ్ళిన ప్రముఖ గాయకుడు కృష్ణ కుమార్ కున్నత్ అలియాస్ కేకే హఠాన్మరణం పాలైన సంగతి తెలిసిందే. అయితే ఆయనది గుండెపోటు అనుకున్నారు కానీ ఇప్పుడు కొన్ని అనుమానాస్పద విషయాలు తెరమీదకు వస్తున్నాయి. ఆయన మృతి విషయంలో కొత్త అనుమానాలు రేకెత్తిన క్రమంలో ఆయన పోస్టుమార్టం రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నారు పోలీసులు. ఆ వివరాల్లోకి వెళితే

    సీసీటీవీ ఫుటేజ్ స్వాధీనం

    సీసీటీవీ ఫుటేజ్ స్వాధీనం

    హిందీ సహా దక్షిణాదిలో అనేక సినిమా పాటలు పాడి మంచి క్రేజ్ సంపాదించిన కృష్ణ కుమార్ కున్నత్ అలియాస్ కేకే హఠాన్మరణం ఇప్పుడు భారత సినీ పరిశ్రమ మొత్తాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టి వేసింది. కేకే హఠాన్మరణం పై ఇప్పుడు కొత్త అనుమానాలు ఏర్పడిన నేపథ్యంలో పోలీసులు ఆయనది అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఆయన పాల్గొన్న స్టేజ్ షో దగ్గర సీసీటీవీ ఫుటేజ్ సైతం స్వాధీనం చేసుకున్న పోలీసులు దానిని పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.

     బ్లాక్ స్పాట్స్

    బ్లాక్ స్పాట్స్


    దీనికి తోడు ఈ వ్యవహారంలో రాజకీయ నేతలు కూడా ఎంట్రీ ఇచ్చారు. సరైన వసతులు లేక కేకే మరణించారు అంటూ పశ్చిమ బెంగాల్ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. కేకే మృతదేహాన్ని పరిశీలించిన వైద్యులు ఆయన ముఖం మీద, తల పైన గాయాలు, ఉన్నాయని గుర్తించారని బహుశా గుండెపోటు కారణంగా పడిపోయినప్పుడు ఆయనకు ఈ గాయాలు తగిలిన ఉంటాయని వారు అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక పోలీసులు కూడా కేకే తలపై అలాగే పెదవులపై కొన్ని బ్లాక్ స్పాట్స్ గుర్తించారని తెలుస్తోంది.

     గుండె నొప్పిగా ఉందని

    గుండె నొప్పిగా ఉందని

    ఈ నేపథ్యంలోనే పోస్టుమార్టం రిపోర్టు కోసం ఎదురు చూస్తున్న పోలీసులు ఆయన బస చేసిన హోటల్ స్టాఫ్, అలాగే ఈవెంట్ ఆర్గనైజర్స్ ను కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారని తెలుస్తోంది. ఇక కేకే మృతదేహం ప్రస్తుతం కలకత్తా మెడికల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ లో ఉంది. తనకు గుండె నొప్పిగా ఉందని కేకే చెప్పిన వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. కాకపోతే ఆస్పత్రికి తరలించే సమయానికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

    మరేదైనా కారణం ఉందా

    మరేదైనా కారణం ఉందా

    ప్రస్తుతానికైతే పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. ప్రాథమికంగా అయితే ఆయనకు గుండెపోటు వచ్చిందని భావిస్తున్నారు. కానీ పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాతే ఆయన మరణానికి సంబంధించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం కనిపిస్తోంది. పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆయన సహజ మరణం అయినా లేక మరేదైనా కారణం ఉందా అనే విషయం మీద కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది.

    ముంబైలో కేకే అంత్యక్రియలు

    ముంబైలో కేకే అంత్యక్రియలు


    ఇప్పటికే కేకే మరణ వార్త గురించి తెలుసుకున్న కుటుంబ సభ్యులు కలకత్తా చేరుకున్నారు. కేకే మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయిన తర్వాత డెడ్బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం కనిపిస్తోంది. ముంబైలో కేకే అంత్యక్రియలు జరిగే అవకాశం ఉన్నట్లు చెబుహతున్నారు. భౌతిక కాయాన్ని ముంబైకు తరలించనున్న సమయంలో విమానాశ్రయంలో పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం గన్‌ సెల్యూట్‌ చేయనుందని సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు.

    English summary
    Kolkata Police Registers 'Unnatural Death' Case on Krishna Kumar Kunnath's death.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X